Monday, 16 March 2026

Blog

విశాఖపట్నం

వ‌న్డే మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి : ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్*

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-* *పండుగ వాతావరణం లో ఇండియా-సౌతాఫ్రికా వ‌న్డే మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి : ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్* వైజాగ్ స్టేడియంలో ధ‌ర్డ్ వ‌న్డే మ్య‌చ్ ఏర్పాట్ల ను పరిశీలించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ వైజాగ్ : ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం జ‌ర‌గ‌బోయే మూడో వ‌న్డే కు అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో పూర్తి చేయ‌టం జ‌రిగింద‌ని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ అన్నారు. శ‌నివారం వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కి సంబంధించిన ఏర్పాట్లును ఏసీఏ సెక్ర‌ట‌రీ సానా స‌తీష్‌, వైస్ ప్రెసిడెంట్ , ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ బండారు న‌ర‌సింహారావు, కోశాధికారి దండ‌మూడి శ్రీనివాసరావు, ఏసీఏ కౌన్సిలర్ విష్ణు దంతు, ఏసీఏ స్టేడియం చైర్మ‌న్ ప్ర‌శాంత్, , ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సి.వో.వో గిరీష్ డోంగ్రే, ఏసీఏ సి.ఎ.వో జై కిష‌న్ ల‌తో శుక్ర‌వారం సాయంత్రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప‌రిశీలించారు. స్టేడియం మొత్తం తిరిగి ఏర్పాట్లు ను స్వ‌యంగా స‌మీక్షించారు. పోలీస్ అధికారుల‌తో మాట్లాడి భ‌ద్ర‌త ప‌రంగా తీసుకుంటున్న జాగ్ర‌త్తలు తెలుసుకోవ‌టంతో పాటు త‌గు సూచ‌నలు, స‌ల‌హాలు అందించారు. స్టేడియం లోపల, వెలుపల ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ప్రేక్షకులకు అవసరమైన తాగునీరు, శౌచాలయాలు, వైద్య సౌకర్యాలతోపాటు అగ్నిమాపక భద్రత వంటి కనీస వసతులు సరిగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు, ప్రముఖుల రాకపోకలు, వారి భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మ్యాచ్ నిర్వహణలో పాల్గొనే ఏసీఏ సిబ్బంది, ఇతర ఏజెన్సీలు , పోలీసు యంత్రాంగం మధ్య పూర్తి సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత విశాఖపట్నంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్‌ను విజయవంతంగా, ఒక పండ‌గ వాతావ‌రంణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. . ఈ సమగ్ర ఏర్పాట్లు మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే వేలాది మంది క్రీడాభిమానులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తాయని స్ప‌ష్టం చేశారు.

