Thursday, 19 March 2026

Blog

విశాఖపట్నం

మన పల్లెకు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగాపర్యటించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.*

*మన పల్లెకు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బోధవలస గ్రామం మరియు ఎల్లిప్పి గ్రామాలలో పర్యటించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో చేపట్టిన మన పల్లెకు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. ఆయనతో పాటుగా సబ్బవరం మండలం అన్ని శాఖల మండల అధికారులు పాల్గొన్నారు ముందుగా బోదవలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రియతమనాయకునికి ప్రజలు నీరాజనాలు పట్టారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు పలు వినతులు అందచేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, చేతి బోర్లు, గృహ నిర్మాణాలు, స్థల కేటాయింపులు, కళ్యాణమండపం నిర్మాణం వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయా సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్తమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుభిక్షమైన రీతిలో జీవనం సాగించాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను దపాదపాలుగా సంవత్సరంలోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో సబ్బవరం మండలం ప్రజా పరిషత్ అధికారి పద్మజా, మండల రెవెన్యూ అధికారి చిన్ని కృష్ణ , శాసనసభ్యులు సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు , మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు , గొంప నర్సింగరావు , మండల సీనియర్ సాలాపు వెంకటేశ్వరరావు , ఇందల రమణ, బల్రెడ్డి అప్పారావు , మిడతాన మహాలక్ష్మి నాయుడు ,బోధవలస గ్రామం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంచిపాటి రాంబాబు , గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంతకోరు సూర్యనారాయణ , ఎలిప్పి గ్రామం సర్పంచ్ ఉగ్గిన దేవుడమ్మ ,ఎలిప్పి గ్రామ ఎంపీటీసీ ఉగ్గిన లక్ష్మీ రాము,అమర పిన్ని నర్సింగరావు , పాపన్న ఎల్లాజీ , కర్రి విగ్నేష్ , ఉగ్గిన దిలీప్ , కొట్టాడ గణేష్ , దారపు కృష్ణ , తుంపాల శ్రీనివాస్ , కోటేశ్వరరావు , మండల నాయకులు ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు , సర్పంచ్ మామిడి శంకర్రావు ,బొకం స్వామి నాయుడు , ఆకుల గణేష్, రోమాల చంద్రశేఖర్ ,సరగడం రాము , బంతి కోళ్ల పద్మా, బుదిరెడ్ల కనకరాజు, గొర్లి కుమారస్వామి , గుల్లిపిల్లి మాజీ సర్పంచ్ నరసింగరావు గారు,కిల్లి వెంకట సత్యనారాయణ గారు,తాటిపాముల శేఖర్ , పల్లి మంగరాజు , తామాడ సత్యనారాయణ , మేడపాటి రాము , పడాల వెంకటరమణ , రేసుపూడి రమణ, హర గోపాల్ ,పిన్నింటి పార్వతి , హైమావతి ,రాపర్తి కిషోర్ , తనకాల శ్రీనివాసరావు , డీలర్ ఎల్లాజీ , హరి హర సబ్బవరం మండలం ఉన్నతాధికారులు మరియు సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహా కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క పర్యటన కార్యక్రమంలో పాల్గొన్నారు

విశాఖపట్నం

మన పల్లెకు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగాపర్యటించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.*

