Thursday, 19 March 2026

Blog

విశాఖపట్నం

సీతమ్మధారలో అయ్యప్ప దివ్యోత్సవం తరుణ్ స్వామి దంపతుల ఆధ్వర్యంలో వి.వి.ఆర్ పీఠం అంబల పూజ అపూర్వ రాజసంతో

సీతమ్మధార శనివారం అద్భుతమైన ఆధ్యాత్మిక కాంతులలో తేలియాడింది. ప్రాంతమంతా గంభీర వేదఘోషలు, దీపాల వెలుగులు, భక్తిజన సమూహాల నినాదాలు మార్మోగుతుండగా, వి.వి.ఆర్ అయ్యప్ప పీఠం ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి అంబల పూజ అత్యంత రాజసమైన మహోత్సవ రీతిలో జరిగింది. ఆంధ్ర వాయిస్ ఎడిటర్ కుమారుడు తరుణ్ స్వామి దంపతుల దివ్యనిర్వహణ ఆద్యంతం జరిగిన మొత్తం పూజా కార్యక్రమాన్ని తరుణ్ స్వామి దంపతులే స్వయంగా పర్యవేక్షించి, స్వామివారి ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతీ క్షణాన్ని విశేష భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వారి చేతుల మీదుగా పూజారంభం కావడంతో అంబల ప్రాంతం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం రూపంలో వెలిగిపోయింది. ప్రతి క్షణాన్ని అలరించిన మహామహోత్సవ వాతావరణం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర అభిషేకాలు మహానైరుత్య దీపారాధనతో అంబల ప్రాంతం రాజభవనం తలపించేలా దివ్యకాంతులతో మెరపించడం త్రిపుట హోమాలతో దేవతానుగ్రహం ప్రసరించిన పీఠాధికారులు భక్తులకు ప్రత్యేక తీర్థప్రసాదాల పంపిణీతో సేవాభావాన్ని ప్రతిబింబించిన కార్యక్రమ నిర్వాహకులు అశేష భక్తులు “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో ప్రాంతాన్ని కంపింపజేయగా, పిల్లల నుండి పెద్దల వరకు కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు ఈ అంబల పూజను తమ జీవితంలో అరుదైన ఆధ్యాత్మిక మహోత్సవంగా భావించారు. సీతమ్మధారలో తరుణ్ స్వామి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ రాజసమైన అంబల పూజ, అయ్యప్ప భక్తుల హృదయాల్లో చిరస్మరణీయ దివ్యోత్సవంగా నిలిచిపోయింది.

E-పేపర్

తుర్కయంజాల్ లోని తులిప్స్ గ్రాండ్ హోటల్ లో కుళ్ళిన మాంసం అపరిశుభ్రత కంప్లైంట్ ఆధారంగా హోటల్ పై కమిషనర్ ఆదేశాల మేరకు పరిశీలించిన సానిటేషన్ ఇన్స్పెక్టర్

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 తుర్కయంజాల్ లోని తులిప్స్ గ్రాండ్ హోటల్ లో కుళ్ళిన మాంసం అపరిశుభ్రత కంప్లైంట్ ఆధారంగా హోటల్ పై కమిషనర్ ఆదేశాల మేరకు పరిశీలించిన సానిటేషన్ ఇన్స్పెక్టర్ హోటల్లో నమ్మలేని నిజాలు బయటికి చూస్తే గ్రాండ్ హోటల్ లోపల అపరిశుభ్రత కిచెన్ లో నిల్వ ఉంచిన మాంసం పరిశుభ్రత పాటించడంలో నిర్లక్ష్యం వహించిన తులిప్స్ హోటల్ యజమాన్యానికి 50,000వేల రూపాయలు జరిమానా విధించిన అధికారులు.