విశాఖపట్నం

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ*

*బామిని డిసెంబర్ 5(విశాఖ పున్నమి ప్రతినిధి)* *మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ* *భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రగతి నివేదికను సమర్పించిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్* *ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…* ⦁ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయి… దీనికి అందరూ సహకరించాలి. ⦁ విద్యార్థులు అద్భుతంగా మీటింగ్ నిర్వహించారు. ⦁ మూడేళ్లల్లో ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ⦁ భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల నాలెడ్జీ అద్భుతంగా ఉంది.. త్వరలో వాళ్ల నుంచే నేను నేర్చుకునే రోజు వస్తుంది ⦁ పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధిస్తారు ⦁ విద్యలో పిల్లల బలాబలాలు తెలుకునేందుకు… దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటెన్, స్టీమ్ అనే మూడు వర్గాలుగా వర్గీకరించారు. ⦁ క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది. ⦁ నేను అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది… పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు ⦁ పరీక్షలు జరిగిన తర్వాత సమర్ధత తెలుసుకోవడం కాకుండా… ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా చేయడం బాగుంది. ⦁ పిల్లలు మట్టిలో మాణిక్యాలు… సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరు ⦁ కరుణకుమారి… అంధ విద్యార్థి… ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అంధ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించింది ⦁ పల్నాడు మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు… అలాగే ప్రజా ప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ⦁ ఒకప్పుడు పిల్లలు భారం… కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే శ్రీరామ రక్ష, పిల్లలే భవిష్యత్ ⦁ మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిట్స్ వరకు నాణ్యత పెంచాం ⦁ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా, నాణ్యతతో అందిస్తున్నాం ⦁ స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫొటోలు లేకుండా ఇస్తున్నాం ⦁ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ప్రవచనాలను… విలువలను విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటున్నారు ⦁ తల్లితండ్రి కష్టపడతారు… గురువులు విద్య బోధిస్తారు… కానీ ఇవాళ్టీ రోజుల్లో విలువలు తగ్గిపోతున్నాయి ⦁ విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని.. దానికి సహకరించాలని చాగంటి కోటేశ్వరరావును కోరాం ⦁ గతంలో విద్యార్థులకు చాలా యాప్ లు ఉండేవి… ఇప్పుడు అలాంటి ఇబ్బందులను తొలగించాం ⦁ శనివారం నో బ్యాగ్ డే… ఆడుతూ పాడుతూ విద్యార్ధులకు నచ్చిన పని చేస్తున్నారు ⦁ 24 గంటలు రుద్దితే చదువు అబ్బదు.. ఇష్టంతో తక్కువ సమయం చదివినా రాణిస్తారు ⦁ చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ⦁ షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం ⦁ విద్యలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు క్లస్టర్ అప్రోచ్ ద్వారా ప్రయత్నిస్తున్నారు ⦁ ప్రపంచంలో లెర్నింగ్ విధానాలు అధ్యయనం చేస్తున్నారు… విదేశాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు ⦁ టీచర్లను రిక్రూట్ చేయకుండా చదువు చెబితే అది బూటకమే ⦁ ప్రభుత్వ టీచర్లను నియమించాం… చక్కటి చదువును చెప్పిస్తున్నాం ⦁ మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ⦁ కానీ దాన్ని సమర్ధంగా ఎదుర్కొని ఏడాదిలోనే డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తి చేశాం ⦁ ట్రాన్సఫర్లను పారదర్శకంగా నిర్వహించాం ⦁ గతంలో టీచర్లను అవమానించారు… మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు ⦁ టీచర్లను గౌరవించే బాధ్యత మాది… పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే టీచర్లది ⦁ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీచరుకు 18 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. ⦁ కానీ ప్రైవేట్ స్కూళ్లల్లో ఒక టీచరుకు 25 మంది పిల్లలు ఉన్నారు. ⦁ ఇంతటి స్టాఫ్ ను ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చాం… ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలి ⦁ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది… మేం సరి చేస్తున్నాం.• విద్యార్ధులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాం… పిల్లలు అదరగొట్టారు. • *స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నాం.* • *పారిశ్రామికవేత్తలను ఇన్నోవేటర్స్ సదస్సుకు ఆహ్వానిస్తాను… పిల్లల ఆలోచనలు బాగుంటే ప్రతిభను గుర్తించి రివార్డులు అందిస్తాం* • *ఉన్నత, విదేశీ విద్య కోసం కలలకు రెక్కలు పేరిట పథకం ప్రారంభిస్తున్నాం* • *పావలా వడ్డీతో విదేశీ విద్యకు రుణాలిప్పిస్తాం* • *విద్యార్థుల కలలు, కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు* • ప్రభుత్వ పాఠశాలల్లోనూ సోలార్ ప్యానెళ్లు పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలి • పార్వతిపురం మన్యం జిల్లాలో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ పాటించాలి • పిల్లలకు అవసరమైన విద్యను అందిస్తాం… దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. • మంత్రి లోకేష్ విషయమై నేను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదు… లోకేష్ టీచర్లతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. • కొన్ని అంశాల్లో లోకేష్‌కు ఫౌండేషన్ ఇప్పించాం.. ఆ తర్వాత చక్కగా చదువుకున్నారు…ఇప్పుడు మంత్రి అయ్యారు • రాజకీయాల్లోకి రమ్మని లోకేష్ ను నేను ఫోర్స్ చేయలేదు • విద్యా శాఖ చాలా కష్టంగా ఉందని చెప్పినా… విద్యా విధానాన్ని తీర్చిదిద్దేలా చేస్తానని లోకేష్ చెప్పారు. • లోకేష్ తల్లి భువనేశ్వరి స్టాన్ ఫోర్డ్ వరకు తీసుకెళ్లారు… విద్యార్థులను ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత లోకేష్ దే. • ఏడో తరగతి నుంచి వినూత్నంగా ఆలోచించాలి • గ్రూప్ గా… వ్యక్తిగతంగా ఇన్నోవేషన్స్ చేసేలా ఆలోచన చేయాలి • ఆడవారిని హింసించినా.. వేధించినా ఆడబిడ్డలకు భద్రత.. భరోసా కల్పించే బాధ్యత మాది • డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా చేపట్టే బాధ్యత విద్యార్థులకూ ఉంది. • తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాల్వ ఏర్పాటు చేస్తాం. వంశధార-పోలవరంను అనుసంధానించి నీటి ఎద్దడి లేకుండా చూస్తాం • కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్