*మన పల్లెకు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బోధవలస గ్రామం మరియు ఎల్లిప్పి గ్రామాలలో పర్యటించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో చేపట్టిన మన పల్లెకు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. ఆయనతో పాటుగా సబ్బవరం మండలం అన్ని శాఖల మండల అధికారులు పాల్గొన్నారు ముందుగా బోదవలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రియతమనాయకునికి ప్రజలు నీరాజనాలు పట్టారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు పలు వినతులు అందచేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, చేతి బోర్లు, గృహ నిర్మాణాలు, స్థల కేటాయింపులు, కళ్యాణమండపం నిర్మాణం వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయా సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్తమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుభిక్షమైన రీతిలో జీవనం సాగించాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను దపాదపాలుగా సంవత్సరంలోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో సబ్బవరం మండలం ప్రజా పరిషత్ అధికారి పద్మజా, మండల రెవెన్యూ అధికారి చిన్ని కృష్ణ , శాసనసభ్యులు సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు , మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు , గొంప నర్సింగరావు , మండల సీనియర్ సాలాపు వెంకటేశ్వరరావు , ఇందల రమణ, బల్రెడ్డి అప్పారావు , మిడతాన మహాలక్ష్మి నాయుడు ,బోధవలస గ్రామం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంచిపాటి రాంబాబు , గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంతకోరు సూర్యనారాయణ , ఎలిప్పి గ్రామం సర్పంచ్ ఉగ్గిన దేవుడమ్మ ,ఎలిప్పి గ్రామ ఎంపీటీసీ ఉగ్గిన లక్ష్మీ రాము,అమర పిన్ని నర్సింగరావు , పాపన్న ఎల్లాజీ , కర్రి విగ్నేష్ , ఉగ్గిన దిలీప్ , కొట్టాడ గణేష్ , దారపు కృష్ణ , తుంపాల శ్రీనివాస్ , కోటేశ్వరరావు , మండల నాయకులు ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు , సర్పంచ్ మామిడి శంకర్రావు ,బొకం స్వామి నాయుడు , ఆకుల గణేష్, రోమాల చంద్రశేఖర్ ,సరగడం రాము , బంతి కోళ్ల పద్మా, బుదిరెడ్ల కనకరాజు, గొర్లి కుమారస్వామి , గుల్లిపిల్లి మాజీ సర్పంచ్ నరసింగరావు గారు,కిల్లి వెంకట సత్యనారాయణ గారు,తాటిపాముల శేఖర్ , పల్లి మంగరాజు , తామాడ సత్యనారాయణ , మేడపాటి రాము , పడాల వెంకటరమణ , రేసుపూడి రమణ, హర గోపాల్ ,పిన్నింటి పార్వతి , హైమావతి ,రాపర్తి కిషోర్ , తనకాల శ్రీనివాసరావు , డీలర్ ఎల్లాజీ , హరి హర సబ్బవరం మండలం ఉన్నతాధికారులు మరియు సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహా కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క పర్యటన కార్యక్రమంలో పాల్గొన్నారు

విశాఖపట్నం

ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు వెంటనే నిలుపుదల చేయాలని నిరసన

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు వెంటనే నిలుపుదల చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది, ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఎస్ జె అచ్యుతారావు మాట్లాడుతూ స్వాతంత్రం పూర్వకముందు నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా 200 సంవత్సరాల వెనకకు నెట్టుతూ దేశ కార్మికులను అంబానీ అదానీలకు కట్టు బానిసలుగా కార్పొరేట్ శక్తులకు విడిగం చేస్తూ భారత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నారు ఈ నాలుగు కోడ్స్ మూలంగా కార్మికుల సమ్మె చేసే హక్కులు కోల్పోతున్నారు యాజమాన్య ని రింకశాత్వానికి బానిసలు అవుతారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కోల్పోతారు భారత కార్మిక వర్గం వెట్టి చాకిరీ కి గురవుతుందని కావున వెంటనే ఈ కోడును రద్దు చేయాలని లేనిపక్షంలో భారత కార్మిక వర్గం మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు, నరేంద్ర మోడీ ఎన్ డి ఏ కూటములు భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి దేశ లౌకిక విధానానికి విఘాతం కలిగిస్తూ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయడానికి భారతదేశ కార్మిక వర్గం సహించగలదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీహెచ్ మెషిన్ బూసి వెంకట్రావు ఎం మన్మధరావు జెడి నాయుడు కే సత్తిబాబు నాగభూషణం ఓమనమూర్తి అధిక సంఖ్యలో ఏఐటియు సి శ్రేణులు పాల్గొన్నారు

