“అండర్ పాస్ బ్రిడ్జి సాధన పోరాట కమిటీ పోరాట ఫలితం
” చింతారెడ్డి పాళెం జంక్షన్ వద్ద ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.115.27 కోట్లు మంజూరు ప్రమాదాలకు నిలయంగా మారిన నెల్లూరు జాతీయరహదారి చింతారెడ్డి పాళెం జంక్షన్ అంశంపై శనివారం ప్రభుత్వ శాఖల సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సమస్యపై పలు పిటిషన్లు వచ్చిన విషయాన్ని ఎన్‌హెచ్ పీడీ ఎంకె చౌదరిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరణకోరగా, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 115.27 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే టెండర్లు పూర్తిచేసి ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారి చెప్పారు. అలాగే ప్రమాదాల నివారణకు హైవేపై బ్లింకర్లు, సోలార్ లైట్లు ఏర్పాటు ప్రక్రియ డిసెంబరు 25లోగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.