విశాఖపట్నం

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న – రూ 4.5 కోట్ల‌తో హాస్ట‌ల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- * ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిశంబరు 7 వ తేదీన డా॥ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం గం. 9.00 ని॥ లకు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్య‌క్షులు ఐ.వి.ఎన్‌.ఎస్‌.కె విశ్వ‌నాథ రావు తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం సంఘం కార్యాల‌యంలో వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజ‌ర‌వుతారు. ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా ప‌ట్ట‌భ‌ద్రులైన‌ పూర్వ విద్యార్థులు పెద్ద‌సంఖ్య‌లో ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వ‌విద్యార్థులు త‌మ ప్ర‌యాణాన్ని, ప్ర‌గ‌తిని, అనుభ‌వాల‌ను, అనుభూతుల‌ను ఈ సంద‌స్భంగా పంచుకుంటారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు నగదు పురస్కారం వారి తల్లిదండ్రులకు సత్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. స‌మావేశం అనంత‌రం పూర్వ విద్యార్థుల సంఘంచే నిర్మింపబడిన సర్ ఎం.విశ్వేశ్వరయ్య హాస్టక్ బ్లాక్‌ను ఆసక్తి గల సభ్యులు సందర్శిస్తారు. ఈ హాస్ట‌ల్ భ‌వ‌నాన్ని రూ 4.5 కోట్ల వ్య‌యంతో పూర్వ‌విద్యార్థుల సంఘం స‌భ్యులు స్వ‌యంగా నిర్మించి వ‌ర్సిటీకి బ‌హూక‌రించ‌డం జ‌రిగింది. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో చ‌దువుకున్న పూర్వ‌విద్యార్థులంతా అందించిన విరాళాల‌తో ఈ హాస్ట‌ల్ భ‌వ‌న స‌ముదాయం నిర్మాణం జ‌రిపాము. విశాఖ న‌గ‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఉన్న పూర్వ‌విద్యార్థులంతా ఈ నెల 7వ తేదీ ఆదివారం జ‌రిగే పూర్వ విద్యార్థుల స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని పూర్వ‌విద్యార్థుల సంఘం త‌ర‌పున సాద‌రంగా ఆహ్వానిస్తున్నాము. శ‌తాబ్ధి వేడుక‌లు జ‌రుపుకుంటున్న త‌రుణంగా ఈ స‌మావేశం ఒక మ‌ధుర అనుభూతిగా నిల‌వాల‌ని ఆకాంక్షిస్తున్నాము. కార్య‌క్ర‌మంలో సంఘం కార్య‌ద‌ర్శి ఆచార్య కె.రాంబాబు, కోశాధికారి బి.భాస్క‌ర రావు, ఉపాధ్య‌క్షులు ఎం.జి మాధ‌వ బాబు, సీనియ‌ర్ స‌భ్యులు వి.ఆర్ రావు, ర‌విశంక‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విద్య వ్యవస్థలో మార్పుకు అనుగుణంగా సూచనలు ఇవ్వండి.

