Tuesday, 17 March 2026

Blog

విశాఖపట్నం

*హై మాక్స్ లైట్లు, పైలెట్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయండి* *3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ*

భీమిలి జోన్ 3వ డివిజన్లో పలు ప్రాంతాల్లో పైలెట్ వాటర్ స్కీమ్ మరియు హై మాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని భీమిలి జోన్ 3వ డివిజన్ కార్పొరేటర్ గంటా అప్పలకొండ విజ్ఞప్తి చేసారు ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో భాగంగా సోమవారం భీమిలి జోనల్ కమీషనర్ ఒమ్మి అయ్యప్ప నాయుడుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజుతో కలసి కార్పొరేటర్ గంటా అప్పలకొండ పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యంగా భీమిలి జోన్ 3వ వార్డు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సారథ్యంలో అభివృద్ధి సాగుతుందని అన్నారు. అందులో భాగంగా 3వ వార్డులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవసరాన్ని బట్టి పైలెట్ వాటర్ స్కీమ్ మరియు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. గనగళ్ల వీధి, నేరళ్లవలస వికలాంగుల కోలనీ, నేరళ్ల వలస సాక్ష్యం టివి రిపోర్టర్ ఇంటివద్ద, బోయవీధి – కొత్తపేట (శ్రీ నూకాలమ్మ ఆలయం ఎదురుగా), కృష్ణా కోలనీ – బొడ్డోడు గెడ్డ, అప్పికొండ వీధి, తోటవీధి – సంపత్ వినాయక ఆలయం వద్ద, తోటవీధి – బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనుక ట్యాంక్ నిర్మాణంతో పాటు పైలెట్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయాలని కోరారు. చిన్న బజార్ ఎన్టీఆర్ జంక్షన్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, కృష్ణా కోలనీ బస్టాండ్, పాత బస్టాండ్ (అనిల్ ప్రసాద్ షాపింగ్ కాంప్లెక్స్), కృష్ణా కోలనీ బొడ్డోడు గెడ్డ, గొల్లవీధి జంక్షన్ (క్రిష్ణ మందిర్ వద్ద ), నేరళ్లవలస కోలనీ జంక్షన్, నేరళ్లవలస సౌరీస్ ఆశ్రమం వద్ద, జూనియర్ కళాశాల జంక్షన్, అప్పికొండ వీధి జంక్షన్, బ్రాహ్మణవీధి జంక్షన్, డైట్ జంక్షన్, తోటవీధి శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద, బోయవీధి శ్రీ రామమందిరం వద్ద, గాడువీధి స్మశానవాటిక, జలగెడ్డ స్మశాన వాటిక, గనగళ్ల వీధి సర్కిల్, ఎర్నిమాంబ ఆలయం వద్ద, మున్సిపల్ హై స్కూల్ జంక్షన్, రెల్లివీధిలలో హై మాక్స్ లైట్లు వేయవలసినదిగా కోరారు. అదేవిదంగా పలు ఏరియాల్లో సిసిరోడ్లు, కాలువలు అవసరం ఉందని జోనల్ సిబ్బందితో పర్యవేక్షణ చేయించి త్వరతగతిన వేయాలని గంటా నూకరాజు, కార్పొరేటర్ గంటా అప్పలకొండ విజ్ఞప్తి చేశారు

గూడూరు

ఎస్.కే.ఆర్.డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపక సిబ్బంది మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం’ అనే థీమ్తో 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని సమాజంలో ఎయిడ్స్ బాధితులను చిన్నచూపు చూడటం లాంటి అంతరాలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధమైన పిలుపునిచ్చిందని, 2030 నాటికి ఎయిడ్స్ అంతం చేసే లక్ష్యాన్ని చేరుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో అందరి సహకారం అవసరమని, హెచ్ఐవిపై అవగాహన పెంచేందుకు, బాధితులపై వివక్షను రూపుమాపేందుకు, నేడు పలుచోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యార్థులుగా దీనిపై అవగాహన పెంచుకొని మన పొరుగు ప్రాంతాలలో కూడా నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కళాశాల నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, శ్రీధర్ శర్మ, డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, లక్ష్మీ హిమబిందు, గోపాల్, జనార్ధన్, భాష, సురేష్, శైలజ, సుందరమ్మ, ఉష, వినయ్, రమేష్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

భైరవకోనలో పర్యాటకుల సందడి.!

ప్రకాశం జిల్లాలోని భైరవకోన జలపాతం పర్యాటకులతో కళకళలాడుతోంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం నిండుకుండను తలపిస్తోంది. కొండలపై నుంచి జారుతున్న నీటిలో పర్యాటకులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

నిర్మల్

డిసిసి అధ్యక్షుని సన్మానించిన k. శ్రీ హరిరావు

నిర్మల్ : ఈరోజు నిర్మల్ మండల కేంద్రంలోని మారుతీ ఇన్ హోటల్ లో నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కుచ్చడి శ్రీ హరి రావు గారు నిర్మల్ జిల్లా నూతన అధ్యక్షులు గా ఎన్నికైన *డీసీసీ నిర్మల్ జిల్లా అధ్యకులు ఖానాపూర్ నియోజకవర్గం ఏమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్* గారికి హృదయపూర్వకగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తురకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన పోలు మాల్యాద్రి

భైరవరం పంచాయితీలోని తురకపల్లీ గ్రామంలొ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోస పింఛన్ల కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అదేశాల మేరకు ప్రతీ ఇంటికి ఉదయం 7 గంటల నుంచి సచివాలయం సిబ్బందితో వెళ్ళి వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 డయాలసిస్ పేషంట్లకు 10000 పూర్తి మంచానికే పరిమితమైన వాళ్లకు 15000 ప్రతీ నెల 1తేదీన పెన్షన్ల కార్యక్రమంలో సచివాలయం వెల్ ఫేర్ అసిస్టెంట్ ప్రమీల సిబ్బందితో కలిసి పాల్గొనడం జరిగింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సిటిజన్ సెల్ఫ్ EKYC ఓటిపి తో…!

