Wednesday, 18 March 2026

Blog

E-పేపర్

ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరైన హాజరైన అతిధులు

*రైల్వేకోడూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ రైల్వేకోడూరులో ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు నియోజకవర్గ నూతన ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ గారితో కలిసి హాజరై, నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పెండ్యాల విజయ్ కుమార్ గారికి మరియు కమిటి కార్యవర్గ సభ్యులకు, యువజన, మహిళ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ పరిశ్రమలు చైర్మన్ కె కె చౌదరి.

కామారెడ్డి

సాహస యోధుడు లేగల ప్రసాద్

కామారెడ్డి, 28నవంబర్, (పున్నమి ప్రతినిధి) : రామారెడ్డి గ్రామంలో పంచాయతీ ఎన్నికల హంగులో అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాటా నికి ల్యాగల ప్రసాద్ అనే నాయకుడు ముందుకు వచ్చాడు. ఎనిమిదో వార్డులో సభ్యుడిగా బరిలోకి దిగుతూ ఆయన వేసిన నామినేషన్ గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నామినేషన్‌తో మొదలైన ఆత్మగౌరవ యాత్రరామారెడ్డి గ్రామం 8వ వార్డు తీవ్రంగా వెనకబాటులో ఉందని, అభివృద్ధి ముక్కలు కూడా ఈ ప్రాంతానికి సరిగా చేరలేదని ల్యాగల ప్రసాద్ మండిపడ్డా రు.అణగారిన కులాల గళం గ్రామసభలో బలంగా వినిపించాలని, అందు కే వార్డు మెంబర్‌గా బరిలో నిలబడ్డాను అని అన్నారు. అభివృద్ధి అనే భావాన్ని ఆయన నామి నేషన్ దశలో స్పష్టం చేశారు. అణగారిన కులాల కోసం అజెండా8వ వార్డులో మురుగు నీటి కాలువలు, రహదారులు, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికార ప్రతినిధులు తిరిగి చూడలేదని ఆయన ఆరోపిస్తు న్నారు.గెలుపు సాధిస్తే అణగారిన కులాలకు గృహాలు, శాశ్వత రేషన్, వివిధ సంక్షేమ పథకా లలో ప్రాధాన్య హక్కు కల్పించి, వార్డు అభివృద్ధి పనులు ప్రజలు స్వయంగా పర్యవేక్షించే విధంగా కమిటీలు ఏర్పాటు చేస్తానని ప్రసాద్ హామీ ఇస్తున్నారు. యువత–అణగారిన వర్గాల ఐక్య వేదికనామినేషన్ సమయంలో స్థానిక యువకులు, అణగారిన కులాల ప్రతినిధులు కలిసి అధికారులకు విజ్ఞప్తి పత్రం అందజేయడం ఫొటోల్లో కనిపించింది, ఇది వార్డు స్థాయిలో ఐక్యతకు సంకేతంగా మారింది.మన ఓటు మన గౌరవం” నినాదంతో యువతను కదిలించి, డబ్బు–మద్యం రాజకీయాలకు బదులుగా స్వాభిమాన, అభివృద్ధి రాజకీయాల కోసం ప్రచారం నడపాలని ల్యాగల ప్రసాద్ పిలుపునిస్తున్నారు.

అన్నమయ్య

రైల్వేకోడూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరైన హాజరైన అతిధులు

*రైల్వేకోడూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ రైల్వేకోడూరులో ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు నియోజకవర్గ నూతన ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ గారితో కలిసి హాజరై, నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పెండ్యాల విజయ్ కుమార్ గారికి మరియు కమిటి కార్యవర్గ సభ్యులకు, యువజన, మహిళ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ పరిశ్రమలు చైర్మన్ కె కె చౌదరి.

E-పేపర్

అయ్యా మంత్రిగారు సోమశిల ఆత్మకూరు రోడ్డు కొత్త రోడ్డు వేయండి…..సిపిఎం పార్టీ నిరసన,రాస్తా రోకో

