Thursday, 19 March 2026

Blog

కామారెడ్డి

కొనుగోలు ప్రక్రయ సకాలంలో జరగాలి – సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి

కామారెడ్డి, 22 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం వరి కొనుగోలు కేంద్రం సందర్శన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామ్మోహన్ , సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, ఇతర సిబ్బంది సమకూరారు. వెనుకబడిన లారీల కారణంగా ధాన్య సరఫరాకు అడ్డంకులు తలెత్త కుండా, డీసీవో స్పందించి సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌ ను వెంటనే లారీల పంపిణీకి ఫోన్ చేశారు. ఈ చర్య రైతులకోసం వరి కొనుగోలును వేగవంతం చేయడానికి ఉపకరిస్తుందని అధికారులు తెలిపా రు.ఈ అంశం మీద స్థానిక ఆరోపణలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం రైతుల నియ మిత కొనుగోలును సులభతరం చేస్తుంది అని తెలిపారు.

నారాయణపేట

జాబ్ క్యాలెండర్ ఒసేది

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ సంవత్సరంనర అవుతున్న ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో చలగాటమాడుతుందని కృష్ణ మండలం వీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మ్యకల్ భీమ్ ఆరోపించారు, నిన్నటికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి ఏడాది అవుతున్న ఇంకా జాబ్ క్యాలెండర్ ఉసే లేకుండా పోయింది అన్నారు, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అన్నారు.

కామారెడ్డి

రామారెడ్డిలో గొడవ – స్థానికులపై కేసు నమోదు

కామారెడ్డి, 23 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో చోటుచేసుకున్న గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. రామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ భీమ వరం పోలీసులు మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్‌ను అదుపులోకి తీసుకుని రామారెడ్డి పోలీ స్ స్టేషన్ కు తరలిస్తుండగా, గ్రామస్థులు వారిని వెంబడించి రామారెడ్డి పోలి స్టేషన్ వద్ద వాగ్వాదా నికి దిగారు.వాగ్వాదం తీవ్రరూపం దాల్చి పోలీసు ల విధులకు ఆటంకం ఏర్పడటంతో, రామారెడ్డి పోలీస్‌లు మద్దికుంట పది మంది గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపా రు.ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయి. పోలీస్ భద్రతను బలోపే తం చేసినట్లు వివరించారు.

విశాఖపట్నం

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి*

*రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *నక్కపల్లిలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల స్కూల్ గేమ్స్ ప్రారంభించిన హోం మంత్రి అనిత* నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి అనిత విద్యార్థులను పరిచయం చేసుకుని వారి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల ఆకర్షణీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక ముఖ్య భాగమని మంత్రి అనిత పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెడతున్నారని, మార్కులు ముఖ్యంకాదని, క్రీడలు ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. ఉమెన్ క్రికెట్‌కు పెరుగుతున్న గుర్తింపును ప్రశంసిస్తూ, బాలికలకు క్రికెటర్ చరణ్ శ్రీ ఆదర్శమని పేర్కొన్నారు. నక్కపల్లిలోనే 40–50 మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించడంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ఆటల్లో గెలుపు–ఓటములు సహజమని, క్రీడల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ విజేతలే అని అన్నారు. Ncc, Nss కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలో నక్కపల్లిలో హాకీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

విశాఖపట్నం

డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమం ★ 170 మంది పేదలకు కళ్ళద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

32వ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ★ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ★ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ★ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమం ★ 170 మంది పేదలకు కళ్ళద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* జీవీఎంసీ 32 వ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లిపురం 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో నిర్వహించిన కళాద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీద 170 మంది నిరుపేదలందరికీ కల్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 32 వ వార్డు అభివృద్ధికి కూడా స్థానిక కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈ క్రమంలోనే దశల వారీగా వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ వార్డులో ప్రతి పని త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో వార్డు అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చలువ తోటలో కళ్యాణ మండపం నిర్మాణం త్వరలో పూర్తికానుందని వెల్లడించారు. అలాగే 80 ఏళ్ల చరిత్ర ఉన్న ఏడుగుళ్ల ప్రాంత నివాసులకు సొంత ఇల్లు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సహకరించాలని కోరారు. అలాగే వార్డులో చేపట్టిన ప్రతి అభివృద్ధి పని పూర్తి కావడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమ విషయంలో తాను రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే తన లక్ష్యమన్నారు. నవంబర్ 30న తన పుట్టినరోజు సందర్భంగా అల్లిపురం తన కార్యాలయం ప్రాంగణంలో సుమారు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే నిరుపేదలకు దుప్పట్లు ,చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జనసేన పార్టీ నాయకులు కందుల కృష్ణ, సిపిఐ బుజ్జి,ఆధిబాబు, గీత, కందుల బద్రీనాథ్ కందుల కేదార్నాథ్, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు తెలుగు లక్ష్మి, బిజెపి నాయకులు శాలివాహన, రమేష్ పాడి, అప్పారావు,హేమ,భారతి, జ్యోతి, కుమారి తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి మహోత్సవం వేడుక సంధర్బంగా పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నేడు కే.జీ.హెచ్. లో ఉచిత అన్నదానం

