Tuesday, 17 March 2026

Blog

E-పేపర్

రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు కమిషనర్ హెచ్చరిక

కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి ప్రతినిధి:నగరంలో కాలువల్లో,రోడ్లపై చెత్త వేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్‌ వి‌ వి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఉదయం జగన్నాధపురం ప్రాంతంలోని 25వ డివిజన్ పరదేశమ్మపేట, నాగరాజుపేటలలో శానిటేషన్ నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి టీ స్టాల్ వద్ద టీ గ్లాసులు రోడ్డుపైన పడేయడం గమనించిన కమిషనర్ సత్యనారాయణ టీ షాప్ యజమానిని పిలిపించి తక్షణమే గ్లాసులు తొలగించాలని ఆదేశించారు.ఇకముందు కూడా చెత్తను రోడ్డుపై పడేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డివిజన్‌లో ప్రజలను పలకరించిన ఇంచార్జ్ కమిషనర్,పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ చెత్త సేకరణకు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పౌరులు పురమిత్ర యాప్‌ను వినియోగించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు.నగర ప్రజలకు క్లీన్ సిటీపై అవగాహన కల్పించి వారిని స్వచ్ఛ నగరంలో తీర్చి దిద్దడంలో భాగస్వామ్యం చేస్తామని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దళే పృథ్వి చరణ్, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ,శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు,శానిటేషన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నిర్మూలనకై అవగాహన భారీ ర్యాలీ

పున్నమి న్యూస్ పెద్దాపురం, 01 డిసెంబర్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ సూపర్నెంట్ డి ఉమామహేశ్వరి గారి ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయ కు చెందిన విద్యార్థి విద్యార్థుల మరియు NCC క్యాడెక్స్ సామాజిక సేవ దృక్పథంతో స్కూల్లో ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి కొత్తపేట గుర్రాల సెంటర్ వరకు 150 మంది విద్యార్థిని విద్యార్థులు, హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది, ఇతర నర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్స్ తో భారీ ర్యాలీ జరిగింది గుర్రాల సెంటర్ వద్ద హాస్పటల్ సిబ్బంది నవోదయ విద్యార్థి విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించడం గూర్చి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజకుమార్, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ గోపి, డాక్టర్ అనుష రాయ్, హెడ్ నర్స్ రమాదేవి, జవహర్ నవోదయ విద్యార్థుల అసోసియేట్, ఎన్సిసి ఆఫీసర్ లెఫ్ట్నెంట్ ఎస్ సూర్యనారాయణ, నవోదయ ప్రిన్సిపాల్ శ్రీమతి డి సీతాలక్ష్మి, టీచర్స్ వి ప్రేమలత, లైబ్రేరియన్ శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీమతి మధుబాల, కృష్ణవేణి, బి నగేష్, ఐసిటిసి, కౌన్సిలర్ బి శ్రీనివాసరావు, ఎల్ టి O శ్రీనుబాబు, స్టాఫ్ నర్స్ పి సుగంది, ఎస్ ఎస్ ఎన్ స్టాఫ్ బి రోజా, పి వసంత, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ న్ అప్పలకొండ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ వంగలపూడి సతీష్ పాల్గొన్నారు

విశాఖపట్నం

హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ సోమవారం సాయంత్రం విశాఖలో భవ్య సేవా కార్యక్రమం