ఆంధ్రప్రదేశ్

గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం :CI నాగేంద్రప్రసాద్

పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన పాండ్రక పంచాయితీ రామపురం శివారు లో వెస్ట్ బెంగాల్ నుండి రొయ్యలచెరువు మీద పనిచేయడానికి వచ్చిన యువకుడు పరిసర ప్రాంతాలలోని 5గురు యువకుల కు అక్రమం గా గంజాయి అమ్మకాలు చేస్తున్నాడనే రహస్య సమాచారం తో పెడన సీఐ నాగేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో కృత్రివెన్ను SI పైడిబాబు గారు సిబ్బంది తో కలిసి చాకచక్యం గా పట్టుకోవడం జరిగింది అని ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి రవాణా, అక్రమం గా నిల్వ చేసినా, అమ్మిన, కఠిన చర్యలు తీసుకుంటామని CI నాగేంద్రప్రసాద్ గారు హెచ్చరించారు.పట్టుబడిన వారి వద్ద నుండి 7కిలో ల గంజాయి స్వాదినం చేసుకున్నామని, వారిని కోర్ట్ లో హాజరు పరుస్తామని CI నాగేంద్రప్రసాద్ గారు తెలిపారు పట్టుబడిన వారిలో సోమనాధ్ బిక్రమ్ s/o దీపక్ బిక్రమ్ 27y, వెస్టుబెంగాల్, భూక్యా శివాజీ s/o రామకృష్ణ 24y, మచిలీపట్టణం, షేక్. ఆరిఫ్ s/o రాజజాని 24y,మచిలీపట్టణం,పారుపాటి వినయకుమార్ s/o స్వరూపరాజు 24y,సీతారాంపురం కృత్తివెన్ను మండలం, కారాడి ఆనంద్ s/o ముసలయ్య 23y, ఓర్లగొందితిప్ప,ఉస్రత్తు దుర్గారావు s/o పున్నయ్య 29y,ఎస్ ఎన్ గొల్లపాలెం ఉన్నారు.

తిరుపతి

వాయులింగేస్వరుని దర్శించిన నందమూరి రామకృష్ణ

శ్రీకాళహస్తి నవంబర్ 22, పున్నమి టెంపుల్ న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దర్శనార్ధం శనివారం నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ విచ్చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టిడిపి నాయకులు ప్రత్యెక దర్సన ఏర్పాట్లు చేయించి శ్రీస్వామి, అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలు ఢిల్లీ శ్రీకాళహస్తి కోపరేటివ్ మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరుపున కిడ్నీ బాధితుడి కుటుంబానికి జీవనోపాధి

శ్రీకాళహస్తి నవంబర్ 22, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో నివసిస్తున్న మధు అనే వ్యక్తికి రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకుండా మంచాన పడిపోవడంతో అతని కుటుంబం జీవనోపాధి కోల్పోయి పిల్లలను కూడా పోషించలేని పరిస్థితి ఏర్పడింది మధు కుటుంబం గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తిరుపతి జిల్లా పంచాయితీ అధికారి సుశీలాదేవి ద్వారా తెలుసుకున్న రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తోడుగా నిలిచారు. జీవనోపాధిగా నిలిచే విధంగా మధు భార్య రేవతి ఇడ్లీ అంగడి ప్రారంభించేందుకు కావలసిన స్టవ్, ఇడ్లీ పాత్రలు, వంట సామాగ్రి, దోశల పెనం, నెల రోజులకు అంగడికి సరిపడిన పప్పులు,బియ్యం, మసాలా దినుసులు తదితర సామాగ్రి తన ప్రతినిధుల ద్వారా మధు కుటుంబానికి అందజేశారు. సహాయం అందుకున్న రేవతి. కుటుంబం సుశీలా దేవి, దాత రమేష్ నాథ్ లింగుట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ మొర్రిమేకల దేవరాజులు, సమగ్ర శిక్ష జిల్లా అధికారి డాక్టర్ సుధాకర్ నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సక్సెస్ స్టోరీస్

కే చంద్రశేఖర్ గారి సక్సెస్ స్టోరీ

ఆకుతోటపల్లి మరియు ఎస్.కె.యు లలో రెండు బ్రాంచ్ లుగా ఉన్న శ్రీ సాయి షణ్ముఖ ట్యుటోరియల్స్ గత ఎనిమిది సంవత్సరాలుగా మీ అందరి అభిమానంతోనూ, ఆశీస్సులతో నిరాడంబరంగా విద్యను అందిస్తూ ఉంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ను ఉద్దేశంగా ఎంచుకొని ఈ సంస్థ ముందుకు నడుస్తుంది. గడచిన ఎనిమిది సంవత్సరాలు చూసుకుంటే పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టిన ఏకైక సంస్థగా పరిగణించబడింది. ఈ విద్యా సంవత్సరంలో మన సంస్థ నందు అధునాతనమైన విధానంలో విద్యను అందించడానికి కొత్తగా కిడ్స్ వరల్డ్ ప్లే స్కూల్ను ప్రారంభించి, చిన్నపిల్లలకు ఆటలతో కూడిన పాఠాలను మరియు వారి మనోవికాసం పెంపొందించేలాగా కృషి చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కన ఉన్న ఈ ప్రాంతంలో అడిగి వివరాలు తెలుసుకున్నప్పుడు ఈ సంస్థ గురించి చాలా గొప్పగా, ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ సంస్థ ప్రతి ఒక్కరికి అందుబాటులోను వారికి తగిన విధంగా విద్యను నేర్పించడంలోనూ కృషి చేస్తూ ఉంది దీనితోపాటుగా ఈ సంస్థ గురుకులం, నవోదయ, సైనిక, ఏపీఆర్ సెట్ మరియు పాలిటెక్నిక్ మొదలైన పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరు వినియోగించు కోవాలని సంస్థ అధినేత గౌరవనీయులు కె.చంద్రశేఖర్ గారు అందరినీ వినయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సంస్థ కార్యదర్శి కె.సురేంద్ర కుమార్ గారు, ప్రిన్సిపల్ బి.మహాలక్ష్మి గారు మరియు వైస్ ప్రిన్సిపల్ బి.సరస్వతి గారు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు.

