Tuesday, 17 March 2026

Blog

విశాఖపట్నం

ఇస్లామిక్ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*ఇస్లామిక్ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* * *డిసెంబర్ 7వ తేదీన పూర్ఖాన మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఇస్లామిక్ ఆధ్యాత్మిక మహాసభ కు ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి శివాజీ పాలెం కార్యాలయంలో అందజేశారు .ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9:00 వరకు సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సు హాజరు కావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఆహ్వానం పత్రికను అందజేశారు. అనంతరం సదస్సు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమంలో కమిటీ పెద్దలు పాల్గొన్నారు*..

విశాఖపట్నం

ఉదయం ఓక గుర్తు తెలియని వ్యక్తి 90వార్డు విమాన్ నగర్.

01-12-2025 తేదీన. విశాఖ అక్టోబర్( పున్నమి ప్రతినిధి) బస్ స్టాప్ వద్ద ఆపస్మారక స్థితి లో ఉండగా, 108 కాల్ చెయ్యడం జరిగింది. అప్పటికే అతను మరణించి నట్టు నిర్దారించారు.. అతని వద్ద ఎటువంటి చిరునామాకు సంబందించినవి లేవు..ఈ విషయం ఎయిర్ పోర్ట్ police వారు తెలుసుకొని మన 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ కి. తెలియ జేయగా వెంటనే స్పందించి జరగవలసిన అంతిమ సంస్కారాలు ఘనంగా చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో airport ASI అప్పలరాజు గారు, విమాన నగర్ అసోసియేషన్ సభ్యులు రమేష్,తరుణ్, శ్రీను, నరసింహ పాల్గొన్నారు. సదా మీ సేవలో* 90 వార్డు కార్పొరేటర్. Ex స్టాండింగ్ కమిటి మెంబర్. మీ బొమ్మిడి రమణ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు సచివాలయంలో రైతన్న మీకోసం కార్యక్రమం..*

* *కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు*, *ఆత్మకూర్ ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్* *మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడుమండల పరిధిలోని ,మర్రిపాడు గ్రామమం సచివాలయంలో రైతన్న మీకోసం కార్యక్రమం మండల వ్యవసాయాధికారి ఎన్ కవిత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆత్మకూర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు హాజరై, మాట్లాడుతూ. ఐదేళ్లలో రైతులను రాజులుగా చేసేందుకు ప్రభుత్వం ఐదు విధానాలతో అమలు చేయుచున్న కార్యాచరణ వివరాలైన నీటి భద్రత, డిమాండ్ ,ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మద్దతు ధర గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శిమూలి వెంగయ్య మాట్లాడుతూ గతంలో స్వామినాథం కమిటీ ఇతర దేశాలు వెళ్లి వ్యవసాయం మీద అధ్యయనాలు చేసి రైతులకు మేలు జరిగే విధంగా తెలుసుకొని వచ్చి భారతదేశం మొత్తం మీద వ్యవసాయ రంగానికి ఇలా చేస్తే అభివృద్ధి చెందని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భూమిలేని పేదలకి భూములు పంచి సాగు చేసుకొని జీవించే అవకాశం కల్పించాలని స్వామినాథం కమిటీ దేశానికి నివేదికలు సమర్పించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత సుబ్బయ్య, మాలపాటి వెంకటేశ్వర్లు, మర్రిపాడు మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుర్రం నాగేశ్వరరావు, ఇర్లపాడు, ఖాదర్పూర్ ,మర్రిపాడు, పంచాయతీల గ్రామాల రైతులు పాల్గొనడం జరిగినది.

కాకినాడ

టిడ్కో అపార్ట్మెంట్ నివాసుల సమస్యలును అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బిజెపి పెద్దాపురం పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రామ్ కుమార్.

టిడ్కో అపార్ట్మెంట్, వాలుతిమ్మాపురం రోడ్, పెద్దాపురం లో వీధి దీపాలు గురించి, పార్కింగ్ స్థలాలు ఆక్రమణ గురించిన సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన పెద్దాపురం బిజెపి పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రామ్ కుమార్, తిడ్కో అపార్ట్మెంట్ వాసులు, బిజెపి కార్యకర్తలు. సమస్యలు పరష్కరణ దిశగా సానుకూలంగా స్పందించి, సిబ్బంది కి ఆదేశాలు ఇచ్చిన మున్సిపల్ కమీషనర్.