విశాఖపట్నం

వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా డేవిడ్ రాజు*

*వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా డేవిడ్ రాజు* * *ఎమ్మెల్యే వాసుపల్లికి కృతజ్ఞతలు తెలిపిన 37వార్డు వైసీపీ శ్రేణులు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * కష్టపడే వారికి గుర్తించే ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా రేయి డేవిడ్ రాజు ఆసీలమెట్ట కార్యాలయంలో శనివారం వాసుపల్లి ని కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ డేవిడ్ రాజు వైఎస్ఆర్సిపి పార్టీలో ఎనలేని కృషిచేసారన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ లో 37వార్డులో చెన్నా జానకిరామ్ తో కలిసి ఆయన విజయానికి తన వంతు కృషి చేశారన్నారు. నిస్వార్ధంగా పార్టీలో పని చేసే వారికి పదవులు వస్తాయన్నారు. అధిష్టానం క్షేత్రస్థాయి నుండి పరిశీలన చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం ప్రజలతో ఉండి వారి పక్షాన ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. పేదల పాలిట ఆపద్బాంధవుడు, వాసుపల్లి గణేష్ కుమార్ సహకారంతో అధిష్టానం గుర్తించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని డేవిడ్ రాజు వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లా SC సెల్ ఉపాధ్యక్షుడు మరియు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, జిల్లా సెక్రెటరీ & 37వ ఇంచార్జ్ గనగల రామరాజు, 37వ వార్డ్ ప్రెసిడెంట్ ఆకుల యేసు, 30 వార్డ్ ప్రెసిడెంట్ మాణిక్యాలరావు, వార్డ్ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అమల్లోకి 4లేబర్‌ కోడ్స్‌

