Thursday, 19 March 2026

Blog

విశాఖపట్నం

25వ జాతీయ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్*

*25వ జాతీయ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి* నవంబర్ 15 నుంచి 18 వరకు హైదరాబాద్ లో గచ్చిబౌలి నందు GMC బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన 25వ జాతీయ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ లో గెలుపొందిన విశాఖపట్నం పారా స్విమ్మింగ్ క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అభినందించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్షిప్ లో విశాఖపట్నం జిల్లాకు చెందిన క్రీడాకారులు వలసనైని రవి 100 mts Free style లో బంగారు పతకం, 50mts back stroke లో రజత పతకం, కౌశర్ సాహిల్ షేక్ 50 Mts back stroke లో స్వర్ణ పతకం, 50 mts Free style లో స్వర్ణ పతకం, 100 mts Free style లో రజత పతకం, అడారి ప్రణీత్ 50 mts back stroke లో స్వర్ణ పతకం, 100 mts Back stroke లో స్వర్ణ పతకం, 100 mts Free style లో కాంస్య పతకం, నిధి బైపోతు 100 mts back stroke లో స్వర్ణ పతకం, 50 Mts Free style లో రజత పతకం, సాలపు పూర్ణ చంద్ర రావు 100 mts Free style లో కాంస్య పతకం, 50 mts Free style లో కాంస్య పతకం, M.సాయి నిఖిల్ గౌతమ్ 100 Mts Breast Stroke లో కాంస్య పతకాలు కావ్య 50 ఫ్రీ స్టైల్ లో బంగారు పతకం సాధించారు. ఈ క్రీడాకారులను జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ నందు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని విశాఖపట్నం జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా దివ్యాంగుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, విశాఖపట్నం జిల్లా పారా స్పోర్ట్స్ గౌరవ అధ్యక్షులు శీతల్ మదన్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సెక్రటరీ వి.రామస్వామి, అసోసియేషన్ సభ్యురాలు లక్ష్మీ, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

క్రియేటివ్ హబ్ గా వైజాగ్ – దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ *

*క్రియేటివ్ హబ్ గా వైజాగ్ – దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖ రానున్న రోజుల్లో క్రియేటివ్ రంగానికి హబ్ గా మారనుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు విశాఖ, విశాఖ పరిసరాల్లో ప్రారంభమయ్యాయన్నా. సీనియర్ జర్నలిస్టు ఎం.ఎన్.ఆర్. స్థాపించిన బిజ్ హబ్ క్రియేషన్ సంస్థను ఆయన ప్రారంభించారు. అన్ని రకాల క్రియేటివ్ కంటెంట్, బెస్ట్ గ్రాఫిక్స్, ఎడిటింగ్ సర్వీసెస్ అందించే సంస్థ విశాఖలో ప్రారంభించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన ఇలాంటి సేవలు విశాఖలో రావడం అభినందనీయమన్నారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి ఎంతోమంది సినీ, క్రియేటివ్ రంగాల్లో సక్సెస్ సాధించారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర, మరీముఖ్యంగా విశాఖపట్నంలో అన్ని రంగాల్లో ప్రతిభావంతులున్నారని, రానున్న రోజుల్లో వారందరికి సరైన గుర్తింపు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ వేదికగా 30 వ సి.ఐ.ఐ. బిజినెస్ సమ్మెట్ ను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖలతో పాటుగా పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

విశాఖపట్నం

మత్స్యకారులకు ప్రభుత్వ ఆసరా* *వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా*

