Wednesday, 18 March 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

A320 సాఫ్ట్వేర్ గ్లిచ్‌ ప్రభావం: దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం

( పున్నమి ప్రతినిధి ) ఎయిర్‌బస్ A320 మోడల్‌లో గుర్తించిన సాఫ్ట్వేర్ గ్లిచ్ కారణంగా భారత్‌లో 200–250 విమాన సర్వీసులు ప్రభావితం కానున్నాయి. ఎయిర్ ఇండియా, AI ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రయాణికులు తాజా ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచించాయి. రీబుకింగ్ మరియు అప్డేట్ల కోసం 24×7 ప్రత్యేక సిబ్బంది పనిచేస్తున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.

అన్నమయ్య

ఉరుసు మహోత్సవాలకు విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధికి భారీగా ఘనస్వాగతం పలికిన టిడిపి పార్టీ నాయకులు

నందలూరు మండలం అరవపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన హజరత్ ఖాదర్ వల్లి దర్గా ఉరుస్ మహోత్సవాలు భక్తులు,ప్రజలు,నాయకుల సందడితో కిక్కిరిసిపోయాయి.ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై దర్గా పెద్దల ఆశీస్సులు పొందారు.ఆర్.అండ్.బి బంగ్లా నుండి దర్గా వరకు భారీ బాణాసంచా,బ్యాండ్ బాజాలు, మేళతాళాలతో కమిటీ సభ్యులు,గ్రామ యువత అయినను ఘన స్వాగతం పలికారు.దర్గా కమిటీ ఆయనకు శాలువాతో సత్కారం నిర్వహించగా, గురువులయ్య చేత ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసర సమయంలో అందరికీ అండగా ఉండడమే తన ధ్యేయమని తెలిపారు.ఎన్నడూ లేనివిధంగా వేలాదిమంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి రావడం ఈ ఉరుస్ మహోత్సవ వైభవాన్ని సూచిస్తుందన్నారు. మతసామరస్యానికి ఈ దర్గా ప్రతీకగా నిలుస్తుందని,ప్రతీ ఏడాది గ్రామ ప్రజలు,దర్గా పెద్దలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ ఉరుసును నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ప్రతి కార్యక్రమానికి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,వక్ఫ్ బోర్డు మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తాటి సుబ్బరాయుడు,రాజంపేట తెలుగు యువత పార్లమెంటు ఉపాధ్యక్షుడు కొండిశెట్టి సుదర్శన్,నందలూరు సర్పంచ్ రాము,నారపు శెట్టి శివ,టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్, తుమ్మది శివకుమార్,పొంబల నరసింహులు,వ్యాపారవేత్త దార్ల సురేష్,సీనియర్ నాయకులు హరిబాబు,బిజెపి రాష్ట్ర నాయకులు హిమగిరి నాథ్,టిడిపి మైనార్టీ నాయకులు షేక్ మౌలా,షేక్ మొహమ్మద్,రాజంపేట టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా,ఉప్పుశెట్టి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.ఉరుస్ మహోత్సవం మొత్తం ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని నెలకొలిపింది.

ఎన్ టి ఆర్ జిల్లా

పునాదిపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ వారి ప్రత్యేక శిబిరం

పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్ -2 28-11 -2025 వ తేదీన పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, వాటర్ కన్సర్వేషన్ మరియు డ్రగ్స్ మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, Menstrual Hygien మరియు శానిటరీ నాప్కిన్స్ వాడటం మీద ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కంకిపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ వారి ప్రత్యేక శిబిరం.

కంకిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్ -1 28-11 -2025 వ తేదీన కంకిపాడు గ్రామంలో అను మై బేబీ హాస్పిటల్, విజయవాడ. గైనిక్ మరియు pediatrician డాక్టర్ కే. రేవతి, డాక్టర్ ఎన్. మౌనిక ,డాక్టర్ అవినాష్. స్త్రీలకు సంబంధించిన పాప్స్ మేయర్ టెస్టులు ,గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈరోజు కంకిపాడు గ్రామానికి ఎన్ఎస్ఎస్ స్టేట్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సుధాకర్ గారు విచ్చేసి ఎన్ఎస్ఎస్ తగు సూచనలు సలహాలు ఇచ్చి ఎన్ఎస్ఎస్ యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని,క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ .కె.సరళ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండియన్ నాలెడ్జ్ సిస్టం కమిటీ మరియు రాజనీతి శాస్త్ర విభాగం వారి సంయుక్త ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి ఉత్సవములు