సోమశిల ఆత్మకూరు రోడ్డు గోతులతో ఉండటంతో కొత్త రోడ్డు వేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో *అయ్యా మంత్రి గారు సోమశిల ఆత్మకూరు కొత్త రోడ్డు నిర్మాణం చేయాలని అనంతసాగరం మండల కేంద్రం తాజ్ కేఫ్ సెంటర్ వద్ద నిరసన , రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.* ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి అయిన ఇప్పటివరకు రోడ్ల పై ఉండే గుంతలో ఒక తట్టమట్టి కూడా వేయలేదని అన్నారు.ఎన్నికల గెలవడం కోసం అధికారంలోకి వచ్చిన 6నెలలో రోడ్లు వేస్తామని ఇచ్చిన హామీ అమలుచేయలేదు, సోమశిల ఆత్మకూరు రోడ్డు గోతులతో ఉన్నదని ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకం కనబడుతున్నది అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు సోమశిల జలాశయం నీటిని విడుదల చేసేటప్పుడు గోతులు లేని హైవే రోడ్లు మీద వచ్చి వెళుతున్నారని ఒక్కసారి మంత్రిగారు ఆత్మకూరు నుండి సోమశిలకు ఈ భయంకరమైన గుంతల రోడ్డు మీద రావాలని మండల ప్రజలు కోరుతున్నారని అన్నారు.వర్షాలకు రోడ్డు మీద ఉండే గుంతలో నీళ్లు నిలబడి ఉండటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.ఆనం అంటే అభివృధి అంటారు ఈ రోడ్డు చూస్తేనే అభివృద్ధి కనబడుతుందని అన్నారు.మంత్రి గారు తక్షణమే స్పందించి సోమశిల ఆత్మకూరు కొత్త రోడ్డు వేయాలని, అలాగే వర్షాల సమయంలో ముత్తుకూరు, కమ్మవారి పల్లి వాగులలో నీళ్ళు నిలబడి ఉండటం వలన ప్రయాణికులు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ఉన్నదని వాటిమీద బ్రిడ్జిలు నిర్మించాలని అన్నారు.లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీల ను ఐక్యం చేసి రోడ్ల సమస్య మీద పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం అనంతసాగరం కార్యదర్శి జక్రయ్య, సిపిఎం పార్టీ సభ్యులు ఫక్రూసా,నాగులూరు వెంకటేష్, సందాని,లక్ష్మయ్య, నరసింహులు మరియు ఆటో కార్మిక సంఘం CITU అనంతసాగరం మండల అధ్యక్షులు నాయబ్ జానీ, కార్యదర్శి మస్తాన్,ఆటో కార్మికులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సార్క్ సాహిత్య పురస్కార విజేత డా. పెరుగు రామకృష్ణకు అభినందన సత్కారం

, నవంబర్ (పున్నమి ప్రతినిధి) ఇటీవలి న్యూఢిల్లీ‌లో జరిగిన 66వ సార్క్ దేశాల సాహిత్య సదస్సులో ఆహ్వానిత కవిగా పాల్గొని, సార్క్ సాహిత్య పురస్కారం–2025 అందుకున్న తొలి తెలుగు రచయితగా చరిత్ర సృష్టించిన డా. పెరుగు రామకృష్ణకు శుక్రవారం ఉదయం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, “డా. పెరుగు సాధించిన ఈ ప్రతిష్టాత్మక గౌరవం తెలుగు జాతి గర్వించదగ్గ విజయమని” అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో గుర్తింపు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు భాష–సాహిత్య పురోభివృద్ధికి విశ్వవిద్యాలయం–తెలుగు శాఖతో కలసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సంబోధనలో డా. పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ, “ఈ అవార్డు తిక్కన నేలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కవిగా 50 ఏళ్ల సాహితీ స్వర్ణోత్సవం జరుగుతున్న సందర్భంలో ఈ పురస్కారం రావడం ప్రత్యేక ఆనందం కలిగించింది” అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖాధినేత ఆచార్య త్యాగరాజు, అధ్యాపకులు రాజారాం, విమల పాల్గొన్నారు.

గుంటూరు

“తెనాలి మధుర స్మృతులు… ఎన్నటికీ మరువలేనివి” — మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తెనాలి, గుంటూరు జిల్లా — నవంబర్ (పున్నమి ప్రతినిధి) తెనాలి పట్టణంతో తనకు ఉన్న అనుబంధం జీవితాంతం మరువలేనిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఐదు దశాబ్దాలుగా తెనాలిలో జరిగిన పలు సమావేశాలు, ఇక్కడి ప్రజలతో ఉన్న ఆప్యాయత తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగించిందని అన్నారు. పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయన, మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావును మర్యాదపూర్వకంగా కలిశారు. 1980 నుంచి తెనాలిలో జర్నలిస్టుగా, తెలుగు పండిట్‌గా పనిచేసిన కాలాన్ని నిమ్మరాజు గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు వెంకయ్య నాయుడిని కలుసుకున్నారు.

కామారెడ్డి

ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి,28 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, మొండి వీరన్న తాండాలో ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించారు. ఈ కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న వరి నమూనాల ను స్వయంగానే పరీక్షించి, మాయిశ్చర్ శాతాన్ని గమనించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో కఠినంగా తనిఖీ చేశారు.కలెక్టర్ మాట్లా డుతూ, వరి నాణ్యత పరీక్షలో తూకం, మాయిశ్చర్ శాతం ప్రభుత్వ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ప్రజాస్వామ్య విధ్ధతలు ఉండకూడదని, పూర్తి పారదర్శకత పా టించి రైతులకు ఇబ్బందులు కలగకుండా అధి కారులు చురకగా పనిచేయాలని స్పష్టం చేశారు. అసలు మదుపరిక పరికరాలు — తూకం, మాయి శ్చర్ మీటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా అన్న దానిపై కూడా అవకాశం ముందుగా తనిఖీ చేశా రు.ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సురేందర్, సివిల్ సప్లై విభాగం వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్, ఎమ్ ఆర్ ఓ ఉమలత, స్థానిక రైతులు పాల్గొన్నారు.కలెక్టర్ మౌనికంగా చెప్పిన ట్లు, “రైతుల వరి కొనుగోలు లో ఎటువంటి అవినీ తి ఉండనివ్వకండి. సరైన ప్రమాణాలతో స్వచ్ఛం గా కొనుగోలు ప్రక్రియ జరగాలి. అధికారులు సక్రమ సమన్వయంతో బాధ్యతలు చేపట్టాలి” అని కట్టుబడి చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాతూరు శీనన్న గారి సంస్మరణ సభలో పాల్గొన్న పాటల శీనయ్య (CPM నాయకులు)

