Wednesday, 18 March 2026

Blog

కామారెడ్డి

గొల్లపల్లి గ్రామ అభివృద్ధికి కిషన్ యాదవ్ వాగ్దానం

కామారెడ్డి, 30 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అటికెల కిషన్ యాదవ్ సర్పంచ్‌గా అబ్యర్థిగా నామినేషన్ వేశారు. అభివృద్ధి కోసం నిరుపేదలకు అందుబాటులో ఉండే ‘ఇందిరమ్మ ఇండ్లు’ కేటా యించడం, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతు లు కల్పించడం, నిరుద్యోగులకు ఉపాధి అవకా శాలు చేయడం, పింఛన్ క్యూ వారికి రాగల వసతు ల ఏర్పాట్లు చేయడం వంటి సంక్షిప్త లక్ష్యాలను ఆయన ప్రకటించారు. ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొన్న వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తనవంతు ప్రయత్నించ డమే తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.గతంలో సీసీ రోడ్లు మరియు ప్రజల కోసం పానీయ నీటి ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, తద్వారా గ్రామ ప్రజల జీవనోబ్బందులను తగ్గిస్తున్నానని ఏకకాలంలో వాగ్దానం చేశారు. అటువంటి అన్ని అభివృద్ధిపై దృష్టి సర్పంచ్‌గా గెలిచిన తక్షణమే తన సేవలను అందిస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, కిషన్ యాదవ్‌ను ఒక నిబద్ధతగల గ్రామస్థుడిగా గుర్తించి, ఆయనకు ఓటు వేయాలని కోరుతున్నారు.ఇది గ్రామ అభివృ ద్ధికి దోహదపడే అవకాశంగా భావిస్తున్నారు.

విశాఖపట్నం

ఆల్టర్ నేటివ్ మెడిసిన్ లో డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ సునీత సారికి.

ఆల్టర్ నేటివ్ మెడిసిన్ లో డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ సునీత సారికి. విశాఖ పట్నం,పున్నమి ప్రతినిధి:- మానవాళికి అత్యంత సురక్షితమైన ఆల్టర్ నేటివ్ మెడిసిన్లో డాక్టర్ సునీత సారికి నార్త్ అమెరికా లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడిసినా ఆల్టర్నేటివా అజ్టెకా యూనివర్సిటీ నుంచి అత్యున్నత డాక్టరేట్ పట్టా పొందారు. మానవులను వేధిస్తున్న ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధిపై ఆల్టర్ నేటివ్ మెడిసిన్ తో తాను చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్ ను తనకు ప్రధానం చేశారన్నారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మానవాళికి వస్తున్న అతి ప్రమాదకరమైన వ్యాధులకు వాడుతున్న పలు ఆధునిక ఔషధాల వల్ల ఆయా వ్యాధులు తగ్గుతున్నప్పటికీ, తరువాత మరికొన్ని ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. వీటిని సమర్ధ వంతంగా నిరోధించేందుకు ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్, హిజామా తదితర 52 రకాల సురక్షితమైన ఆల్టర్ నేటివ్ థెరపీస్ ను తాను నిర్వహిస్తా నన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ వైద్య సదస్సులో తాను పాల్గొని పలు పరిశోధనా పత్రాలను సమర్పించా నన్నారు. సన్ఫో గ్లోబల్ ఫెడరేషన్ వారు సన్ఫో సపోర్టివ్ ఫెలో షిప్ ను తనకు ఇచ్చి గౌరవించా రన్నారు. ట్రెడిషనల్ మెడిసిన్ లో డాక్టర్ అఫ్ ఫిలాసఫీ పొందానన్నారు. సన్ఫో ఇంటర్నేషనల్ లైఫ్ ఫెలో షిప్ అవార్డ్ -2025 వచ్చిందన్నారు. ఆంధ్రా తెలంగాణ రెండు తెలుగు రాష్టాల్లో మొత్తం ఐదుగురు పాల్గొనగా వారిలో మన రాష్ట్రంలోని విశాఖ పట్నం నుంచి నేను మాత్రమే పాల్గొన్నా నన్నారు. ది ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్ విభాగంలో కూడా పలు అవార్డులు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

విశాఖపట్నం

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ‘సర్గమ్ 2025’