విశాఖపట్నం, డిసెంబర్ 1: అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రులు తమ స్వస్థల పట్ల మమకారాన్ని మరోసారి చాటుకుంటున్నారు. వారి సహకారంతో, Houston Helping Hands ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈ సాయంత్రం విశాఖలోని నిరాశ్రయుల టి ఎస్ ఆర్ కాంప్లెక్స్‌లో సాయంత్రం 7 గంటలకు జరుగనుంది. ముఖ్య అతిథులు కార్యక్రమానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంఖభ్రత బాగ్చి, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయనుండగా, 4వ టౌన్ సీఐ శ్రీ ఉమాకాంత్ గారు గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. వారి సమక్షంలో నిరాశ్రయులకు దుప్పట్లు అందించనున్నారు. ప్రవాసాంధ్రుల సేవా మనసు హ్యూస్టన్‌లో స్థిరపడినా, తమ ఊరుపై ప్రేమను మరువని పలువురు ప్రవాసాంధ్రులు— రాపర్తి శ్రీను, సలపు బాలరాజు, నాయుడు, దౌలూరు సోలమన్, రాపేటి సత్య, కర్ణం వరహాలు, పెంటకోట రమణ, కంబాల సూర్యప్రకాశ్, బోడీ కృష్ణ, పలిక రమణ, మొక శ్యాం, కడియాల సురేష్, గోటిముక్కల మౌలేశ్వరరావు, వడేగోర గణేష్, మద్ది వెంకట గురునాధరావు— ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కీలకంగా సహకరించారు. వారు అమెరికాలో నుంచే సమన్వయం చేస్తూ, తమ ప్రతినిధుల ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. చలికాలంలో ప్రాణాలకు రక్ష తీవ్రమవుతున్న చలికాలంలో ఒక దుప్పటి కూడా ప్రాణాలను కాపాడగలదన్న అవగాహనతో, శతాదిక నిరుపేదలకు దుప్పట్లు అందించే ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారుల సమక్షంలో పంపిణీ జరగడం వలన కార్యక్రమానికి మరింత విశ్వసనీయత, పారదర్శకత లభించనుంది “మన హృదయం ఎప్పుడూ మన ప్రజలతోనే” — నిర్వాహకులు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ: “మనకు ఎక్కడ ఉన్నా, మన ఊర్లో ఎవరికైనా అవసరం ఉంటే సహాయం చేయడం మన కర్తవ్యం. అమెరికాలో ఉన్నా మన హృదయం మన ప్రజలతోనే ఉంటుంది. చలిలో వణుకుతున్న నిరాధారులకు ఈ దుప్పటితో కొంత భరోసా కలిగించగలిగితే అదే మా ఆనందం” అని తెలిపారు. మీడియాకు ఆహ్వానం ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరినీ కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ కోరింది. వారి హాజరు ఈ సేవా చర్యకు మరింత విలువను తెస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. సామాజిక సేవను ధ్యేయంగా పెట్టుకున్న హ్యూస్టన్ ప్రవాసాంధ్రుల ఈ కార్యక్రమం స్థానికులకు ప్రేరణగా నిలుస్తుందని విశాఖలోని సేవాసంస్థలు అభినందించాయి.

ఆంధ్రప్రదేశ్

మహాత్మా జ్యోతిరావు ఫూలే: ప్రాథమిక విద్య నుండి సామాజిక విప్లవం వరకు

మహాత్మా జ్యోతిరావు ఫూలే 1827లో పూణేలో జన్మించారు. చిన్నతనం నుంచి సమాజంలో ఉన్న వివక్షలను గమనించిన ఆయన, స్కాటిష్ మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను పొందుతూ సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకున్నారు. యౌవనంలో సావిత్రీబాయి ఫూలేతో కలిసి మహిళా విద్య, అణగారిన వర్గాల uplift కోసం పాఠశాలలను స్థాపించారు. బ్రాహ్మణిక వ్యవస్థలో నెలకొన్న అసమానతలను ఎదిరించి, సమానత్వం, న్యాయం కోసం నిరంతరం పోరాడారు. బాల్యదశలో ప్రారంభమైన ఆయన ఆలోచనలు భారతీయ సమాజంలో శాశ్వత మార్పులు తీసుకొచ్చిన గొప్ప సామాజిక విప్లవానికి దారితీశాయి.