*మత్స్యకారులకు ప్రభుత్వ ఆసరా* *వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా* ,విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *_ బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్ల డీజిల్ కు లీటరుకు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారులకు రూ.5 లక్షల బీమా, 50 ఏళ్లు దాటితే పెన్షన్ వర్తింపజేసినట్టు వెల్లడించారు. సముద్రంలోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వచ్చే దాకా కుటుంబం ఆందోళనలోనే ఉంటుందని, మత్స్యకారులకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్థానిక మత్స్యకారులు ఎప్పటి నుంచి అడుగుతున్న పక్కా ఇళ్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు పెద్ద ఉప్పాడలో రూ.1.39 కోట్లతో ప్రతిపాదించిన మత్స్యకారుల బహుళార్థ సాధక కేంద్రానికి.. చేపలు ఆరబెట్టే 7 ఫ్లాట్ ఫాం లకు శంకుస్థాపన చేశారు. మంగమారిపేటలో 30 మందికి రూ.6 లక్షల విలువైన సీవీడ్ రాఫ్ట్ లను అందించారు. చేపల తిమ్మాపురంలో మోటార్లు తదితర పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఎమ్మార్వో రామారావు, కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, పాసి నరసింగరావు, గరికిన ఎల్లాజీ, పాసి త్రినాథరావు, గొలగాని నరేంద్ర, చెట్టుపల్లి సన్యాసిరావు, సారిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలపై డాక్టర్ కందుల ధ్వజం

కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలపై డాక్టర్ కందుల ధ్వజం ★ టిడిపి వార్డుల అభివృద్ధికి రూ. 100 కోట్ల పనులు అప్పజెప్పడం పై అభ్యంతరం ★ జనసేన కార్పొరేటర్లకు మొండి చేయి చూపించడం పై ఆగ్రహం ★ మేయర్ ను నిలదీసిన డాక్టర్ కందుల *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి * విశాఖ నగరంలోని నియోజకవర్గాల పరిధిలో వార్డుల పరంగా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధుల విషయంలో జనసేన పార్టీకి కౌన్సిల్ అన్యాయం చేసిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ధ్వజమెత్తారు. కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి కేవలం రెండు నియోజకవర్గాలలో తూతూ మంత్రంగా అభివృద్ధి నిధులు కేటాయించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు రూ. 100 కోట్ల రూపాయల నిధులను టిడిపికి కేటాయించడం పట్ల మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా ఒక పార్టీ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ ఆయన తెలియజేశారు. జనసేన పట్ల ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు అంటూ నేరుగా మేయర్ ను నిలదీశారు. మేయర్ కార్పొరేటర్ గా ఉన్న సమయంలో కూటమి పార్టీలకు సమ ప్రాధాన్యత ఉండాలని చెప్పిన వ్యక్తి మేయర్ అయ్యాక ఆ విషయం మర్చిపోయి కేవలం టిడిపికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ప్రభుత్వంలో ఒక భాగం కాదా అంటూ ప్రశ్నించారు. టిడిపి కి ఒక న్యాయం జనసేన పార్టీకి మరొక న్యాయమా అంటూ మండిపడ్డారు. అభివృద్ధినిధుల కేటాయింపు విషయంలో జనసేన పార్టీకి పూర్తిగా అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నిక విషయంలో జనసేన పార్టీ పూర్తిగా సహకరించినందుకు తమకు ఈ విధంగా అన్యాయం జరగవలసిందేనా అంటూ ప్రశ్నించారు. నిధుల కేటాయింపు విషయంలో జనసేన పార్టీ కేడర్ మొత్తం మేయర్ వ్యవహార శైలి పై ఆగ్రహంగా ఉందని చెప్పారు. ఇక టిడిపి అన్ని విషయాలలోనూ జనసేన పార్టీని పక్కన పెట్టేసి ఇలాగే కొనసాగుతాం అంటే అది మీ ఇష్టం అని అన్నారు. జనసేన పార్టీపై వివక్ష చూపిస్తూ జనసేన కార్పొరేటర్ లు ఉండే వార్డుల అభివృద్ధికి సహకరించకుండా ఏకపక్షంగా టిడిపి వ్యవహరించిన తీరుపై డాక్టర్ కందుల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