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ‘సర్గమ్ 2025’ – నేవీ డే సన్నాహక కార్యక్రమాల్లో అలరించిన నేవీ బ్యాండ్ విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తుగా తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సర్గం 2025 – ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం సాయంత్రం సముద్రిక ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం విమానాశ్రయంలో నేవల్ ఆఫీసర్లు శ్రీ రజనీష్ శర్మ, శ్రీ కిషోర్, శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ వంశీ కృష్ణ యాదవ్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పంచకర్ల రమేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఈస్టర్న్ నావల్ కమాండ్ లోని శౌర్య అతిథి గృహం చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రివర్యులతో విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి సమావేశమయ్యారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సముద్రిక చేరుకున్నారు. చీఫ్ అడ్మిరల్ శ్రీ సంజయ్ భల్లా, ఆయన సతీమణి శ్రీ ప్రియా భల్లా స్వాగతం పలికారు. *అలరించిన నేవీ బ్యాండ్* సర్గం 2025లో భాగంగా తూర్పు ప్రాంత నావికాదళ సింఫనీక్ బ్యాండ్ లయబద్దంగా చేసిన సంగీత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ కంపోజర్, ఈస్ట్రన్ నావెల్ కమాండ్ బ్యాండ్ డైరెక్టర్ శ్రీ సతీష్ ఛాంపియన్, ఈస్ట్రన్ నావెల్ బ్యాండ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ లు లయబద్ధంగా సంగీతానికి దర్శకత్వం వహించగా, దేశభక్తి గీతాలు, హిందీ పాటలతో పాటు ఎన్విరాన్మెంట్ సంబంధిత అంశాలపై కూడా ఈస్ట్రన్ నేవీ బ్యాండ్ చేసిన సంగీతం అందరిని ఆకట్టుకుంది. సుమారు గంటకు పైగా చేసిన ఈ సంగీత విన్యాసాలు అందరిని సమ్మోహితం చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లయన్ కింగ్ మ్యూజిక్ మెమొంటోను శ్రీ శరత్ కుమార్ సింగ్ బాబుకి అందజేశారు. తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ శ్రీ సంజయ్ భల్లా చేతుల మీదుగా ముఖ్యఅతిథి శ్రీ పవన్ కళ్యాణ్ గారు టోకెన్ ఆఫ్ రెమెంబెన్స్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శ్రీ అకీరా నందన్ పాల్గొన్నారు.

ఆదిలాబాదు

మావల సిఎఫ్ఎల్ కృషితో ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల డబ్బాకుచ్చి గ్రామానికి చెందిన గేడం రాజు చనిపోవడం జరిగింది. పిఎంజెజెబివై పథకంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకొని ఉండగా మావల ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ప్రత్యేక చొరవ తీసుకొని టీజీబీ బ్యాంకు ద్వారా, నామిని లక్ష్మికి ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధామ్, టీజీబి కప్పర్ల మేనేజర్ చేతుల మీదగా 2లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఎల్డీఎం మాట్లాడుతూ బీమా పథకాలు కుటుంబాలకు ధీమాగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ తక్కువ ప్రీమియం గల ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కమలాకర్, సత్యనారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతర బోయిన లత – శివకుమార్ ముదిరాజ్ నామినేషన్ రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,నవంబర్ 30,(పున్నమి ప్రతినిధి)

నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునుగోడు మండలం పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతరబోయిన లత – శివకుమార్ ముదిరాజులు,నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు శివయ్య,మాజీ ఎంపిటిసి పర్సనబోయిన రాజు,కొంక వెంకన్న,చాడ యాదాద్రి,దొంతర బోయిన మల్లికార్జున్,రాజీవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు, పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రామవరంలో “ఆత్మ నిర్భర్ భారత్” సంకల్ప అభియాన్ మహిళా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము.

