Thursday, 19 March 2026

Blog

విశాఖపట్నం

మల్కాపురంలో మెగా జాబ్ మేళా: భారీగా హాజరు అయిన యువత

గాజువాక , మల్కాపురం, నవంబర్ (పున్నమి ప్రతినిధి) పారిశ్రామిక ప్రాంత యువతీ–యువకుల ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో మల్కాపురంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారథ్యంలో మరిడిమాంబ కళ్యాణ మండపంలో ఈ జాబ్ మేళా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే యువత భారీగా తరలివచ్చి రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద క్యూలు కట్టారు. మొత్తం 25 ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా, ఎస్ఎస్సి నుండి బీటెక్ వరకు వివిధ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులో ఉంచారు. పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు, టెక్నికల్, నాన్–టెక్నికల్ విభాగాల్లో వందలాది ఉద్యోగ అవకాశాలు ప్రతిపాదించడంతో యువతలో ఉత్సాహం వెల్లివిరిసింది. స్థానిక ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో జాబ్ మేళా జరగడం మొదటిసారి కావడంతో పాల్గొన్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. గణబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన ఓటమి ప్రభుత్వము యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు.

E-పేపర్

రేపటి నుంచి నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గయ్య 9640204826 రేపటి నుంచి నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పెద్దలకు టికెట్ రేట్లు ఒకవైపు ప్రయాణానికి రూ. 2,000, రెండు వైపులా ప్రయాణానికైతే రూ.3,250గా టికెట్ రేట్లు ఖరారు చేశారు. పిల్లలకు(5-10) వన్ వే అయితే రూ.1,600, రెండు వైపులా ప్రయాణానికి రూ.2,600గా నిర్ణయించారు. టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

E-పేపర్

58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగింపు

నందలూరు -నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లి గ్రంథాలయంలో శుక్రవారం 58వ గ్రంథాలయ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగిరెడ్డిపల్లె సర్పంచ్ జంబు సూర్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి అనంతకృష్ణ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగనపల్లి వెంకటరమణ, జ్ఞాన దీప్తి ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మి, గ్రంథాలయ అధికారి శివశంకర్ రాజు, ఉపాధ్యాయుడు జి.కృపానందం తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, పుస్తకం ఒక మంచి స్నేహితుడని, పుస్తక పఠనం ద్వారా మంచి ఆలోచనలు, ఆరోగ్యం, భవిష్యత్తులో మంచి పౌరుడిగా ఎదగడానికి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జ్ఞాన నేత్రాన్ని ఇస్తారని, విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్, జ్ఞాన దీప్తి హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గ్రంథాలయాధికారి రవిశంకర్ రాజు, రవికుమార్ మాచుపల్లి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

నిరంతర సామాజిక సేవకుడు సూరపు రెడ్డి: గంగుమళ్ళ

సీనియర్ జర్నలిస్ట్ రమణ, నవంబర్ 21: సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన మానవతా సేవా కార్యక్రమం హృదయాలను హత్తుకుంది.సమాజంలో ఎవరికైనా జీవితంలో ఒక దశలో సహాయం అవసరం కావచ్చు అన్న భావనతో గ్రామంలో వృద్ధాప్యం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులను గౌరవంగా ఆదుకోవడమే లక్ష్యంగా స్వామి వివేకానంద సమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.సమితి అధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబి మాస్టర్)జియంసి బాలయోగి కాలనీకి చెందిన కమ్మసత్తి వెర్రిమ్మ మరియు భీమవరపు పేటకు చెందిన పెండెం బాలయ్య జీవనోపాధి నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని వారి స్వాభిమానాన్ని దెబ్బతీయకుండా సమయోచిత సహకారం అందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన సూరపురెడ్డి సురేష్ తెలియజేయగా స్పందించిన దాతలు ఎటువంటి ప్రచారాపేక్ష లేకుండా నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించడానికి ముందుకు వచ్చి మానవతా విలువలను మరింతగా నిలబెట్టారు. ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన నాయకులు గాలిదేవర బుల్లియ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం కోసం సద్వినియోగం చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు,మనం చేసుకునే పుట్టినరోజులను కూడా సమాజానికి అంకితం చేస్తే ఎంత మంచి జరుగుతుందో మచ్చుతునకగా చూపించారు.అలాగే ఆర్థిక సహకారాన్ని అందజేసిన సామాజిక సేవకులు జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు శ్రీమతి గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణా శ్రీనివాస్ దంపతులు.వారు మాట్లాడుతూ ఎవరికైనా ఒక సమయంలో సహాయం అవసరం కావచ్చు అలాంటప్పుడు పరస్పరం అండగా నిలబడటం మనిషితనానికి నిజమైన అర్థమని అన్నారు.ఎవరి మనోభావాలూ దెబ్బతగిలకుండా గౌరవంతో ఇచ్చే సహాయం సమాజాన్ని మరింత సుస్థిరంగా మారుస్తుందని పేర్కొన్నారు.మానవత్వం అనేది మాటల్లో కాదు మన ధర్మంగా భావించి చేసే సాత్విక చర్యల్లోనే కనిపిస్తుందని భావోద్వేగంతో తెలిపారు.గ్రామం ఒక కుటుంబమైతే పరస్పర సహకారం అందరం భాగస్వాములమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గోలకోటి కృష్ణారావు, యనమదల వెంకట రమణ, నల్లా చంద్రశేఖర్, గాలిదేవర సతీష్, యర్రంశెట్టి కృష్ణ, భీమవరపు రాజేశ్వరి, పితాని శ్రీను, కడలి పెద్ద, కొత్తపల్లి సతీష్ పాల్గొని కార్యక్రమాన్ని హృద్యంగా కొనసాగించారు.