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి మహోత్సవం వేడుక సంధర్బంగా పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నేడు కే.జీ.హెచ్. లో ఉన్న సుబోజనాలయం లో నిర్వహించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి వందోవ జయంతోత్సవమునకు కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కేక్ ను కట్ చేసి, ఉచిత అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారు ఈ రోజు కె.జి.హెచ్. నందు గల సుబోజనాలయం ద్వారా 700 మంది పషెంట్లు మరియు వారి సహాయకులకు ఉచిత అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించినారు. కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి మాట్లాడుతూ నేను కూడ స్వామి అనుచరులను చిన్నప్పుడు బాల వికాస్ తరగతులు వెళ్ళేవారము, స్వామి నుండి చాలా విషయాలు తెలుసుకోవాలి, స్వామి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని తెలిపారు. పట్టా ఫౌండేషన్, చిన్న వాల్తేర్, విశాఖపట్నం వారు ఇటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు అందరికి స్వామి ఆశీర్వాదములు ఉంటాయని ఈ సంధర్బంగా వారిని అభినందనించారు. స్వామి దివ్య ఆశీస్సులతో పట్టా ఫౌండేషన్ ద్వారా ప్రతీ సంవత్సరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్వామి మార్గం… మానవ సేవయే – మాధవ సేవ, లవ్ ఆల్ – సర్వ్ ఆల్ అనే వాక్కు ను ఆదర్శంగా తీసుకొని పట్టా ఫౌండేషన్ పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో గత 20 సంవత్సరములుగా పలు జిల్లాల్లో నిర్వహిస్తుందని పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కే.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ఐ.వాణి తో పాటు కే.జి.హెచ్. ఆర్.యం.ఓ. డా.బి.బంగారయ్య, ఇతర కె.జి.హెచ్.సిబ్బంది, మరియు పట్టా ఫౌండేషన్ సభ్యులు బొడ్డేడ వెంకటలక్ష్మి , ఆర్.భారతి భాస్కర్, దొడ్డి రమేష్, జి.దేముడు బాబు, పెంటకోట శ్రీదేవి, శ్రీలక్ష్మి , డి. శ్యామల, అలీ, బిశెట్టి వెంకట్, తాత నాయుడు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మన పల్లెకు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగాపర్యటించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.*

*మన పల్లెకు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బోధవలస గ్రామం మరియు ఎల్లిప్పి గ్రామాలలో పర్యటించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో చేపట్టిన మన పల్లెకు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. ఆయనతో పాటుగా సబ్బవరం మండలం అన్ని శాఖల మండల అధికారులు పాల్గొన్నారు ముందుగా బోదవలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రియతమనాయకునికి ప్రజలు నీరాజనాలు పట్టారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు పలు వినతులు అందచేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, చేతి బోర్లు, గృహ నిర్మాణాలు, స్థల కేటాయింపులు, కళ్యాణమండపం నిర్మాణం వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయా సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్తమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుభిక్షమైన రీతిలో జీవనం సాగించాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను దపాదపాలుగా సంవత్సరంలోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో సబ్బవరం మండలం ప్రజా పరిషత్ అధికారి పద్మజా, మండల రెవెన్యూ అధికారి చిన్ని కృష్ణ , శాసనసభ్యులు సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు , మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు , గొంప నర్సింగరావు , మండల సీనియర్ సాలాపు వెంకటేశ్వరరావు , ఇందల రమణ, బల్రెడ్డి అప్పారావు , మిడతాన మహాలక్ష్మి నాయుడు ,బోధవలస గ్రామం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంచిపాటి రాంబాబు , గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంతకోరు సూర్యనారాయణ , ఎలిప్పి గ్రామం సర్పంచ్ ఉగ్గిన దేవుడమ్మ ,ఎలిప్పి గ్రామ ఎంపీటీసీ ఉగ్గిన లక్ష్మీ రాము,అమర పిన్ని నర్సింగరావు , పాపన్న ఎల్లాజీ , కర్రి విగ్నేష్ , ఉగ్గిన దిలీప్ , కొట్టాడ గణేష్ , దారపు కృష్ణ , తుంపాల శ్రీనివాస్ , కోటేశ్వరరావు , మండల నాయకులు ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు , సర్పంచ్ మామిడి శంకర్రావు ,బొకం స్వామి నాయుడు , ఆకుల గణేష్, రోమాల చంద్రశేఖర్ ,సరగడం రాము , బంతి కోళ్ల పద్మా, బుదిరెడ్ల కనకరాజు, గొర్లి కుమారస్వామి , గుల్లిపిల్లి మాజీ సర్పంచ్ నరసింగరావు గారు,కిల్లి వెంకట సత్యనారాయణ గారు,తాటిపాముల శేఖర్ , పల్లి మంగరాజు , తామాడ సత్యనారాయణ , మేడపాటి రాము , పడాల వెంకటరమణ , రేసుపూడి రమణ, హర గోపాల్ ,పిన్నింటి పార్వతి , హైమావతి ,రాపర్తి కిషోర్ , తనకాల శ్రీనివాసరావు , డీలర్ ఎల్లాజీ , హరి హర సబ్బవరం మండలం ఉన్నతాధికారులు మరియు సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహా కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క పర్యటన కార్యక్రమంలో పాల్గొన్నారు

ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు వెంటనే నిలుపుదల చేయాలని నిరసన

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు వెంటనే నిలుపుదల చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది, ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఎస్ జె అచ్యుతారావు మాట్లాడుతూ స్వాతంత్రం పూర్వకముందు నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా 200 సంవత్సరాల వెనకకు నెట్టుతూ దేశ కార్మికులను అంబానీ అదానీలకు కట్టు బానిసలుగా కార్పొరేట్ శక్తులకు విడిగం చేస్తూ భారత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నారు ఈ నాలుగు కోడ్స్ మూలంగా కార్మికుల సమ్మె చేసే హక్కులు కోల్పోతున్నారు యాజమాన్య ని రింకశాత్వానికి బానిసలు అవుతారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కోల్పోతారు భారత కార్మిక వర్గం వెట్టి చాకిరీ కి గురవుతుందని కావున వెంటనే ఈ కోడును రద్దు చేయాలని లేనిపక్షంలో భారత కార్మిక వర్గం మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు, నరేంద్ర మోడీ ఎన్ డి ఏ కూటములు భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి దేశ లౌకిక విధానానికి విఘాతం కలిగిస్తూ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయడానికి భారతదేశ కార్మిక వర్గం సహించగలదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీహెచ్ మెషిన్ బూసి వెంకట్రావు ఎం మన్మధరావు జెడి నాయుడు కే సత్తిబాబు నాగభూషణం ఓమనమూర్తి అధిక సంఖ్యలో ఏఐటియు సి శ్రేణులు పాల్గొన్నారు

విశాఖపట్నం

వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా డేవిడ్ రాజు*

*వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా డేవిడ్ రాజు* * *ఎమ్మెల్యే వాసుపల్లికి కృతజ్ఞతలు తెలిపిన 37వార్డు వైసీపీ శ్రేణులు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * కష్టపడే వారికి గుర్తించే ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా రేయి డేవిడ్ రాజు ఆసీలమెట్ట కార్యాలయంలో శనివారం వాసుపల్లి ని కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ డేవిడ్ రాజు వైఎస్ఆర్సిపి పార్టీలో ఎనలేని కృషిచేసారన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ లో 37వార్డులో చెన్నా జానకిరామ్ తో కలిసి ఆయన విజయానికి తన వంతు కృషి చేశారన్నారు. నిస్వార్ధంగా పార్టీలో పని చేసే వారికి పదవులు వస్తాయన్నారు. అధిష్టానం క్షేత్రస్థాయి నుండి పరిశీలన చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం ప్రజలతో ఉండి వారి పక్షాన ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. పేదల పాలిట ఆపద్బాంధవుడు, వాసుపల్లి గణేష్ కుమార్ సహకారంతో అధిష్టానం గుర్తించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని డేవిడ్ రాజు వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లా SC సెల్ ఉపాధ్యక్షుడు మరియు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, జిల్లా సెక్రెటరీ & 37వ ఇంచార్జ్ గనగల రామరాజు, 37వ వార్డ్ ప్రెసిడెంట్ ఆకుల యేసు, 30 వార్డ్ ప్రెసిడెంట్ మాణిక్యాలరావు, వార్డ్ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.