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి, 30 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : రామవరంలో “ఆత్మ నిర్భర్ భారత్” సంకల్ప అభియాన్ మహిళా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము. అనపర్తి మండలం రామవరం లో SVR ఫంక్షన్ హల్ లో “ఆత్మ నిర్భర్ భారత్” సంకల్ప అభియాన్ మహిళా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బిజెపి నాయకులు కాశీ, శ్రీవిద్య, రజిని, హారిక, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, తెలుగు మహిళలు. ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ భారతదేశాన్ని స్వయం సమృద్ధి దేశముగా అన్ని విధాలుగా భారతదేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళుతున్న నేపథ్యంలో ఇవాళ అనేక శక్తులు భారతదేశాన్ని బలహీన పరచాలనే ఒక ఆలోచనతో ముందుకు వస్తున్న విషయాన్ని ఇప్పటికే అందరూ గ్రహించారు. ముఖ్యంగా ఇవాళ రక్షణ రంగంలో గానీ, ఆర్థిక రంగంలో గానీ, ఏ విధంగా ప్రగతి సాధించింది అనేది మీ అందరికీ తెలుసు అటువంటి నేపథ్యంలో ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా రక్షణ రంగంలో మనం ఎంత బలంగా ఉన్నాము అనేది పాకిస్తాన్ కే కాదు ప్రపంచానికే చాటి చెప్పిన నేపథ్యంలో అనేక రంగాలపైన మనపై అసూయ కలుగుతున్న నేపథ్యంలో దానిని గమనించుకొని ఇవాళ మన ఆర్థిక విధానం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది చూశారు, ఇవాళ భారతదేశం చైనాను మించి దూసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన ఆర్థిక రంగానికి ఊతం ఇవ్వాలి మన ఆర్థిక రంగాన్ని స్వదేశీ ఉత్పత్తులని వినియోగించాలి దాని ద్వారా మన ఆర్థిక రంగానికి చేయూతనివ్వాలి ప్రతి ఒక్కరూ స్వదేశీ నినాదం ద్వారా స్వదేశీ వస్తువుల వాడకం ద్వారా పెద్ద ఎత్తున భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశ స్వాతంత్ర సమరంలో బాలగంగాధర్ తిలక్ గారు తీసుకున్న స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మన రోజు వారి జీవితంలో వీలైనంతవరకు భారతీయ ఉత్పత్తులను వినియోగించాలి దిగుమతి చేసుకునే వస్తువులకు బదులుగా మనం పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులను వాడాలి అనేది మన అందరం ఆలోచన చేయాలి అనేది వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఇంట్లో గాని, పనిలో గాని, సమాజంలో గాని భారతీయ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా మనదేశ రైతాంగానికి మన సహకారం అందించాలి చేతి వృత్తి కళాకారులకు మన సహకారం అందించాలి వారిని ప్రోత్సహించాలి, అదేవిధంగా యువతకి, పిల్లలకి ఇవ్వాళ విదేశీ భావాల నుంచి స్వదేశీ భావాలను అలవరచే విధంగా మనమందరం కృషి చేయాలి. అదేవిధంగా కుటుంబ జీవనంలో గాని, సామాజిక జీవనంలో గాని వినియోగిస్తూ మన భారతీయతను చాటి చెప్పాలి అని విషయంలో కూడా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు శ్రద్ధ తీసుకోవడం జరుగుతా ఉంది. అన్నింటికీ మించి ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఇవాళ ప్రధానమంత్రి గారు చాటి చెబుతున్నారు. ముఖ్యంగా పకృతి పరిరక్షణ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం ప్రధానమైనది. పకృతి పరిరక్షణ ధ్యేయంగా భారతీయ సంస్కృతి ని మనం నిర్మించుకోవడం జరిగింది అటువంటిది ఇవాళ మనం పకృతిని నాశనం చేసుకునే దశగా పర్యావరణానికి వేగoగా దూరం కలిగించే దిశగా అనేక చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో ప్రకృతిని పరిరక్షించుకోవాలి తద్వారా మానవాళి జీవన మనుగడని ఆరోగ్యకరంగా జీవించడం కోసం ప్రకృతి పరిరక్షణ కోసం మనందరం పునరంకితం కావాలి అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారు లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. ముఖ్యoగా జన్మభూమి హల్ట్ వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా ఎంపీ గారు అనపర్తి విచ్చేయడం జరిగింది. జన్మభూమి హల్ట్ అనేది మన ప్రాంతానికి ఎంత ముఖ్యమో మీ అందరికి తెలుసు. మొన్న విజయవాడలో ఎంపీ గారితో ఒక మాట అన్నా ఐదు సంవత్సరాలలో చేయాల్సిన పనిని మొదటి సంవత్సరంలో చేసారని, అంత విలువైన వ్యవహారం అది. దాన్ని ఈవేళ చాకచక్యంగా సంవత్సరం కాలం తిరగకుండా జన్మభూమి హల్ట్ తీసుకువచ్చి ఎంపీ శ్రీమతి పురందేశ్వరి గారికి అనపర్తి నియోజకవర్గం తరుపున, ఈ చుట్టు ప్రక్కల నియోజకవర్గాల తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్న, ఇక్కడ ఈ ప్రాంతంలో మూడు రైల్వే ఫ్లైఓవర్స్ మంజూరు అయిన, బిక్కవోలు ఫ్లైఓవర్ ను అమృత్ పథకంలో చేర్చడానికి అంగీకరించడం ఇవన్నీ గౌరవ ఎంపీ గారి కృషి వల్ల మాత్రమే అని తెలియచేస్తున్నాను. వారు మనకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు, వారు విదేశాల్లో ఉన్న నిరంతరం అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గం సమస్యల పరిస్కారం కోసం వారు నిరంతరం తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, వారు ఈవేళ మహిళల కార్యక్రమానికి రావడం సుదినంగా భావిస్తూ, అలాగే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది వారికి ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్న వాటిన్నిటిని త్వరగా ముగించుకుని ఈ కార్యక్రమానికి రావడo జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళమణులు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, నాలుగు మండలాల మహిళలు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఖాదర్ వల్లీ దర్గా ఉరుస్ మహోత్సవం సందడి – వేలాదిమంది భక్తులుతో ఆధ్యాత్మిక క్షణాలు