కామారెడ్డి

రైతులకు భేషరతుగా శీతక్క క్షమాపణ చెప్పాలి.

– మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కామారెడ్డి, 21నవంబర్, (పున్నమి ప్రతినిధి ) : మంత్రి సీతక్క బేషరుతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి – ఎమాజీల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం పర్యటనకు వచ్చారు.మంత్రి శ్రీమతి సీతక్క,అక్కడ బోనస్ ఇవ్వాలని వచ్చిన రైతులతో మంత్రి సీతక్క సంఘర్షణ ఏర్పడింది. రైతులు తమ వరి ధాన్యం కొనుగోలు చేయక అధిక సమ యాలు కాలాయపణ, బోనస్ చెల్లింపులు ఆలస్యం జరపడాన్ని డిమాండ్ చేశారు. అయితే మంత్రి సీతక్క రైతులపై అసహనం, కఠినంగా ప్రవర్తించి “మీరు అసలు రైతులే కాదని” అనీ, రైతులను అడ్డుకుంటూ వారిపై కేసులు పెట్టడాన్ని అమలులో పెట్టారని తీవ్ర విమర్శలకు గురయ్యారు.ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండించారు.రైతుల పక్షంలో నిలబడి చెప్పారు. సీతక్క వ్యవహారం అసభ్యకరమైనదిగా, రైతుల బాధలను వినకపోయినట్లు విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వంలో పంటలను సకాలంలో కొను గోలు చేసి, డబ్బులు చెల్లింపులను చేశారని చెప్పా రు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తప్ప రైతుల పట్ల ప్రాముఖ్యత ఇవ్వడంలేదని, అమలు కాని హామీలతో రైతులను మోసం చేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జాజాల సురేందర్ రామారెడ్డి రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, ప్రభుత్వం వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగె ల శ్రీనివాస్, గురిజాల నారాయణ రెడ్డి, మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్లు నాయకులు టిఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత ఔన్నత్య గానము – రాజంపేట పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్

యునైటెడ్ కింగ్‌డమ్‌ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారతదేశ ఔన్నత్యం,అభివృద్ధి దిశ, ప్రపంచ శాంతి తత్వంపై రాజంపేట బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ఆభిమానపూర్వకంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే దశాబ్దాల్లో వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ముఖ్యంగా వసుధైవ కుటుంబకం అనే భారతీయ సంస్కృత మూలసూత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ దేశాలు పరస్పరం శాంతి, సౌహార్దతతో ముందుకు సాగాలని ప్రధాని మోడీ విజన్ ఉందని తెలిపారు.ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదిగి వాణిజ్యపరంగా,మానవతా పరంగా,అభివృద్ధి తత్వాల పరంగా ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని వివరించారు.భారతదేశం భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రథమ స్థానాన్ని సాధించే శక్తి ఉన్నదని ధృవీకరించారు.అలాగే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నదని, బీజేపీ ప్రభుత్వంలో అమలవుతున్న పలు అభివృద్ధి పథకాలు భారతదేశాన్ని వేగంగా పురోగమించే దిశగా నడిపిస్తున్నాయని వివరించారు.భారత్ ప్రపంచానికి ఇవ్వబోయే మార్గదర్శకత,శాంతి సందేశం, ఆర్థిక శక్తి,రాజకీయ స్థిరత్వం గురించి ఆయన చేసిన విశ్లేషణకు సభలో హాజరైనవారి ప్రశంసలు లభించాయి.