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇండియన్ నాలెడ్జి సిస్టం కమిటీ మరియు రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో భగవద్గీత జయంతిని పురస్కరించుకుని నేడు 28. 11 2025 వ తేదీన ”భగవద్గీత అండ్ మైండ్ ఫుల్ నెస్” అనే అంశం మీద సిద్ధార్థ అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ విభాగ్యాపకులు డాక్టర్ వి విష్ణు వందనా దేవి గారిచే గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేయబడినది. IKS కమిటీ కన్వీనర్ శ్రీమతి K శశి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ భగవద్గీత సర్వజనావళికి మార్గదర్శకమని గీతాద్యయ నం ప్రతి ఒక్కరికి ఆవశ్యకమని, చక్కగా నేర్చుకొని అందలి అంశాలను వ0ట పట్టించుకుని ఆచరించాలి అని విద్యార్థులనుద్దేశించి వారి అమూల్య ప్రసంగాన్ని అందించారు. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ వి విష్ణువ 0దనా దేవి గారు భగవద్గీత అండ్ మైండ్ ఫుల్ నెస్ అనే అంశంపై మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం మన మనసును ప్రభావితం చేస్తుంది అని, సత్వగుణమును పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలని, అందరూ సాత్వికంగా ఉండాలి అని, ఈర్ష్యద్వేష అసూయలకు దూరంగా ఉండాలి అని తెలియజేస్తూ ”కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా ” ఇత్యాది శ్లోకాలను మనస్సుకు హత్తుకునేలా వివరించారు. తదనంతరం విద్యార్థులు భగవద్గీత 18 అధ్యాయాలలోని ముఖ్య శ్లోకాలను పఠించారు. డాక్టర్ ఐ మంజుల IKS తరఫున వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి పద్మజ విద్యార్థినులకు వివిధ పోటీలను నిర్వహించారు. వక్తృత్వం ,వ్యాసరచన ,క్విజ్, పోస్టర్ మేకింగ్ మొదలైన వాటిలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్స్ మరియు బహుమతులను ఈనాటి ముఖ్య అతిథులైన డాక్టర్ వి విష్ణువందన గారితో మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ VVS KUMAR గారి చేతులమీదుగా అందించారు. అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐకేఎస్ కన్వీనర్ కె. శశి ,కో-కన్వీనర్ డాక్టర్I. మంజుల కమిటీ సభ్యులు డాక్టర్ జి పద్మజ, M .శ్యామల N. హిమజ గోకిల, MEGHANA, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థినులు మరియు యుజీ విద్యార్థినులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వెల్నెస్ క్లబ్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ 3 విభాగం వారి ఆరోగ్య అవగాహన శిబిరం….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోని వెల్నెస్ క్లబ్ మరియు NSS యూనిట్–III 28-11-2025న కంటి మరియు దంత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. కంటి మరియు దంత సంరక్షణలో ప్రత్యేకత కలిగిన ప్రఖ్యాత ఆరోగ్య సంరక్షణ సేవా ప్రదాత మాక్సివిజన్ మద్దతుతో ఈ శిబిరం నిర్వహించబడింది. విద్యార్థులలో ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడం మరియు క్యాంపస్‌లో నివారణ ఆరోగ్య సంరక్షణ సేవలను సులభంగా పొందడం ఈ శిబిరం యొక్క లక్ష్యం. శిబిరం అంతటా, సిబ్బంది మరియు విద్యార్థులు దృష్టి సంబంధిత సమస్యలను అంచనా వేయడానికి కంటి పరీక్షలు మరియు నోటి ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి దంత తనిఖీలు చేయించుకున్నారు. మాక్సివిజన్ నుండి ఆరోగ్య సంరక్షణ నిపుణులు సరైన కంటి సంరక్షణ మరియు నోటి పరిశుభ్రతను నిర్వహించడంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కంటి ఒత్తిడి, దృష్టి సమస్యలు మరియు దంత సమస్యలను ముందస్తుగా గుర్తించడం ద్వారా చాలా మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఈ కార్యక్రమాన్ని వెల్నెస్ క్లబ్ కన్వీనర్ శ్రీమతి బి. కల్పన మరియు NSS యూనిట్–III ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ భారతి సమన్వయం చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ ఈ చొరవను అభినందించారు మరియు క్లబ్ సభ్యులు మరియు విద్యార్థులు ఆరోగ్యం మరియు సంరక్షణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.