నంద్యాల

నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్థికపరమైన హత్యలు ఘర్షణలు రాజకీయ పెత్తనం కొరకు ఘర్షణలు వ్యక్తిగత ఆస్తుల కొరకు ఘర్షణలు, హత్యలు పెరిగినవి – ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి

నంద్యాల, పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి: నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్థికపరమైన హత్యలు ఘర్షణలు రాజకీయ పెత్తనం కొరకు ఘర్షణలు వ్యక్తిగత ఆస్తుల కొరకు ఘర్షణలు మరియు వ్యక్తిగత తప్పిదాల వలన జరిగే హత్యలు పెరిగినవి గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో నంద్యాల జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నది మరియు భూకబ్జాలు అవినీతి అక్రమాలు మోసపూరిత అక్రమంగా సంపా దనలు బెదిరించి భూములను గుంజుకోవడము ఐపీలు పెట్టడం పార్టీలు వ్యక్తిగత ఆరోపణ లు పెరిగిపోయినవి పోలీసుల నియంత్రణ తగ్గిపోయినది రాజకీయ నాయకులు అధికార పార్టీల నాయకుల సోలాభము పెరిగిపోవడం వల్ల వీటన్నిటి కారణం అవుతున్నది ఉదాహరణకు ఒక ఉద్యోగస్తుడిని డబ్బుల కొరకు చంపడం నేడు ఒకే కులంలో కోర్టు తీర్పులో ఉన్న ముస్లింలో ఘర్షణ పడడం దళిత పేటలో భయం భక్తి లేనందున హత్యలు జరగడం అలాగే ఒక ఎల్ఐసి ఉద్యోగి భయభ్రాంతులను చేయడం వలన ఆత్మహత్య చేసుకోవడం పార్టీల మధ్య వ్యక్తుల మధ్య వైరుధ్యాలను మతం వైపు మళ్లించడం గెలివి గ్రూపు వారి ఆస్తులను కబ్జా చేసిన వారు అరెస్టు నుండి బయటకు వచ్చి ధైర్యంగా తిరగడము ఐపి పెట్టినవారు మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అని న్యాయవాదులతో నోటీసులు పంపా డం ఒకే పార్టీలో ఉన్నావా రు పెద్దరికం కొరకు ప్రజా సమస్యలు అడ్డుపెట్టుకొని రోడ్ల పైన ఘర్షణలు విమర్శలు చేసుకోవడం జరుగుతున్నది వీటి మార్పు కోసం ఎవరికి వారు నియంత్రణ చేసుకొని ప్రశాంతంగా ఉండాలని ఆలోచనను పోలీస్ అధికారులు కల్పించాలి. లేనియెడల ఇంకా పెరుగుతాయి టిడిపి పాలనలో గతం కన్న ఎక్కువగా జరుగుతున్న విషయము వాస్తవమని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన సిపిఎం మాజీ జిల్లా నాయకులు,నంద్యాల జిల్లా ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్వలి

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట అయ్యప్ప ఆలయంలో అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట : పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం (తాతయ్య) గురువారం పాల్గొన్నారు. ప్రత్యేక అన్నదానాన్ని లాయర్ రాయపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించగా, ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు వడ్డన చేసి సేవ చేశారు. అయ్యప్ప మాలధారుల కోసం ప్రతిరోజూ శ్రీ వన్ పులి వాహన సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుందని ఆయన తెలిపారు. రోజూ 400–500 మంది అయ్యప్ప స్వాములు, శివయ్య స్వాములు, భవానీ స్వాములు ఈ సేవలో పాల్గొంటున్నారని చెప్పారు. దేవాలయ కమిటీ పర్యవేక్షణలో సేవా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతున్నందుకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పీఎంఏవై 2.0 మంజూరు పత్రాలు లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా పత్రాల పంపిణీ

మున్సిపల్ కార్యాలయం, మంగళవారం : నిరుపేద కుటుంబాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) 2.0 కింద మంజూరైన గృహ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఒక ప్రాథమిక హక్కు. ఈ పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి” అని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పురోగతి ఆధారంగా నిధులను నాలుగు విడతలుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని వివరించారు. పునాది వేసిన తర్వాత మొదటి విడత, రూఫ్ లెవల్ దాకా నిర్మాణం పూర్తయినప్పుడు రెండో విడత, ఇంటి నిర్మాణం పూర్తయి కిటికీలు–తలుపులు అమర్చిన తర్వాత మూడో విడత, నివాసయోగ్యంగా పూర్తిగా సిద్ధమైన తర్వాత నాల్గవ విడత విడుదల అవుతుందని తెలిపారు. నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేందుకు ఈ దశలవారీ విధానం ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కమిషనర్, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, పీఎంఏవై లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో 87 మంది రోగులకు రూ.54.11 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ పేదల ఆరోగ్యానికి సీఎం అండగా: ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట,పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన 87 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.54,11,472 విలువైన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ— “ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి妥协 చేయరు. ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం తీసుకోలేకపోవద్దనే ఆలోచనతోనే సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విస్తృతంగా మంజూరు చేస్తున్నారు” అని తెలిపారు. ఇటీవలి కాలంలోనే నియోజకవర్గంలో 108 మందికి రూ.56.06 లక్షలు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాలక్రమంలో పూర్తిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే వివరించిన ఇతర పథకాలు: తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దీపం–2 కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతినెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు — ₹4,000, ₹6,000, ₹10,000, ₹15,000 చొప్పున సకాలంలో అందజేత పింఛన్లకే ప్రభుత్వం వార్షికం రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడింపు “చంద్రబాబే అభివృద్ధికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్. పి-4 ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది” అని ఎమ్మెల్యే తాతయ్య వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