విద్య వ్యవస్థలో మార్పుకు అనుగుణంగా సూచనలు ఇవ్వండి. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు . *విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి:- * విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన 8వ జోన్ పెందుర్తి పరిధిలో సమగ్ర శిక్ష జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల బృహత్ సమావేశానికి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కార్యచరణ చేపట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి మంచి ఆలోచనతో ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల బృహత్ సమావేశం నిర్వహించాలని ఆదేశాల మేరకు పెందుర్తి పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులే కాకుండా ప్రజాప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, దాతలు పాల్గొని పాఠశాల అభివృద్ధితో పాటు పిల్లల భవిష్యత్తు కార్య చరణ పై చర్చించడం జరిగిందని మేయర్ తెలిపారు. పాఠశాలలో రాజకీయాలు ఉండకూడదని పాఠశాల ఉన్నతకి ప్రతి ఒక్కరు కృషితో, విద్యా వ్యవస్థలో మార్పుకు అవసరమయ్యే తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిల్లలకు అవసరమయ్యే పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ, యూనిఫామ్స్, షూస్ మొదలైన వాటి తో పాటు తల్లికి వందనం పథకాలను కూడా ప్రతి ఏటా  అందిస్తున్నారని తెలిపారు.  అనంతరం పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ఎటువంటి రాజకీయాలు తావులేకుండా మంచి విద్యా బోధన అందించేందుకు కృషి చేయాలన్నారు.  పిల్లలను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంతోమంది మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పాఠశాలలో విద్య నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా పాఠశాల కమిటీ సూచనలు పాటించి పిల్లలకు బంగారు బాట వేయాలన్నారు. పాఠశాలలో పిల్లలకు అవసరమయ్యే మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని శాసనసభ్యులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, పూర్వపు విద్యార్థులు, పలువురు దాతలు తదితరులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం

మోడల్ స్కూల్ గా కేజీబీవీ* *పి.టి.ఎం.లో గంటా*

*మోడల్ స్కూల్ గా కేజీబీవీ* *పి.టి.ఎం.లో గంటా* *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- * ఆనందపురం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. స్కూల్ ఆవరణలో శుక్రవారం జరిగిన పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో ఏం కావాలనేది స్కూల్ దశలో నిర్ణయించుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, గురువులు, స్కూల్, ఊరు, జిల్లా, రాష్ట్రం గర్వపడేలా ఉన్నత స్థానానికి చేరుకుని, మంచి పేరు తెచ్చుకోవాలని హితబోధ చేశారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను సొంత ఖర్చులతో సమకూరుస్తున్న ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ను గంటా అభినందించారు. కేజీబీవీ విద్యార్థిని మాట్లాడుతూ తాను బాగా చదువుకుని ఐ.ఎ.ఎస్. అవుతానన్నారు. అంతకు ముందు స్కూల్ ప్రాంగణంలో బుద్ధుడు, మదర్ థెరిస్సా విగ్రహాలను ఆవిష్కరించారు. స్కూల్ లో అభివృద్ధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నాగమణి, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, గాడు వెంకటప్పడు, కురుమిన లీలావతి, పాండ్రంగి అప్పలరాజు, గండ్రెడ్డి సోమినాయుడు, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, మహంతి శివాజీ, అంగటి రాము తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చదువుతోనే మంచి భవిష్యత్తు. కలెక్టర్ MN హరేందిర ప్రసాద్.