అన్నమయ్య

జిల్లా కలెక్టర్‌తో కె.కె. చౌదరి భేటీ

-టీడీపీ నాయకుల సమస్యలను నిషాంత్ కునుబిలికి వివరించిన రాష్ట్ర ఖాదీ చైర్మన్ చిట్వేల్, నవంబర్ 28: ఎల్లో సింగం ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి శుక్రవారం రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముఖ్య నాయకులు, సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. -సమస్యల పరిష్కారానికి వినతి ఈ భేటీలో కె.కె. చౌదరి ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి మండలాలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ నిషాంత్ కుమార్ చర్చించారు. ఆయా మండలాల్లోని కొందరు టీడీపీ ముఖ్య నాయకులు, సర్పంచులు ఎదుర్కొంటున్న పరిపాలన సంబంధిత, స్థానిక సమస్యలను ఆయన కలెక్టర్‌కు వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని కె.కె. చౌదరి కోరారు. కలెక్టర్ నిషాంత్ కుమార్ సమస్యలను సావధానంగా విన్నారని, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిసింది. ఈ కార్యక్రమంలో కె.కె. చౌదరి పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

జిల్లా ఎస్పీతో కె.కె. చౌదరి భేటీ

-పార్టీ నాయకులు, సర్పంచుల సమస్యలను ఎస్పీ ధీరజ్ కునుబిలికి వివరించిన రాష్ట్ర ఖాదీ చైర్మన్ చిట్వేల్, నవంబర్ 28: పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి శుక్రవారం రాయచోటిలో అన్నమయ్య జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ధీరజ్ కునుబిలి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. -సమస్యల పరిష్కారానికి వినతి ఈ భేటీలో కె.కె. చౌదరి గారు ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి మండలాలకు సంబంధించిన అంశాలపై ఎస్పీ ధీరజ్ కునుబిలి గారితో చర్చించారు. ఆయా మండలాల్లోని కొందరు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన ఎస్పీకి వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఎస్పీ ధీరజ్ కునుబిలి సమస్యలను సావధానంగా విన్నారని, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కె.కె. చౌదరి తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో జిల్లా పోలీసు యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కె.కె. చౌదరి గారితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

దేవాలయ అభివృద్ధికి పాలకవర్గం కృషి

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. భీమవరం దేవాలయాల అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే రామాంజనేయులు టిడిపి పోలీస్ బ్యూరో సభ్యురాలు సీతామాలక్ష్మి అన్నారు భీమవరం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 9 మందితో సభ్యులు నియమితుమయ్యారు చైర్మన్ వేలూరి శ్రీధర్, సభ్యునిగా మహేశ్వరరావు, జయలక్ష్మి, రమణ, మూర్తి, లక్ష్మీ, ఇందిర, రాణి, శివ మొదలగువారు నియమితులయ్యారు వారు ఎమ్మెల్యే అంజిబాబు గారిని సీతా రామలక్ష్మి ని కలిశారు E N D

తిరుపతి

మానవాళి ప్రాణాలు కాపాడేశక్తి వైద్య వృతికి మాత్రమే వుంది…. కోలా ఆనంద్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ శుక్రవారం నాడు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, రీసెర్చ్ సంస్థ నందు జరిగిన వైట్ కోట్ సెరిమనీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. మానవాళి ప్రాణాలు కాపాడేశక్తి వైద్య వృతికి మాత్రమే వుందన్నారు. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు వైట్ కోట్ ధరించడం మీ అందరి జీవితాల్లో ఒక అపూర్వమైన, అద్భుతమైన మధుర క్షణాలని మొదటి సంవత్సరం వైద్య విద్యార్ధులకు కోలా ఆనంద్ పేరుపేరునా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వైద్య విద్యార్థులకు ఇది కేవలం వైట్ కోటు ధరించే రోజు కాదని వారి వైద్య ప్రయాణానికి తొలి అధ్యాయం ప్రారంభమయ్యే పవిత్ర రోజని మీరు ధరించబోయే ఈ వైట్ కోట్, అది కేవలం వస్త్రం కాదు అది స్వచ్చతకు నైతికతకు, నిస్వార్థ సేవకు, మానవత్వానికి ప్రతీక అదే ప్రాణాలను కాపాడే వైద్య విద్య. ఈ ప్రపంచంలో చాలా వృత్తులు ఉంటాయి. ఇతరులు భవనాలు, సామ్రాజ్యాలు నిర్మిస్తారు కానీ వైద్యులు మాత్రమే మానవజాతి యొక్క ఆశలు, ప్రాణాలు, భవిష్యత్తులు నిర్మిస్తారని కోలా ఆనంద్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, కుర్రకాల్వ వేణు, టౌన్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ గోవర్ధన్, మేకల గురవయ్య, ఐనూరు భాస్కర్, సాయి, చైతన్య, ముని శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.