అరవపల్లి దర్గాలో నిర్వహించిన ఖాదర్ వల్లీ ఉరుస్ మహోత్సవం ఈ సంవత్సరం విశేషంగా,వైభవంగా సాగింది.వేలాదిమంది భక్తులు ప్రాంతం నలుమూలల నుంచి తరలివచ్చి దర్గా ప్రాంగణాన్ని కిటకిటలాడేలా చేశారు. ప్రత్యేక పూజలు,ప్రార్థనలతో ఆధ్యాత్మికత నిండిన వేడుక రోజు అంతా ఘనంగా జరిగింది.ఖాదర్ వల్లీ దర్గాలోని చిన్న పీఠాధిపతి గురువులయ్య హైదర్ సాహెబ్ ప్రత్యేక దువా ఫాతిహా చేసి కార్యక్రమం మొదలపెట్టారు,నాగిరెడ్డిపల్లి దర్గాకు భక్తుల ఊరేగింపు బ్యాండ్‌బాజాలతో సాగి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ జెండా ప్రదర్శన ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల సందడి మధ్య పోటాపోటీగా నబిరసూల్ అల్లా,వల్లీ సాహెబ్, హైదర్ సాహెబ్ ఖవ్వాలి పాటలతో రైల్వే కళాక్షేత్రంలో సాగిన ఖవ్వాలి కార్యక్రమం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. ఆధ్యాత్మికత,సంగీతం,ఎన్నో గంటలు సాగిన ఈ ఖవ్వాలీలు దర్గా ప్రాంగణాన్ని ఉత్సాహభరితంగా మార్చాయి.ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,మాట్లాడుతూ ఖాదర్ వలీ దర్గా చరిత్ర, సేవలు,భక్తుల విశ్వాసం గురించి ఉరుస్ మహోత్సవ మహిమాన్వితతను వివరించారు.ఈ సంప్రదాయాలు తరతరాలుగా భక్తులను ఏకం చేసే శక్తి కలిగినవని అన్నారు.అలాగే,తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ యువ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,అరవపల్లి దర్గా ఉరుస్ వైభవం గురించి మాట్లాడుతూ,కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ ఉత్సవాలు సామాజిక సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.స్థానికుల సేవాభావం,నిర్వాహకుల కృషి అభినందనీయం అన్నారు.సాంప్రదాయం,భక్తి, అనురాగంతో సాగిన ఈ మహోత్సవం భక్తుల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు దాదాపీర్,తుమ్మది శివకుమార్,స్థానిక యువత సయ్యద్ సమీర్,షేక్ ఫయాజ్, నవాజ్,కార్పెంటర్ అజీమ్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

గూడూరు

రంగోళి ద్వారా ఎయిడ్స్ పై అవగాహన

గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబర్1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారము రంగోళి పోటీలు నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కలిగే విధంగా వివిధ రకాల ముగ్గులు వేసి చూపరులను ఆలోచింపచేశారు. ఈ ముగ్గుల పోటీలకు డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీవాణి న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. మాధవి గ్రూపు సెకండ్ బిఎస్సి మొదటి బహుమతి గెలుచుకోగా, సూర్య మౌనిక గ్రూపు థర్డ్ బీకాం ద్వితీయ బహుమతి, శ్రీనివాసులు గ్రూపు సెకండ్ బిఎ తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. శిరీష గ్రూపు ఫస్ట్ బీకాం ప్రోత్సాహక బహుమతులు గెలుచుకుంది. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో కిరణ్మయి, కృపా కరుణ వాణి భీమవరపు లక్ష్మి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, లక్ష్మీ హిమబిందు తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది కౌన్సిల్ సమావేశం కు వైసీపీ సభ్యులు లేటుగా రావడంతో ఇది సరైన పద్ధతి కాదని మున్సిపల్ చైర్మన్ కు తెలిపిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి.మున్సిపల్ చైర్మన్ గారి సిసిని ఆమె అనుమతి లేకుండా ఎలా మారుస్తారని కమిషనర్ ప్రశ్నించిన వైసిపి సభ్యులు.కింది స్థాయి అధికారులను మార్చే అధికారం తనకు ఉందంటూ తెలిపిన మున్సిపల్ కమిషనర్. వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయిన కమిషనర్ మరియు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

E-పేపర్

రైలు ప్రయాణికులకు శుభవార్త ఇకపై నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది.

పున్నమి ప్రతినిధి అలంపల్లి దుర్గేష్ 9640204826 రైలు ప్రయాణికులకు శుభవార్త ఇకపై నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.