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి* చదువుతోనే మంచి భవిష్యత్తు. కలెక్టర్ MN హరేందిర ప్రసాద్. చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలక్టరు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన విశాఖ ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజుతో కలసి అక్కయ్యపాలెం ఎన్జీవో కోలనీలో, జివిఎంసి హై స్కూలులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశములో కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువుపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకుంటే బాల్య వివాహ సమస్య ఉత్పన్నం కాదన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలన్నారు. తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగి ఉంటే పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణ అలవాటవుతుందన్నారు. క్రమశిక్షణ పాటించినవారు అన్ని రంగాలలో విజయమంతమవుతారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నారా లోకేష్ చొరవతో మెగా పేరెంట్ టీచర్ మీట్ 3.0 జరుగుతుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అకాడమిక్ ట్రాక్ తెలుసుకోవడానికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించారని దీనివలన తమ పిల్లల ప్రగతి తెలుసుకో వచ్చన్నారు. ప్రతి తల్లిదండ్రి లీప్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే తమ పిల్లలు ప్రతిరోజు పాటశాలకు వస్తున్నారో లేదో కూడా తెలుసుకోవచ్చన్నారు. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు లీప్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం పిల్లలకు నచ్చే విధంగా ప్రభుత్వం పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటిగా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందిస్తున్నామని కలక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇస్తున్న స్కూల్ కిట్స్ సక్రమంగా వినియోగించుకోవలన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు ప్రభుత్వం 100 శాతం యాక్షన్ ప్లాన్ ప్రకారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను చదివించాలన్నారు. విద్యార్థినీ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్దికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విశాఖపట్నం ఉత్తర శాసన సభ్యులు శ్రీ విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని కొంత సమయం కేటాయించాలన్నారు. ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరు గౌరవం ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువు పై దృష్టి పెట్టాలన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. తాను పదవ తరగతిలో లెక్కలలో 100 శాతం మార్కులు సాధించాలని, అలాగే ఇంజనీరింగ్ లో రాష్ట్ర స్థాయిలో 34వ ర్యాంకు సాధించానన్నారు అందువల్ల ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాదించాలన్నారు.చదువు శాశ్వత ఆస్తి అని అది జీవితాంతం మన వద్దే ఉంటుందన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ 6 నెలలకొకసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (MPTM) ప్రభుత్వం నిర్వహిస్తున్నాదన్నారు కార్పొరేటర్ డి. శ్రావణి మాట్లాడుతూ ప్రైవేట్ పాటశాలలకు దీటుగా ప్రభుత్వ పాటశాలలలో ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తున్నాదన్నారు. అంతకుముందు ఎన్ సి సి కేడిట్ ల గౌరవ వందనం స్వీకరించారు. ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడారు. పిల్లల హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టు ను కలక్టర్,MLA పరిశీలించారు. ఇటీవల అమరావతిలో జరిగిన అసెంబ్లీ లో మార్షల్ గా వ్యవహరించిన హర్షవర్ధన్ అభినందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల్య వివాహాలు జరగకుండా తమ వంతు కృషి చేస్తామని కార్యక్రమం లో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రామారావు, హెడ్ మాస్టర్ రాదా కుమారి, స్కూల్ కమిటి చైర్మన్ అప్పలస్వామి, ఎయు మాజీ రిజిష్ట్రార్ ఉమా మహేశ్వర రావు, లయన్స్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

తిరుమల ఆచారాలను అవమానించిన జగన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా ఆగ్రహం*