ఆంధ్రప్రదేశ్

పట్టణ శాలివాహన కుమ్మర్ల సంఘం అధ్యక్షులుగా – జమ్మిశెట్టి రామకృష్ణ

పిడుగురాళ్ల పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగ ఉన్న శివ టెంట్ హౌస్ నందు ఈరోజు శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా జమ్మిశెట్టి రామకృష్ణ,ప్రధానకార్యదర్శి రాజవరపు రాఘవేంద్రరావు,కోశాధికారి చీరాల వెంకటేశ్వర్లు,మీడియా కన్వీనర్ నడికుడి వెంకటేశ్వరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ శాత్రాసుపల్లి శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు గా మొగిలిచర్ల కోటేశ్వరరావు,సిరికొండ శేషగిరిరావు,మద్దిగుంట్ల శివశంకర్,దొంతుల శ్రీనివాసరావు,చల్లగిరి సాంబయ్య,మద్దిగుంట్ల కోటేశ్వరరావు,ఇల్లూరి కోటేశ్వరరావు,కార్యనిర్వాహణ కార్యదర్శిలు గా గుమ్మడిదల సైదులు,బాడిశా కోటయ్య,తోగటి రామకృష్ణ,నారాయపురం వీరయ్య,కార్యవర్గ సభ్యులు గా గుమ్మడిదల నారాయణ,యడవల్లి వెంకటనారాయణ,తోగటి గోపీచంద్,నడికుడి ముక్కటేశ్వరావులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు జమ్మిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు పట్టణ అధ్యక్షులు గా బాధ్యతలు అప్పగించిన కుమ్మర శాలివాహన సంఘం పెద్దలకు పేరు పేరున ధన్యవాదములు తెలిపారు.నాకు అప్పగించిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తానని సంఘం అభివృద్ధికీ తమవంతు కృషి చేస్తానని తెలిపారు.ఇవే కాకుండా రానున్న రోజుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సంఘం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*తుఫాన్ సైతం లెక్కచేయకుండా పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి నారాయణ*

* మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 100 శాతం అమలు చేసి తీరుతాం మంత్రి నారాయణ రాష్ట్రంలో ఒకేరోజులో 90% పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.. నెల్లూరు నగరంలోని 11 డివిజన్లో తుఫాను సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు ..జోరు వానలో సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న నారాయణను లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగా పెన్షన్ దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు..*అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు* ప్రతినెల ఒకటో తేదీ రాష్ట్ర పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు.. ఉదయాన్నే ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.. 68 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ దారులకు పెన్షన్ పెంచడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు.. దాదాపు 34 వేల కోట్ల రూపాయలు పెన్షన్ను అందజేస్తున్నామని .. ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు..భారతదేశంలో కూడా ఎక్కడ ఇంత మొత్తంలో పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎంకు ఉన్నటువంటి ఆపారమైన అనుభవంతో హామీలు అమలు చేస్తున్నామన్నారు… కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు… అదేవిధంగా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని. జూన్ 12వ తారీకు నుంచి 67 లక్షల మందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు 20,000 అందించామని .. ఆగస్టు నుండి మహిళలకు కూడా ఉచిత బస్సు అమలు చేశామని మరోసారి గుర్తు చేశారు.. ఇప్పటికే 200 అన్న క్యాంటీన్లో 100 రోజులు పూర్తి చేసామన్నారు.. మరో వంద అన్న క్యాంటీన్లో సిద్ధం చేస్తున్నామని.. అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ వందకు వంద శాతం అమలు చేస్తామని కంఠాపదంగా చెప్పారు.. అనంతరం *నుడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడారు..* మంత్రి నారాయణ గారు క్రమశిక్షణకు మారుపేరని జోరు వానలో సైతం లెక్కచేయకుండా సమయానికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం అందులో మంత్రిగా నెల్లూరు నగర ఎమ్మెల్యే కావడం నియోజవర్గ వాసుల అదృష్టమని పేర్కొన్నారు స్కూల్స్ పార్కుల అభివృద్ధి కాలువల పూడికతీత పనులకు మంత్రి పెద్దపీట వేశారన్నారు కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని.. ఒక విజన్ తో ప్రణాళిక బద్ధంగా నగరాభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్,డివిజన్ అధ్యక్షుడు గొడ్డేటి నాగేంద్ర..ప్రధాన కార్యదర్శి నారాయణ..ఉపాధ్యక్షుడు రాంబాబు, కొక్లస్టర్ ఆవుల శ్రీనివాసులు,227 బూత్ ఇంచార్జ్ ఏకుల నాగార్జున,గోతం బాలకృష్ణ, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