జీవీఎంసీ కౌన్సిల్ లో గళం వినిపించిన గంకల కవితా అప్పారావు యాదవ్

48 వ వార్డులో మసకబారిన వీధి దీపాల స్థానంలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరిన గంకల పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలని,ప్రధాన జంక్షన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ వినతి అందజేత వార్డు పర్యటనకు రావాలని మేయర్,జీవీఎంసీ కమీషనర్ ను కోరిన గంకల జీవీఎంసీ కౌన్సిల్ హాల్ శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ వార్డు సమస్యలపై గళం వినిపించారు. వార్డులో చాలావరకు మౌలిక వసతులు సమస్యలు లోపం ఉందని వార్డు అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలని కోరారు.48 వార్డులో కొండ ప్రాంతం కావడంతో వీధి దీపాలు లేకపోవడంతో చీకటి ప్రదేశాలు ఎక్కువగా ఉండడంతో చిల్లర దొంగతనాలు,ఆటో బ్యాటరీలు దొంగతనాలు మేడల మీద పడుకునే సమయంలో చిల్లర దొంగతనాలు చేయడం జరుగుతుందని, చీకటి ప్రదేశం ఎక్కువగా నెలకొనడం వలన ఆకతాయిల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వార్డులో 70 ఎంఎం వీధి దీపాలు, రింగ్ పోల్స్, సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.వార్డులో జీవీఎంసీ మేయర్ పర్యటన చేసి,మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని కోరారు. అందులో భాగంగా పైన తెలిపిన సమస్యలపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ కు వినతి అందజేసి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చూపాలని కోరారు.వార్డులో ప్రధాన జంక్షన్ లు కాకుండా చిన్న చిన్న ప్రాంతాలలో 6 మీటర్ల జిఐ పోల్స్ ను ఏర్పాటుచేసి వాటికి నూతన ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసి వార్డును చీకటి రహిత ప్రాంతంగా నెలకొల్పాలని కోరారు. కొండవాలు ప్రాంతం కావడంతో తక్కువ మంది పారిశుధ్య కార్మికులతో వార్డులో పారిశుధ్య సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదని అదనంగా పారిశుధ్య కార్మికులు పెంచాలని,పారిశుధ్య పనులకు కావాల్సిన పనిముట్లను ఏర్పాటు చేయాలనీ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,స్మశాన వాటికను కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని ప్రభుత్వ ఆస్తులు వద్ద కనీస సెక్యూరిటీ లేక ఆకతాయిలు,మందుబాబులు ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేసి అక్కడికి వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోగ్య కేంద్రం,స్మశాన వాటిక వద్ద సెక్యూరిటీ గార్డును,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,ప్రధాన జంక్షన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, వార్డులో నూతనంగా టెండర్ల పనులు మొదలు పెట్టాలని,వార్డు అభివృద్ధిలో భాగంగా ఉన్న సమస్యలపై నూతనంగా టెండర్లను పిలవాలని కోరారు.వార్డు పర్యటనకు రావాలని మేయర్,జీవీఎంసీ కమీషనర్ ను కోరారు.ఈ సమస్యలపై మేయర్ సానుకూలంగా స్పందించారని గంకల కవితా అప్పారావు యాదవ్ తెలిపారు.

తిరుపతి

సెన్యార్‌ తుఫాన్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగాఉండాలి:తహసీల్దారు

రానున్న రెండు రోజుల్లో జిల్లాలో సెన్యార్‌ తుఫాన్‌ ప్రభావం ఉంటుందని శ్రీకాళహస్తి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు జనార్థన్‌రాజు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.బంగాళాఖాతంలో సేన్యార్‌ తుఫా హెచ్చరికలు ఉందని ఈ సమయంలో మండల ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.మండల, గ్రామస్థాయి, అధికారులు,సచివాలయ సిబ్బంది తుఫాన్‌ పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానవ నష్టం,జంతునష్టం నివారించేందుకు పనిచేయాలన్నారు.అదే విధంగా తుఫాన్‌ ప్రభావంపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని ప్రజలు ఏదైనా అవసరం ఉంటే 9491077045 నెంబరును సంప్రదించాలన్నారు.