** అమల్లోకి 4లేబర్‌ కోడ్స్‌ విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి __ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలు బేఖాతర్‌ __ 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసిన మోడీ సర్కార్‌ __ కార్పొరేట్లకు ఊడిగం చేసేలా లేబర్‌ కోడ్స్‌ __ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, ఆందోళనలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఐదేండ్లుగా ఈ చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం అప్పటినుంచి కార్మికుల ఆగ్రహజ్వాలలకు భయపడుతూ వెనకడుగు వేస్తూ వచ్చింది. బీహార్‌లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీ రావడంతో కేంద్రంలో కార్పొరేట్‌ అనుకూల విధానాల అమలు వేగవంతమైంది. దానిలోభాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెస్తూ శుక్రవారం కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తక్షణం ఈ కోడ్‌లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. వేతనాల కోడ్‌ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్‌ (2020), సామాజిక భద్రతా కోడ్‌ (2020), వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ (2020)లు ఇక అమల్లోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ”2020లో పార్లమెంట్‌ ఆమోదించిన కార్మిక చట్టాలకు చెందిన నాలుగు లేబర్‌ కోడ్లను అమలులోకి తీసుకొచ్చాం. స్వాతంత్య్రా నంతరం చేపట్టిన సమగ్ర కార్మిక, ప్రగతిశీల కార్మిక సంస్కరణల్లో ఇది ఒకటి. ఈ కోడ్‌లు మన కార్మికుల కు మరింత సాధికారత కల్పిస్తూ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను సులభతరం చేస్తూ, ప్రగతి బాటన నడుస్తాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవియా కూడా ఈ కోడ్‌లను సమర్థిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఈ కోడ్‌ల లక్ష్యం 2047 నాటికి భారత దేశాన్ని సంపన్న దేశంగా ఆవిర్భవింపచేయడమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయనీ రాసుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని జాతీయ కార్మిక సంఘాలు, కార్మికరంగ నిపుణులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ కోడ్‌లు అమల్లోకి వస్తే కార్మికులు సమ్మె హక్కుతోపాటు అనేక ప్రయోజ నాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ల కోసమే… కార్పొరేట్‌ సంస్థలకు చౌకగా శ్రమశక్తిని అందించడం, ఫలితంగా వారు మరిన్ని ఆర్థిక లాభాలను గడించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చిందని జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ కోడ్‌ల అమలు వల్ల కార్మికుల పని గంటలు పెరుగుతాయి. అసంఘటిత రంగ కార్మికులకు చట్టపరిధిలో లభించే హక్కులు హరించబడతాయి. అలాగే లేబర్‌ కోడ్‌లలో ‘వేతనాలు’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. బోనస్‌, ఇంటి అద్దె అలవెన్స్‌, రవాణా భత్యం, కమిషన్‌ మొదలైన ప్రయోజనాలను వేతనాల నిర్వచనం నుంచి మినహాయించారు. దానితోపాటు మొత్తం వేతనంలో ఈ మినహాయింపులు 50 శాతం దాటరాదని షరతు విధించారు. గ్రాట్యుటీ, రిట్రెంచ్‌మెంట్‌ పరిహారాన్ని దీనిలో చేర్చలేదు. గ్రాట్యుటీ గోల్‌మాల్‌ గ్రాట్యుటీకి అర్హత పొందగోరే ఉద్యోగుల సర్వీసు కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి ఏడాదికి తగ్గిం చారు. అంటే ఉద్యోగులు ఒక సంవత్సరం పాటు సర్వీసులో ఉంటే వారికి గ్రాట్యుటీ లభిస్తుంది. అయి తే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. నిర్దిష్ట కాలానికి నియమించబడే ఉద్యోగులకే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగులకు గతంలో మాదిరే ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకుంటేనే గ్రాట్యుటీ లభిస్తుంది. ఆర్థికవృద్ధిపైనే దృష్టి సంపద పంపిణీ చేయకుండా ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తే నిరుద్యోగం పెరుగుతుందనే వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా పారిశ్రామికవర్గాలు, కార్పొరేట్లు శ్రమశక్తిని యధేచ్ఛగా దోచుకొనేందుకు మార్గం సుగమం చేసినట్టు అవుతోంది. ఔట్‌సోర్సింగే… ”ఫిక్స్డ్‌ టర్మ్‌ ఎంప్లారుమెంట్‌” నిబంధనలతో తక్కువ కాల వ్యవధికి కార్మికులను నియమించడం సులభమవుతుంది. నెలల కొద్దీ పని చేసి, పింఛను, గ్రాట్యుటీ, ప్రమోషన్‌ అవకాశాలు లభించవు. కార్మికులు ఎప్పటికీ ఔట్‌సోర్సింగ్‌లోనే ఉండిపోతారు. సామాజిక భద్రత లేదు అసంఘటిత రంగ కార్మికులకు (గిగ్‌ వర్కర్లు, డెలివరీ బార్సు, ఆటో డ్రైవర్లు మొదలైన వారు) ఇచ్చే భద్రతా పథకాలకు నిధుల మూలాలు, అమలు ప్రణాళికలపై స్పష్టత లేదు. ఫలితంగా నిజమైన కార్మికులు అనేక ఆర్థిక ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ‘సంయుక్త కిసాన్‌ మోర్చ ఆధ్వర్యంలో ఈ నెల 26న జరిగే నిరసన, ఉల్లంఘన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కార్మిక లోకాన్ని కోరుతున్నాం. పని ప్రదేశంలో ఇప్పటి నుంచే నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించాలని పిలుపునిస్తున్నాం. సోమవారం నుంచి గేటు సమావేశాలు, స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు, బస్తీ సమావేశాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలి. లేబర్‌ కోడ్లను ఉపసంహరించుకునే వరకూ దేశంలోని కార్మికులు గట్టి పోరాటం చేస్తారని కేంద్ర కార్మిక సంఘాల వేదిక ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తోంది’ అని ఆ ప్రకటన తెలియజేసింది. కాగా ఈ ప్రకటనపై ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యుఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్‌, యూటీయూసీ నేతలు సంతకాలు చేశారు. హక్కులకు పరిమితులు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ద్వారా కార్మికులకు లభిస్తున్న రక్షణ హక్కులు, కేంద్రం అమల్లోకి తెచ్చిన లేబర్‌ కోడ్‌లతో హరించుకుపోతాయి. ఉద్యోగ భద్రత కరువవుతుంది. కార్మికులు సమ్మె చేయాలంటే 60 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. మహిళలు, అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల నిర్దిష్ట అవసరాలను పట్టించుకునే క్లాజులు ఏవీ లేబర్‌ కోడ్‌లలో లేవు. చిన్న చిన్న సంస్థలలో పని చేసే వారికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి రక్షణ చర్యల్ని సిఫార్సు చేయలేదు. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, అసమానతలను నివారించేందుకు లేబర్‌ కోడ్‌లలో ఎలాంటి చర్యలు లేవు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ప్రసూతి ప్రయోజనాలు అందే పరిస్థితులు లేవు. ఇ-రిజిస్ట్రేషన్‌, ఆధార్‌తో ముడిపడిన ప్రయోజనాలు డిజిటల్‌ పరిజ్ఞానం లేని కార్మికులకు ప్రతిబంధకంగా మారతాయి. తనిఖీల్లేవ్‌ కార్మికుల సంఖ్య పదిమందికంటే తక్కువ ఉన్న యూనిట్లను తనిఖీల నుంచి మినహాయించారు. దీనివల్ల పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు మరింత హీనస్థాయికి చేరే ప్రమాదం ఉంది. అగ్ని ప్రమాదాలు, యంత్ర భద్రతా ప్రమాణాలపై బాధ్యత లేకుండా పోతుంది. ఉద్యోగ భద్రత లేదు పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో 300 మంది వరకు కార్మికులు ఉన్న సంస్థల్లో వారి తొలగింపులపై ఎలాంటి నియంత్రణలు లేవు. ఫలితంగా శాశ్వత ఉద్యోగాల కంటే ఒప్పంద (కాంట్రాక్ట్‌) విధానం మరింత పెరిగే అవకాశం ఉంది. వయసు పైబడిన ఉద్యోగులను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది. కార్మిక సంఘాలతో చర్చించలేదు కార్మిక కోడ్‌లను రూపొందించే సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో పాటు ఇతర భాగస్వాములను సంప్రదించలేదు. పూర్తిగా ప్రయివేటు, కార్పొరేట్‌ యాజమాన్యాల అనుకూల నిర్ణయాలతో ఈ చట్టాలను రూపొందించారు. సామాజిక భద్రతా కోడ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతల ప్రస్తావనలు గందరగోళంగా ఉన్నాయి. ఇవి చట్టంలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