మీరు మీ ఆధార్ కార్డులో Name, డేట్ ఆఫ్ బర్త్ మరియు అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసి ఉంటారు.కానీ ఆ వివరాలు ప్రభుత్వం యొక్క GSWS డేటా బేస్ లో మారవు.. మీరు మీ యొక్క ఆధార్ లో అప్డేట్/కరెక్షన్ చేసుకున్న వివరాలు ప్రభుత్వం యొక్క డేటా బేస్ లో కూడా మారితేనే మీకు సచివాలయం ద్వారా తీసుకునే Caste,Income అలాగే వివిధ సంక్షేమ పథకాల జాబితాలో ఉండగలరు. ఆధార్ లో మార్చుకున్న వివరాలు ప్రభుత్వం యొక్క డేటా బేస్/ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అప్డేట్ అవ్వాలి అంటే మీరు తప్పనిసరిగా EKYC చేసుకోవాలి. వాస్తవానికి EKYC కోసం సచివాలయం వచ్చి మీరు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీ యొక్క ఆధార్ లింక్ అయిన మొబైల్ OTP ద్వారా మీరే ఈ క్రింది లింక్ లో EKYC పూర్తి చేసుకోవచ్చు. https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc ముందుగా ఈ లింక్ లో ఆధార్ నెంబర్ మరియు Captcha కోడ్ ఎంటర్ చేయండి.ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి..EKYC పూర్తి అయినట్టే..eKYC పూర్తి అయిన 24 గంటల తర్వాత మీ ఆధార్ వివరాలు GSWS డేటా బేస్ లో అప్డేట్ అవుతాయి. గమనిక: ఆధార్ కలిగిన మీ కుటుంబ సభ్యుల అందరికీ ఈ లింక్ ద్వారా ఒకసారి EKYC పూర్తి చేసుకుని మీ యొక్క ఆధార్ వివరాలను ప్రభుత్వం యొక్క డేటా బేస్ లో అప్డేట్ అయ్యేలా చేసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలకి పూర్తి చేసుకోండి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం..

ఆంధ్రప్రదేశ్

నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో ప్రారంభమైన సర్వసభ్య సమావేశం హాజరైన శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కే ఆర్ నాగరాజు డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు..

కామారెడ్డి

కన్నాపూర్ గ్రామంలో అభివృద్ధికి కట్టుబడి ఉంటాను

– సర్పంచ్ అభ్యర్థి కర్రోల్ల లింగం కామారెడ్డి, 01 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండలం, కన్నాపూర్ గ్రామ పంచాయ తీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న అభ్యర్థి కర్రళ్ల లింగం పత్రిక ముఖంగా మాట్లాడుతూ, పోలీస్, అధికారు ల అందరం కలసి గ్రామ అభివృద్ధి కోసం నిబద్ధత తో పని చేస్తానని తెలిపారు. “ప్రజల అనుమతితో రోడ్లు, మంచినీరు, వైద్య, విద్యా సదుపాయాలు ఎంతో త్వరగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. ముఖ్యంగా మధ్యలో గర్గుల్ వెళ్లే రహదారి బ్రిడ్జి నిర్మాణం, అంగన్వాడి భవనం, పల్లె ధవాఖాన వంటి అమితవలసిన పనులను మొదటి దశలో గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా” అని ఆయన స్పష్టం చేశారు. కర్రోళ్ల లింగం ప్రజలకు నిజాయితీతో పనిచేస్తానని హామీ ఇచ్చి, పోలింగ్‌ రోజు ఓటు వేయాలని ఆహ్వానించారు. “ఏమిటి వాగ్దానాలు కాదు, నిబద్ధతే నా రాజకీయ మార్గం. మీ మద్దతు వల్లే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుంది” అన్నారు. కనుమరుగయ్యే గ్రామ సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడం, అందరికీ సేవ చేయడం తన ప్రభుత్వ విధిగా భావి స్తున్నాను,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నెల్లూరు ప్రజల్లో ఆనందం

నెల్లూరు (పున్నమి ప్రతినిధి) ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వానలు రైతులకు, నగర ప్రజలకు ఆనందం నింపాయి. గత కొన్ని వారాలుగా ఉన్న పొడి వాతావరణం తగ్గిపోవడంతో భూమిలో తేమ పెరిగి పంటలకు మంచి లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాగునీటి వనరులు, చెరువులు నిండుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇంకా కొన్ని రోజులు కొనసాగుతాయన్న అంచనాలతో మహానగరంలో ఉత్సాహం నెలకొంది.

ఆంధ్రప్రదేశ్

150 కుటుంబాలకు సహాయక పంపిణీ చేసిన ఆత్మీయత సేవా సొసైటి

జయశంకర్ భూపాలపల్లిలో ఆత్మీయత సేవా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ ఆదేశాల మేరకు మేడారం సమీపంలోని ముసలక్కపేట, సారక్కగూడెం గ్రామాల్లో 150 కుటుంబాలకు దుప్పట్లు, పాత బట్టలు, అరటిపండ్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు దాతల సహకారంతో పంపిణీ చేశారు. దాతలకు సొసైటి ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో మాటూరి క్రాంతికుమార్, పఠాన్ షాకీర్, పైండ్ల తిరుపతి, పాదం కుమారస్వామి, సెగ్గెం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.