విశాఖపట్నం

ఐ ఐ ఏ ఎం బిజినెస్ స్కూల్‌లో ఆధ్వర్యంలో నేవల్ డాక్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగులకు అవగాహన సదస్సు”

ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్ బిజినెస్ స్కూల్’ , నేవల్ డాక్‌యార్డ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నేవల్ డాక్‌యార్డ్ పదవీ విరమణ పొందిన సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల కోసం స్థానిక ఎంవీపీ కాలానీలోగల ఐ ఐ ఎ ఎం సెమినార్ హాల్‌లో శుక్రవారం “అవగాహన సదస్సు” నిర్వహించారు.ఈ సదస్సులో పదవీ విరమణ అనంతరం సమగ్రమైన ఒత్తిడులను ఎదుర్కొనే జీవన సరళిని లక్ష్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబ సంక్షేమం ఆరోగ్యం సంరక్షణ, సామాజిక ఆధ్యాత్మిక పరమైన జీవన విధానం,ప్రశాంతమైన జీవితానికి ఆర్ధిక పరమైన అవగాహన తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఐ ఐ ఎ ఎం డీన్ & సెక్రటరీ డా. ఎస్. పి. రవీంద్ర స్వాగత ప్రసంగం చేస్తూ మానవతా దృక్పథంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన నేవల్ డాక్‌యార్డ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితం ముగిసినా, వ్యక్తిగత అభివృద్ధి, జీవితాంతం,విద్య కొనసాగుతూనే ఉండాలని నొక్కిచెప్పారు. ముఖ్య అతిథి ఆచార్య వి. బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తన పదవీ విరమణ తదనంతర అనుభవాలు పంచుకుంటూ, ఆరోగ్య పరిరక్షణతో కూడిన జీవితం సంతృప్తికర దశగా కొనసాగిస్తూ,సామాజిక సేవకు పునరాంకితమవ్వాలన్నారు. ఆర్ఇఏడి గ్రూప్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వి. కృష్ణ మోహన్ కార్యక్రమ నిర్మాణం, లక్ష్యాలను వివరిస్తూ, పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల వైవిధ్యమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక పటిమ, ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు, ఆధ్యాత్మిక మైండ్‌ఫుల్‌నెస్ అంశాల్లోని ప్రయోజనాలను వివరించారు. సీఈవో – ఎస్ డి ఐ ఇమ్తియాజ్ పదవీ విరమణ కొత్త అవకాశాలకు పునాది వేస్తుందన్నారు. సేవా జీవితంలో అనేక పరిమితులు ఉన్నప్పటికీ, పదవీ విరమణ అనేది ముగింపు కాదని,పనితనంలో మార్పు మాత్రమే నన్నారు. వ్యక్తిగత ఆసక్తులు,అభిరుచులు అన్వేషించాలని, విశాఖపట్నం వేగంగా అభివృద్ధిచెందుతున్నదనీ, విభిన్న రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయనీ తెలిపారు. గౌరవ అతిథి కెప్టెన్ ఆర్. ఆర్. కె. మూర్తి (రిటైర్డ్) తన నౌకాదళ అనుభవాలను పంచుకుంటూ, పదవీ విరమనంతరం ఆర్థిక భద్రత కోసం కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక అవసరమన్నారు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం నడక, వ్యాయామం చేయాలని సూచించారు. ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీనివాస్ పొతిరెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం స్టార్ట్-అప్స్‌లో పెట్టుబడులు దిశగా అలోచించాల న్నారు. ఉద్యోగానంతర జీవితం — గుర్తింపు, లక్ష్యం” అనే అంశంపై డా. సుశ్మిత గజులా (సైకాలజిస్ట్), మాట్లాడుతూ భావోద్వేగ, మానసిక మార్పులను, స్వీయ గుర్తింపు ఆర్థిక శ్రేయస్సు ముఖ్య మన్నారు. కమాండర్ వి.ఎస్.సి. రావు (బ్యాంక్ ఆఫ్ బరోడా), తేజ పెన్షన్ నిర్వహణ, పెట్టుబడులు, డిజిటల్ భద్రత, ఆన్‌లైన్ మోసాల నుండి రక్షణ వంటి ముఖ్య విషయాలను చర్చించారు. డా. నీరజ వెటరన్స్,జీవిత భాగస్వాముల ఆరోగ్యం- పై ప్రసంగిస్తూ వైద్యం, మానసిక ఆరోగ్యం, వెటరన్స్‌కు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వివరించగా, ప్రొఫెసర్ నిమాలి “మైండ్‌ఫుల్‌నెస్, సంబంధాలు & ఆధ్యాత్మిక సమన్వయం,ధ్యానం, శ్వాసాభ్యాసాలు, ఆత్మపరిశీలన వ్యాయామాలు నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా ప్రొఫెసర్ ఏ. నరసింహ రావు, గౌరవ అతిథులుగా గ్రూప్ కెప్టెన్ ఎ. ప్రభాకర్, కె. కుమార్ రాజా (ఎండి, కుమార్ రాజా కన్స్ట్రక్షన్స్) హాజరయ్యారు. ప్రొఫెసర్ వి. కృష్ణ మోహన్, డా. ఉజ్వల్ కుమార్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ కృష్ణ మోహన్ పదవీ విరమణ ఒక కొత్త ఆరంభమని, వ్యక్తిగత అభివృద్ధి సామాజిక సేవకు ఇది గొప్ప దశ అని పేర్కొన్నారు. ఐ ఐ ఎ ఎం ఫ్యాకల్టీ డా. ఉమా సుందరి, ఎన్ఐపిఎం సెక్రటరీ డా.కృష్ణ కుమారి సమన్వయకర్త లుగా వ్యవహరించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన దొన్నుదొర