విశాఖపట్నం

తగరపువలస అవంతి ఇంజినీరింగ్ కళాశాల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో ఫ్రెషర్స్ డే 2K25 వేడుకలు

తగరపువలస అవంతి ఇంజినీరింగ్ కళాశాల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో ఫ్రెషర్స్ డే 2K25 వేడుకలు విశాఖ నవంబర్ పున్నమి ప్రతినిధి అవంతి శ్రీ గాంధీ ఆడిటోరియంలో అత్యంత భవ్యతతో నిర్వహించబడనున్నాయి. ఈ కార్యక్రమం కొత్తగా ప్రవేశించిన విద్యార్థులను స్వాగతిస్తూ, వారు సంస్థ యొక్క శైక్షణిక మరియు సాంస్కృతిక వాతావరణాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకునేలా రూపొందించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఎం. శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే భీమిలి, మాజీ పర్యాటక శాఖ మంత్రి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరియు అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపక చైర్మన్, అలాగే డాక్టర్ ఐ. వాణి, M.D. (OG), అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు సూపరింటెండెంట్, KGH, విశాఖపట్నం గౌరవ హాజరు అందించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ డాక్టర్ జి. గిరిజా శంకర్, ప్రిన్సిపల్ – ఆంధ్రా విశ్వవిద్యాలయ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, విశాఖపట్నం మరియు శ్రీ ఎస్. అప్పలరాజు, ఏసీపీ – మధురవాడ సబ్ డివిజన్, విశాఖపట్నం హాజరుకానున్నారు. ప్రత్యేక అతిథిగా బ్రహ్మకుమారి సిస్టర్ తనుజా, విశాఖపట్నం, విశిష్ట అతిథిగా శ్రీ నాగేశ్ కుమార్, సైంటిస్ట్–E, IBSC–AMTZ, విశాఖపట్నం పాల్గొని విద్యార్థులకు పథనిర్దేశం చేయనున్నారు. అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన అధ్యక్షులు శ్రీమతి ఎం. జ్ఞానేశ్వరి, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం. ప్రియంక, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఐ. శ్రవణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం. వి. ఎస్. ఎస్. నందీశ్, ప్రిన్సిపల్ డాక్టర్ కె. పూర్ణ నాగశ్రీ, డైరెక్టర్ HR డాక్టర్ ఎ. చంద్రశేఖర్, డైరెక్టర్ అడ్మిన్ శ్రీ ఎస్. విశ్వప్రసాద్ తదితరులు పాల్గొని విద్యార్థులకు ఆశీర్వచనాలు అందించనున్నారు. నూతన విద్యార్థుల్లో ఉత్తేజం, ఆత్మవిశ్వాసం పెంపొందించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ ఫ్రెషర్స్ డే 2K25 వేడుకల్లో పాల్గొని వారిది విద్యా ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ప్రారంభమవాలని సంస్థ తరఫున ఆకాంక్షించబడుతోంది.