అన్నమయ్య

పోలీసు అధికారులతో హెచ్‌ఆర్‌పీసీఐ నేత భేటీ

-రైల్వేకోడూరులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐలకు శుభాకాంక్షలు చిట్వేల్, నవంబర్ 21 పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఇటీవల విధుల్లో చేరిన రూరల్ మరియు అర్బన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లను (సీఐలు) హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఆర్‌పీసీఐ)ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.హెచ్‌ఆర్‌పీసీఐ రైల్వే కోడూరు నియోజకవర్గ చైర్మన్ అందె వెంకటేష్ శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, అలాగే అర్బన్ సీఐ చంద్రశేఖర్ వేర్వేరుగా కలిశారు. -శాంతిభద్రతలపై చర్చ: ఈ సందర్భంగా అందె వెంకటేష్ మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐలకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి హెచ్‌ఆర్‌పీసీఐ తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ, మహిళల భద్రతకు సంబంధించి తాము చేపట్టే కార్యక్రమాలలో పోలీసుల భాగస్వామ్యం కోరారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐలు కూడా హెచ్‌ఆర్‌పీసీఐ ప్రతినిధులుగా అందె వెంకటేష్‌ను గౌరవించి, వారిని సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడానికి కృషి చేస్తామని నూతన సీఐలు తెలియజేశారు.ఈ మర్యాదపూర్వక కలయిక నియోజకవర్గంలో పోలీసు మరియు పౌర సమాజం మధ్య మంచి సమన్వయానికి దోహదపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

తెలంగాణ

నెల్లికల్ తండా ను సందర్శించిన : ఎమ్మెల్యే , కలెక్టర్

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) చెంచుల సమస్యల పరిష్కారానికి చెంచుల చెంతకే వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా అధికార యంత్రాంగం తో సహా నెల్లికల్ చెంచు వాని తండా సందర్శన, తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ తమ వద్దకే వచ్చినందుకు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపిన చెంచులు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సీరియస్ గా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ చెంచువాని తండాకు చెందిన ఆదెమ్మ ఒక పిటిషన్ ను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్ కార్డులు, వివిధ దృవపత్రాలు లేనందున, తమ తండావాసులు అందరూ ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని, మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే తమకు ప్రభుత్వ లబ్ధి అందడం లేదని పిటిషన్ లో ఉన్నది. ఈ విషయాన్ని సావదానంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఒక చెంచు మహిళా సుదూర ప్రాంతం నుండి నల్గొండకు వచ్చి సమస్యలను చెప్పడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నేరుగా నెల్లికల్ చెంచువాని తండాకి వెళ్లి చెంచు తండావాసుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. వెంటనే నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుండూరు రఘువీర్ రెడ్డితో మాట్లాడి, చెంచుల సమస్యల పరిష్కారానికి నెల్లికల్ చెంచువాని తండాకి వెళ్దామని అందుకు సమయం కేటాయించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే అంగీకరించడంతో శుక్రవారం ఉదయమే జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో సహా శాసనసభ్యులు కలిసి నెల్లికల్ చెంచు తండాకి చేరుకున్నారు ఉదయమే తమ తండాకు వచ్చిన జిల్లా కలెక్టర్ఎ,మ్మెల్యేలను చూసి చెంచు ప్రజలు సంతోషంతో స్వాగతం పలికారు.

హైదరాబాద్

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహణకై వినతి

*ఇన్ సర్విస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర శాఖ వినతి* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ 21/ 11/ 2025* *ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ వేసవి సెలవుల్లో నిర్వహించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు,గౌరవ అధ్యక్షులు, ఎం .ఎన్ విజయకుమార్, విజ్ఞప్తి చేశారు ఇప్పుడు జనవరిలో నిర్వహించినట్లయితే అటు విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్నది ఎందుకంటే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయ లోకమంతా నిమగ్నై నిమగ్నమై ఉన్నందున వారికి వేసవి సెలవుల్లో ప్రత్యేక నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు*

హైదరాబాద్

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహణకై వినతి

*ఇన్ సర్విస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర శాఖ వినతి* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ 21/ 11/ 2025* *ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ వేసవి సెలవుల్లో నిర్వహించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు,గౌరవ అధ్యక్షులు, ఎం .ఎన్ విజయకుమార్, విజ్ఞప్తి చేశారు ఇప్పుడు జనవరిలో నిర్వహించినట్లయితే అటు విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్నది ఎందుకంటే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయ లోకమంతా నిమగ్నై నిమగ్నమై ఉన్నందున వారికి వేసవి సెలవుల్లో ప్రత్యేక నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.