మాతూరు శీనన్న గారిని గౌరవిస్తూ నిర్వహించిన సంస్మరణ సభలో CPM నాయకులు పాటల శీనయ్య గారు పాల్గొనడం సభకు మరింత గౌరవాన్ని, మరింత ఆత్మీయతను తెచ్చింది. అందరిలోనూ ఒక ప్రత్యేక భావాన్ని కలిగించాయి. Video: https://youtube.com/shorts/PXA4Ffh0gGw?si=qbSBxwuhDTuS23YX

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగం ఫీల్డ్ విజీట్.

ఈరోజు, 27 నవంబర్ 2025, సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ, కెమిస్ట్రీ విభాగం విద్యార్థులకు జోసిల్ ఇండస్ట్రీస్, డోకిపర్రు, గుంటూరు జిల్లా కి ఇండస్ట్రియల్ ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. ఈ ఫీల్డ్ విజిట్‌లో ఫస్ట్ ఇయర్ హానర్స్ కెమిస్ట్రీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు గమనించి నేర్చుకున్న ముఖ్యాంశాలు: 1. మూల పదార్థాల అవగాహన • ఉపయోగించే ఆయిల్స్, ఫ్యాట్స్ రకాలు • యాడిటివ్‌లు: పరిమళ ద్రవ్యాలు, రంగులు, ప్రిజర్వేటివ్స్, ఫిల్లర్స్, మాయిశ్చరైజర్లు. 2. సాపోనిఫికేషన్ (Saponification) ప్రక్రియ – ప్రధాన రసాయనిక ప్రతిక్రియలు. 3. సంబంధిత రసాయన సూత్రాలు (Chemical Principles Involved). 4. పరిశ్రమలో వినియోగించే యంత్రాలు మరియు పరికరాలు • బాయిలర్లు, స్టీమ్ హీటర్లు మొదలైనవి. 5. క్వాలిటీ కంట్రోల్ లాబొరేటరీలో జరపబడే పరీక్షలు, ప్రమాణాలు. 6. ఇండస్ట్రీలో అనుసరించే భద్రతా చర్యలు (Safety Measures). 7. పర్యావరణ రక్షణ & వ్యర్థ నిర్వహణ వ్యవస్థలు. 8. ప్యాకేజింగ్ మరియు లేబెలింగ్ విధానాలు. 9. గ్లిజరాల్ రికవరీ ప్రక్రియ. 10. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ పరిజ్ఞానం & కెరీర్ అవకాశాలపై అవగాహన. మొదలగు అనేక కొత్త విషయాలను తెలుసుకున్నారు.. B. లావణ్య M. శ్యామల M. రాధిక…….. విద్యార్థులను ఫీల్డ్ విజీట్ కు తీసుకుని వెళ్లారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి సుబ్రహ్మణ్య కుమార్ గారు కెమిస్ట్రీ విభాగ అధ్యాపకు లను. విద్యార్థులను అభినందించారు.

E-పేపర్

సైక్లోన్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్

నవంబర్ 29 రాత్రి నుండి డిసెంబర్ 4 వరకు ‘సైక్లోన్ డిట్వా’ ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ​ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలు: ​దక్షిణ కోస్తా ఆంధ్రా (తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం): ​ఈ ప్రాంతంలో నవంబర్ 30 రాత్రి నుండి డిసెంబర్ 4 రాత్రి వరకు వర్షాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 2 ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 3 మరియు 4 తేదీల్లో తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కొనసాగుతాయి. మొత్తంగా ఈ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి, ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ​మధ్య ఆంధ్రా (మిగిలిన ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, ఏలూరు, గుంటూరు, పల్నాడు, తూర్పు & పశ్చిమ గోదావరి): ​ఇక్కడ డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 2వ తేదీల్లో వర్షాలు ఉంటాయి, డిసెంబర్ 2 నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, సముద్ర తీరానికి (బంగాళాఖాతం) దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విజయవాడ – గుంటూరు – ఏలూరు ప్రాంతాల్లో కచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ​ఉత్తరాంధ్ర ప్రాంతం (వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి): ​ఇక్కడ ప్రధానంగా డిసెంబర్ 2న మాత్రమే వర్షాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 1న వైజాగ్ – అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ ముందస్తు జల్లులు పడవచ్చు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ మేఘావృతమైన ఆకాశం మరియు చల్లని వాతావరణంతో పాటు అప్పుడప్పుడు జల్లులు లేదా తేలికపాటి వర్షాలు పడతాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.