ప్రజా వేదిక కు వచ్చిన మౌళిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర హామీ ఇచ్చారు. శుక్రవారం అరకులోయ లోని దొన్నుదొర క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 48 వినతులు వచ్చాయని అన్నారు. ఈ గ్రీవెన్స్ కు వివిధ గ్రామ మౌళిక సదుపాయాలు, సామాజిక పింఛన్లకు సంబందించిన వినతులు వచ్చాయని దొన్నుదొర క్యాంపు ఆఫీసు ప్రతినిధి తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ డుంబ్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు లొక్కోయి మహేదేవ్కి కిల్లో ఆనందరావు టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకులోయ లో ఐక్యత యాత్ర: మై భారత్ విశాఖపట్నం డీడీ

సర్ధార్‌ వల్లభ భాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా వచ్చే వారం అల్లూరి జిల్లా అరకులోయ లో ఐక్యత యాత్ర నిర్వహిస్తున్నట్లు మై భారత్ విశాఖపట్నం డీడీ జి మహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐక్యత యాత్ర అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ట్రైబల్ మ్యూజియం వరకు ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు పి వి సత్యన్నారాయణ హజరవుతారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ పీవోలు పి నాగబాబు వై విజయలక్ష్మి ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత ఆర్ లీలా ప్రసాద్ పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అడ్డతీగల: క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ పై పంచాయితీ సిబ్బందికి శిక్షణ

అడ్డతీగల మండలం, కొనలోవ గ్రామము నందు మండలం లోని పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్రాలు, సీఆర్పీ లకు క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ థీమ్-5 పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో swpc షెడ్ నిర్వహణ, వర్మీ తయారు చేయడం పై అవగాహన కల్పించినట్లు ఎంపీడీఓ ఏవివి కుమార్ తెలిపారు. శిక్షణ పొందిన వారిని టీమ్ లు గా విభజించి వీధులలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ను నిర్వహించారు. ఈ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో 3 టన్నుల చెత్తని సేకరించినట్లు ఎంపీడీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓ వై. గణేష్ బాబు, స్థానిక సర్పంచ్ బి.అర్జమ్మ , 22 గ్రామ పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్రాలు మరియు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.