శ్రీకాకుళం 

ఎన్ఎస్ఎస్ సేవా శిబిరాల్లో పశు ఆరోగ్యం నుంచి స్వచ్ఛత వరకు చైతన్యం – రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు

శ్రీకాకుళం జిల్లా , నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) ఆదిత్య జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరాలు ఉమాగిరి, పితా తోలి, కాలనీ లో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరాల్లో భాగంగా ఆరవ రోజు వెటర్నరీ సర్జన్ మందస డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు గ్రామంలో ఉన్న రైతులకు పాడి పరిశ్రమ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని దానికి ప్రభుత్వం తోడ్పాటు వివిధ రకాల స్కీముల్ ద్వారా అందిస్తుందని అలాగే పశువుల్లో వచ్చేటటు వంటి దీర్ఘకాలిక రోగాలకు ఏ రకంగా మందులు వేసుకోవాలి విషయంపై రైతులకు అవగాహన కల్పించారు . పితాతోలి , కాలనీ గ్రామంలో బహిరంగ మలవిసర్జన అనేది నేరమని, సుకన్య సమృద్ధి యోజన , పెరటి తోటలు పంపకం అందులో ఉన్న మెలకువలు గురించి, తదితరాంశాలపై గ్రామస్తులకు చైతన్యం కలగజేసిన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పీవోలు మన్మధరావు, రవిశంకర్, కృష్ణారావు అధ్యాపకులు కళాశాల ప్రిన్సిపాల్ దొంగ ప్రవీణ్, మార్పు హరికృష్ణ ప్రసాద్ వాలంటీర్లు పాల్గొన్నారు

తిరుపతి

మాజీ మంత్రి మోపిదేవిని సత్కరించిన డాక్టర్ చంద్రప్ప

శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనార్థం విచ్చేసిన సందర్భంగా భాజపా నాయకులూ డాక్టర్ చంద్రప్ప ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి దుస్యాలువతో సత్కరించడం జరిగినది.

తిరుపతి

అంకిత భావంతో ఉంటూ పట్టుదలతో పనిచేస్తా… రంగినెని చెంచయ్య నాయుడు

శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రంగినేని చెంచయ్య నాయుడు, తన ఎన్నిక అనంతరం మీడియా సమావేశంలో కృతజ్ఞతా భావంతో స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, కూటమి ప్రభుత్వం, అలాగే స్థానిక కార్యకర్తలు–నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతం కాదు కార్యకర్తల అంకితభావం, కష్టం, నిబద్ధత కలగలిపిన ఫలితం అని చెంచయ్య నాయుడన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకిత భావంతో ఉంటూ పట్టుదలతో పనిచేస్తానని గతంలో బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి హయంలో కూడా ఇదే బాధ్యతలు నిర్వహించానని అప్పటిలాగే ఇప్పుడు కూడా అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో పనిచేస్తానన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను నేను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలాల అధ్యక్షులు రాష్ట్ర మరియు పార్లమెంట్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ చక్రేశ్వర స్వామికి రూ4 లక్షల వెండి కిరీటం బహుకరణ

శ్రీకాళహస్తి నవంబర్ 22, పున్నమి న్యూస్: పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా కొలువై ఉన్న శ్రీ చక్రేశ్వర స్వామికి 4 లక్షల రూపాయలు విలువగల వెండి కిరీటాని పట్టణానికి చెందిన వై వెంకట స్వామి యాదవ్ శనివారం ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా స్వామివారికి అందజేశారు ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాల అనంతరం చక్రేశ్వర స్వామికి అలంకరించారు ఈ సందర్భంగా వెంకటస్వామి యాదవ్ మాట్లాడుతూ ఆలయానికి వెండి కిరీటం అందజేయటం చాలా సంతోషంగా ఉందని స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటస్వామి యాదవ్ కుటుంబ సభ్యులు స్వప్న హరీష్ మన్నెంపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.