*కెనడా టొరంటోలో డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన – డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025(ఫ్యామిలీ ఫెస్టివల్ 2025)*

కెనడాలోని డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో, కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్‌తో “డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025:” వేడుకలు టొరంటోలోని మ్యాక్స్‌వెల్ హైట్స్ సెకండరీ స్కూల్, ఓషావా ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సుమారు 800కి పైగా తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నాయి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణా రంభోట్ల సంతోష్ కుంద్రు, అలాగే యువ వ్యాఖ్యాతలుగా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు. డి.టి.సి ఎగ్జిక్యూటివ్ కమిటీసభ్యులు నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవ‌కుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకు పాలెం, శివరామ్ మోహన్ పసుపులేటి గార్ల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. తరువాత కెనడా జాతీయ గీతం మరియు మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తదుపరి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని వయసుల పిల్లలు, కళాకారులు అద్భుతమైన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలో డి.టి.సి కుకింగ్ షో మరియు డి.టి.సి కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. విజేతలు మరియు పాల్గొన్న వారికి Advanced Physio వారి బహుమతులు గ్రాండ్ స్పాన్సర్‌గా తూసి వినయగమూర్తి అందజేశారు. డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు మాట్లాడుతూ, మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. కెనడాలో నివసిస్తున్న తెలుగు సమాజం చూపుతున్న ఐక్యత, సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మన భారత సాహితి, సంపద ఉత్సవాలను కెనడా లో ఘనంగా జరపడం మన అదృష్టం గా భావిస్తున్నానని డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు గుర్తు చేసారు ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా డా. బాబీ యానగావా గారు (ఎం.డి, పీహెచ్.డి, ఎఫ్.ఆర్.సి.ఎస్.సి), డివిజన్ హెడ్ – కార్డియాక్ సర్జరీ, సెయింట్ మైకేల్ హాస్పిటల్ విచ్చేశారు. ఆయన కార్డియో ఆరోగ్యం మరియు కుటుంబ ఆరోగ్యంపై విలువైన సూచనలు అందించి డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) కుటుంబ సభ్యులకు మరింత ఆరోగ్య సంరక్షణ గురించి అందరికీ ఉపయోగపడే విషయాలను చక్కగా వివరించారు. ఈ సందర్భంగా డీ.టి.సి ఎక్సలెన్సీ అవార్డులు అందజేయబడ్డాయి. డా. బాబీ, డా. శరత్ గుండల, డా. శ్రీవాణి గుండల గారి చేతుల మీదుగా డి.టి.సి కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డు – శ్రీమతి ఉషా నడుఱి గారికి, డి.టి.సి ఆర్ట్స్ మ్యూజిక్ & క్లాసికల్ డాన్స్ ఎక్సలెన్సీ అవార్డు – చిన్నారి సిరి వంశిక చిలువేరు కి, డి.టి.