అన్నమయ్య

గుంజునేరులో మహిళ మృతదేహం లభ్యం

చిట్వేల్‌ సమీపంలో కలకలం – నాలుగు రోజుల క్రితం మృతి జరిగి ఉండవచ్చని పోలీసుల అనుమానం చిట్వేల్‌, నవంబర్ 22: పున్నమి ప్రతినిధి చిట్వేల్ పట్టణానికి సమీపంలో ఉన్న గుంజునేరు వాగులో శనివారం ఉదయం ఒక మహిళ మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది.ఉదయం వాగు వైపు వెళ్లిన స్థానికులు నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు.మృతదేహం పరిస్థితిని బట్టి చూస్తే, సుమారు నాలుగు రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈమె ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాదవశాత్తు జారిపడిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వివరాలు, మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.

గూడూరు

షటిల్ బ్యాట్మెంటన్ కప్పు గెలుచుకున్న ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాల విద్యార్థినిలు

స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బి. ముని లక్ష్మి థర్డ్ బిఎస్సి మరియు బి శ్రావణి థర్డ్ బిఎస్సి ఇటీవల జవహర్ భారతి డిగ్రీ కళాశాల కావలిలో జరిగిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఆటల పోటీలలో రన్నర్ అప్ కప్పు గెలుచుకొని విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు మరియు అధ్యాపక సిబ్బంది విద్యార్థినిలను అభినందించారు.

E-పేపర్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.

అన్నమయ్య జిల్లా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. నేటి నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి జాతీయ కౌన్సిల్ పిలుపులో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లిమండలం మంగంపేట లో ఏఐటీయూసీ కార్మికసంఘాల తో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ కార్మికులకు తీవ్ర నష్టం కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్ (2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక వర్గం గత ఆ ఐదు సంవత్సరాల నుంచి అలుపెరిగిన పోరాటాలు సాగిస్తున్న, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం సరైనది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్పొరేట్ యాజమాన్యాలు చెప్పింది వేదం కానున్నది. కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక హక్కులపై కోతపడుతుంది. మహిళా కార్మికులను నైట్ షిఫ్ట్ లు పని చేయించడం వల్ల వారికి భద్రత కరువు అవుతుంది. పని గంటల పెంపు వల్ల ఇండస్ట్రీలలో కర్మాగారంలో పనిచేసే కార్మికులు తీవ్ర అలసటకు గురై, అనారోగ్యానికి గురి అవుతారు. ఈ లేబర్ కోడ్లు అమలువైతే కార్మికుల జీవితాలు, జీవనోపాధి ని చంపేయడమే అవుతుంది. కార్పొరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి కార్మిక వ్యవస్థ వెళుతుంది. అందుకని ఈ నాలుగు లేపల కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ త్రివేణి కార్మిక సంఘం అధ్యక్షులు నాగరాజు కోశాధికారి వరప్రసాద్ పూర్ణ కుమార్ రాజు కార్మికులు పెంచలయ్య రమణ భాష వెంకటరమణ చిన్నయ్య సుబ్రహ్మణ్యం రెడ్డయ్య రామకృష్ణ, నరసింహమూర్తి, రవి, వెంకటేశ్వరరావు, శ్రీను, రాహుల్, ప చంటి, శ్రీనివాసరావు, నారాయణ, కృష్ణ, ,తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామనీ ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారు మాదరాజు గంగాధర్ ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు చేరువ—మార్చిలో నోటిఫికేషన్ అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగం పెంచుకుంటోంది. ఫిబ్రవరి నెలాఖరుకే రిజర్వేషన్ల పనిని పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తవుతే, మార్చి నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. తదనంతరం ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి మరింతగా పెరిగే అవకాశముంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.