నూతన మెడ్ ప్లస్ ప్రారంభోత్సవం

నూతన మెడ్ ప్లస్ ప్రారంభోత్సవం న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : యాచారం లో కొత్తగా మెడ్ ప్లస్ స్టార్ ప్రారంభించబడింది అంబేద్కర్ విగ్రహం ఎదురుగా అని రకముల మెడిసిన్స్ లభించును మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ పై 50- 80%డిస్కౌంట్ ఇతర బ్రాండ్స్ మెడిసిన్స్ పై 20%డిస్కౌంట్ జనరల్ ప్రొడక్ట్స్ పై 5%డిస్కౌంట్ మనం రోజు ఇంట్లో యూస్ చేసే నిత్య అవసర వస్తూళ్ల పైన 50% డిస్కౌంట్ ఉదాహరణ,డిష్ వాష్ రేట్ 115ఆఫ్టర్ డిస్కాంట్ 48 రూ ఫ్లోర్ క్లీనర్ రేట్ 158 ఆఫ్టర్ డిస్కౌంట్ 48 రూ కాఫీ పౌడర్ 258రూ ఆఫ్టర్ డిస్కౌంట్ 149 రూ ఇలా చాలా రకాల హౌస్ హోమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి

మహబూబ్ నగర్

ఎంపీ డీకే అరుణ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన రికగైజ్డ్ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ

*ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ* రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ లెటర్ హెడ్ పై టెట్ అంశంపై ఇచ్చిన వినతి పత్రాన్ని ఆధారంగా పార్లమెంట్ సెషన్ లో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మాతులకి మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు ఆర్టిఈ 2009 లో ఉన్న టెట్టు అంశంపై చర్చించి ప్రశ్నించడం జరిగింది సవరించాలని పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శానమోని నరసింహులు, శశి యాదవ్ ,మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్, శ్రీనివాసులు శాంతారెడ్డి, వీరేందర్ గౌడ్, సుధాకర్ ఆచారి, అమీర్ పాష, వివేక్ భవాని, గోపాల్ జి, మేడం గారికి కృతజ్ఞతలు తెలిపింది* రూల్ 377 కింద అంశం (MATTER UNDER RULE 377) 02.12.2025 గౌరవనీయ సుప్రీంకోర్టు 01.09.2025న సివిల్ అప్పీల్ నెం. 1385/2025లో తీర్పును వెలువరించింది, అందులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను 1 నుండి 8వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయులందరికీ, వారి నియామకంతో సంబంధం లేకుండా తప్పనిసరి చేసిందని పేర్కొంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా, నా రాష్ట్రమైన తెలంగాణతో సహా, 20 లక్షల మంది ఉపాధ్యాయులలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. విద్యా హక్కు చట్టం, 2009 మరియు ఎన్‌సిటిఇ (NCTE) యొక్క 23.08.2010 నాటి నోటిఫికేషన్ ప్రకారం, 2010కి ముందు నియమించబడిన ఉపాధ్యాయులు అర్హులుగా మరియు మినహాయింపు పొందినట్లుగా చట్టబద్ధంగా వర్గీకరించబడ్డారు, అయితే 2010 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయులు నిర్ణీత కాలంలో TET లో ఉత్తీర్ణత సాధించవలసి వచ్చింది అనేది సుపరిచితమైన వాస్తవం. విద్యా హక్కు చట్టం (RTE) , 2009 వివిధ రాష్ట్రాలలో వివిధ సంవత్సరాలలో అమలులోకి వచ్చిందనేది కూడా ముఖ్యమైన విషయం. TET కూడా అమలులోకి వచ్చి, సంబంధిత రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. విద్యా హక్కు చట్టం, 2009లోని సంబంధిత నిబంధనను సవరించడానికి ఒక సవరణ బిల్లును తీసుకురావాలని నేను గౌరవనీయ మంత్రిని అభ్యర్థిస్తున్నాను. *D K Aruna* *BJP* *Division No. 169*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.