సి ఆర్ట్స్ & సింగింగ్ ఎక్సలెన్సీ అవార్డు – చిన్నారి శ్రేయస్ ఫణి పెండ్యాలకి, అందజేసారు. ముగ్గురు అవార్డు గ్రహీతలకు DTC తరఫున సత్కారం చేసి, వారి ప్రతిభను అభినందించారు. కార్యక్రమ విజయానికి చేయూతనిచ్చిన ప్రాయోజకులను DTC సంస్థ శాలువాలతో సత్కరించింది. ఈ సందర్భంగా గ్రాండ్ స్పాన్సర్‌గా తూసి వినయగమూర్తి, ఫుడ్ స్పాన్సర్స్‌గా సింప్లీ సౌత్ రెస్టారెంట్ – ఓషావా (రామ్ & సస్య పెడ్డి) గార్లు సహకరించారు. సిల్వర్ స్పాన్సర్స్‌గా రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియాల్టీ (రమేష్ గోలు, ఆనంద పెరిచెర్ల), రఘు జులూరి, భారత్ లా గార్లు మద్దతు అందించారు.అలాగే సపోర్టింగ్ స్పాన్సర్స్‌గా అడ్వాన్స్ ఫిజియో (గౌతమ్ పిడపర్తి), డా. శరత్ గుండల, డా. పద్మజరాణి కొంగరా, డా. సౌజన్య కసులా, దేశీ కార్ట్ గ్రోసరీస్ (రాజశేఖర్), సివమ్మ టిఫిన్స్, బండీ మేడ బజ్జి (శ్రవంతి), నమస్తే ఇండియా సూపర్ మార్కెట్ – ఏజాక్స్ (యోగేశ్ జీ), షోబి డెకోర్స్, పవన్ పీ.కె ఫోటోగ్రఫీ వంటి ప్రాయోజకులు ఈ కార్యక్రమానికి విలువైన సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గ్రేటర్ టొరాంటో ఏరియా(జీ.టీ.ఏ) లోని పలు తెలుగు సంఘాల ప్రతినిధులను డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు ఆహ్వానించి వారిని సత్కరించారు. ఈ సందర్భంలో DTC ప్రెసిడెంట్ శ్రీ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి మాట్లాడుతూ: “తెలుగు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించే దిశగా, గ్రేటర్ టొరాంటో ఏరియా(జీ.టీ.ఏ) లోని అన్ని సంస్థలు పనిచేస్తున్నాయి అని పేర్కొన్నారు. అంతేకాక, డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) సమాజ కార్యక్రమాలు, వినూత్న ప్రోగ్రామ్స్, ఎక్సలెన్సీ అవార్డులు, సహకార కార్యక్రమాల విజయానికి ప్రాయోజకులు అందిస్తున్న మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, డర్‌హమ్ తెలుగు అసోసియేషన్ (డీ.టి.ఏ) నుండి శ్రీమతి స్వాతి మీర్యాల గారు, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (ఓ.టి.ఎఫ్) నుండి శ్రీ ప్రవీణ్ నీలా గారు, బర్చ్‌మాంట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (బి.ఎఫ్.సి) నుండి – శ్రీ జగపతి రాయల గారు, శ్రీ సూర్య కొండేటి, టొరంటో తెలుగు కమ్యూనిటీ (టి.టి.సి) నుండి – శ్రీ విజయ కుమార్ కోట గారు, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్ మరియు డర్‌హమ్ హైదరాబాదీ అసోసియేషన్ నుండి వారి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు తెలుగు సమాజానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమంలో తెలుగింటి భోజనం, తినుబండారాలు, తేనీరు విందును సింప్లీ సౌత్ – ఒషావా సౌజన్యంతో అందించారు. అలాగే, డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) వారు 20 కిపైగా బహుమతులతో రాఫెల్ డ్రా విజయవంతంగా నిర్వహించారు. డీటీసీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి గారు మాట్లాడుతూ – ఏ దేశమేగినా ఎందుకాలిడిన ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న భావంతో, తెలుగు సంస్కృతి, ఐక్యత, ఆనందాలతో నిండిన డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 కార్యక్రమం కెనడా టొరంటోలో ఘనంగా విజయం సాధించింది. చివరగా డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు డి.టి.సి కార్యకర్తలు, స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు, వందన సమర్పణలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు

ఆంధ్రప్రదేశ్

*మంత్రులుఅనం రామ నారాయణ రెడ్డి. పొంగురు నారాయణ ప్రజలకు జవాబు చెప్పాలి*. మూలాపేటలో సహచరుల సమావేశంలో బిజెపి నేత మిడతల రమేష్ డిమాండ్..

నెల్లూరు మండలాలను తిరుపతిలో ఎందుకు కలి పారు! ఎవరి కోసం నెల్లూరు ను విభజించి నష్టపరుస్తున్నారు. జిల్లాలోని *మంత్రులుఅనం రామ నారాయణ రెడ్డి. పొంగురు నారాయణ ప్రజలకు జవాబు చెప్పాలి*. మూలాపేటలో సహచరుల సమావేశంలో బిజెపి నేత మిడతల రమేష్ డిమాండ్.. సోమశిల -కండలేరు ఇంటర్ లింక్ అంతరాష్ట్ర ప్రాజెక్టులు. కండలేరు డ్యాము ను వేరు చేస్తే నీటి నిర్వహణ.రెవెన్యూ నిర్వహణ లలో సమస్యలు తలెత్తుతాయి. వందల సంవత్సరాలుగా కండలేరు నదిపై ఉన్న *రిపేరియల్ రైట్స్ పొందిన పొదలకూరు మనుబోలు రైతుల హక్కుల హరింపబడతాయి*. రాపూర్ కలువాయి సైదాపురం లలో ప్రభుత్వ భూములు అటవీ సంపద. సహజ వనరులు. కమర్షియల్ పంటలు అధికం. నెల్లూరు జిల్లా ప్రజలు వాటిని ఎందుకు కోల్పోవాలో మంత్రులు జవాబు చెప్పాలి.. నెల్లూరును రాయలసీమ జోన్ లో కలపడం సమంజసం కాదు. కరువు సమయంలో రాయలసీమ నుండి ఒక్క టీఎంసీ నీరు కూడా సోమశిల అందలేదు. శ్రీశైలం జలాలు పోతిరెడ్డిపాడు నుండి చేసిన 120 టీఎంసీల కేటాయింపులలో ఒక్క టీఎంసీ కూడా నెల్లూరు జిల్లాకు కేటాయించలేదు. అంతర్రాష్ట్ర ఒప్పందాలను గౌరవించి కండలేరు నుండి కరువు సమయం లోను చెన్నైకి త్రాగునీరు అందించిన మనస్తత్వం కలిగిన వారు నెల్లూరు వారు. విభజన చేసే మండలాలను నెల్లూరులోనే కలపాలి. నెల్లూరు అమరావతి జోన్ లో కలపాలి. ఈ సమావేశంలో నరాల సుబ్బారెడ్డి. అల్లూరు నాగేంద్ర సింగ్. నీలిశెట్టి లక్ష్మణరావు. మురగా నరేష్. జె.శ్రీకృష్ణ. ఆదినారాయణ.. పరిటాల వెంకటకృష్ణ. అరిపినేటి నరసయ్య. రాఘవేంద్ర. చిట్టిబాబు. శ్రీనివాసులు. కళ్ళు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న డ్రోన్ నిఘా-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు*

*SPS నెల్లూరు జిల్లా*  *జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనల మేరకు, సంబంధిత DSP గార్ల ఆధ్వర్యంలో ఆయా CI/SI ల సమక్షంలో డ్రోన్ తో, నెల్లూరు పట్టణ, శివారు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డు కట్టు వేస్తున్న నెల్లూరు పోలీసులు.*  *జిల్లావ్యాప్తంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మరియు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు విస్తృతంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేసిన నెల్లూరు పోలీసులు*  *నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతూ, జల్లెడ పడుతున్న నెల్లూరు పోలీసులు.*  _*అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతూ కేసులు నమోదు చేయడం జరిగింది.*_  *గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా… బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..*  *ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తాం..*  *నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా….*  *క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్న నెల్లూరు పోలీసులు.*  *బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది.*  *నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.*  *కావున ఎవరైన చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు.*  *గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారు పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.*  *జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు వినూత్న చర్యలు తీసుకుంటున్న నెల్లూరు పోలీసులు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి తెలపగలరు.* జిల్లా పోలీసు కార్యాలయం, తేది.01.12.2025.

జాతీయ అంతర్జాతీయ

మహిళల జాకెట్‌ల ప్రయాణం: ఫ్యాషన్ ఎలా పరిణామం చెందింది”

మహిళల జాకెట్‌లు 19వ శతాబ్దం చివరిలో యూరోప్‌లో ఫ్యాషన్ డిజైనర్ల ద్వారా పరిచయం అయ్యాయి. భారతదేశంలో అవి బ్రిటిష్ కాలంలో పాశ్చాత్య ప్రభావంతో ప్రవేశించాయి. చట్టపరంగా ఎలాంటి బలవంతపు నియమాలు లేవు, ఇది పూర్తిగా సమాజపు ఫ్యాషన్ మార్పులతో సహజంగానే ఆమోదించబడింది. ఈ విధంగా, మహిళల జాకెట్ ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్‌గా ప్రపంచమంతా విస్తరించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.