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- *తిరుమల ఆచారాలను అవమానించిన జగన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా ఆగ్రహం* *జగన్ పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మళ్లీ నిలబెట్టిన విజనరీ చంద్రబాబు* *– రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* విశాఖపట్నం, డిసెంబర్ 05: తిరుమల శ్రీవారి పవిత్ర నామాన్ని రాజకీయ అబద్ధాల కోసం వాడుకోవడం జగన్‌మోహన్ రెడ్డి అలవాటైపోయిందని, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గురుంచి, సనాతన ధర్మం అంటే ఏంటో కూడా అర్థం కాని జగన్ రెడ్డి కి స్వామివారి గురించి మాట్లాడే అర్హత లేదు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కోట్లాది హిందువుల విశ్వాసం. స్వామివారి హుండీలో పడే ప్రతి పైసా భక్తి కన్నీటి కానుక అని, అలాంటి పవిత్ర సమర్పణను అపవిత్రం చేయటం దేవద్రోహమని పల్లా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం లో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళ హయం లో తిరుమల ఎంతో కొంత అభివృద్ది నోచుకుంది కానీ జగన్ రెడ్డి హయం లో అభివృద్ది మాట పక్కన పెడితే స్వామి వారిని అపహేళన మాట్లాడటం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశారని పల్లా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి కేసు దొంగ చేతికి అధికారం ఇస్తే ఏమవుతుందో చెప్పే తార్కాణం అని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజులకు ఒక్కసారి మీడియా ఎదుటకు వచ్చి “నేను ఉన్నా, మా పార్టీ ఉంది” అని నటించే జగన్ నాటకాన్ని ప్రజలు చూసి నవ్వుకుంటున్నారని అన్నారు. “నీ నోటి వెంట నిజం రాదు.. నిద్రలో లేపి దేవుడి గురించే అడిగినా అబద్ధమే చెప్తావు. ఎందుకంటే నీలో భక్తి లేదు, భయం లేదు” అని పల్లా గారు దుయ్యబట్టారు. భక్తులు కష్టపడి సంపాదించి స్వామివారికి సమర్పించిన మొక్కుబడులను కూడా దోచుకునే ధైర్యం జగన్ పాలనలోనే కనిపించిందని ఆయన విమర్శించారు. కేవలం రూ.72,000 చోరీకే వందల కోట్ల ఆస్తులు రాసిపెట్టడం, కేసు పెట్టిన వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోవడం..ఇవన్నీ జగన్ ముఠా పని తీరు ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాయని అన్నారు. రూ.11 దొంగతనం చేసినా, 11 కోట్లు దోచుకున్నా చట్టం ముందు రెండూ నేరాలే. నేరస్తుడిని సమర్థించడం మరింత పెద్ద నేరం అని పల్లా గారు హెచ్చరించారు. తిరుమల నెయ్యి కల్తీ విషయంలో పల్లా గారు మరింత ఘాటుగా స్పందించారు. ఒక్క చుక్క పాలు కూడా లేకుండా తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వాడటం ఇది అవినీతి కాదు, ఇది మహా పాపం. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ధార్మిక ద్రోహం అన్నారు. టెండర్ పిలవడం నుంచి సరఫరా ప్రారంభం అయ్యేవరకు అన్ని వైసీపీ హయాంలోనే జరిగాయని, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే సరఫరా మొదలుపెట్టడం కుట్రేనని పల్లా గారు ఖండించారు. సీబీఐ విచారణ కోరింది మీరే… మరి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కి విజిలెన్స్ విచారణ వద్దు అంటున్నారు? కల్తీ నెయ్యి వెనుక ఉన్న అసలైన నిందితులు బయటపడతారనే భయం కదా?” అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు సిట్ చేసిన అరెస్టులు వైసీపీ పాలనలో జరిగిన భారీ దోపిడీకి తొలి శిక్ష అని అన్నారు. తిరుమల ఆచార వ్యవహారాలు కూడా జగన్‌కు తెలియవని పల్లా గారు మండిపడ్డారు. “గుడిలో చెప్పులు వేసుకుని రాకూడదన్న సాధారణ ఆచారం కూడా తెలియని వ్యక్తి తిరుమల రూల్స్ గురించి ఉపన్యాసాలు చేయడం భక్తుల మనోభావాలపై దాడి. వేంకటేశ్వర స్వామికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలనే ఆచారం కూడా ఆయనకు తెలియదు” అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అత్యంత గౌరవంతో చూసే న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, సీనియర్ IAS అధికారులను ‘వాడు–వీడు’ అంటూ అవమానకరంగా సంబోధించడం.. చివరికి కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని కూడా చులకనగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అహంకార స్వభావానికి అద్దం పడుతుంది. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఉన్నతాధికారులను బెదిరించడం, కోర్టులపై దుష్ప్రచారం చేయించడం ఇవన్నీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే చర్యలు. న్యాయానికి, రాజ్యాంగానికి కనీస గౌరవం లేని ఇటువంటి వ్యక్తి దేశంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి వనం‌గా మార్చి, కల్తీ మద్యం మహమ్మారిలా వ్యాపింపజేసి వేలాది కుటుంబాలను దుఃఖంలో ముంచాడు. రాష్ట్రం మొత్తం నేరాలు, డ్రగ్స్, కల్తీ మద్యం దందాలతో పరువు పోయేలా చేసి, ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్ ఇమేజ్‌ను దేశంలోనే అత్యంత హీన స్థితికి నెట్టాడు. కానీ అదే రాష్ట్రాన్ని తిరిగి గౌరవప్రదమైన దిశగా నడిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మరోసారి ప్రపంచ పటంలో నిలబెడుతున్నవారు మన విజనరీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు. ప్రపంచం అంతటా పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు ఆకర్షించేలా ‘న్యూ ఏపీ బ్రాండ్’ను మళ్లీ నిర్మించడం వారి స్పష్టమైన దూరదృష్టి, కష్టపాటు వల్లే సాధ్యమవుతోందని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. 45,000 ప్రభుత్వ, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రత్యేక ఉత్సాహంతో సాగిందని తెలిపారు. ఇలాంటి పేరెంట్-టీచర్ మీటింగ్స్ విద్యార్థుల విద్యాభివృద్ధికి, తల్లిదండ్రుల అవగాహనకు, పాఠశాలల సామరస్యానికి గొప్ప వేదికగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ గారు హాజరై ప్రత్యేక ప్రాతినిధ్యం అందించడం, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే సంకేతం అని పల్లా గారు చెప్పారు. తల్లిదండ్రుల పాల్గొనడం వల్ల పాఠశాలల్లో విద్యార్ధుల అభ్యాసం, సానుకూల వాతావరణం గురించి సమగ్ర అవగాహన ఏర్పడుతుందని, ఈ రోజు ఘనంగా, విజయవంతంగా ముగియడం ప్రభుత్వ విద్యా విధానాలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందని పల్లా గారు పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో 10వ తరగతి విద్యార్థులు ప్యాడ్లు పంపిణీ చేసిన రామ కృష్ణ యాదవ్ అనే దాత

ఉదయగిరి మండలంలోని బండగానిపల్లె పంచాయతీ బిజ్జంపల్లి జిల్లా పరిషత్ ఉన్న హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మెగా PTM 3.0 కార్యక్రమంలో ప్యాడ్స్, స్టడీ, చైర్స్ అందజేశారు రేపటి నుండి వంద రోజులు పాటు జరగనున్న పదోవ తరగతి ప్రత్యేక తరగతులు జరగనున్నాయి కొండాపురం మండలం సత్యవోల్ ఆగ్రహం కీ చెందిన రామ కృష్ణ యాదవ్ అనే దాత రూ 25.000 వేలు ప్యాడ్స్, స్టడీ, చైర్స్ విద్యార్దులకు అందజేశారు

గూడూరు

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ,తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం -చిట్టేడు (తిరుపతిజిల్లా )

ప్రభుత్వ ఆదేశాలమేరకు కోట మండలం చిట్టేడు నందు గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం ఘనంగా జరిగినది ఈ సమావేశం కు ముఖ్య అతిధులు MEO శ్రీ దార మస్తానయ్య గారు, chairperson శ్రీమతి తుపాకుల శ్యామల గారు, ఉపాధ్యక్షులు శ్రీమతి మాణికల భ్రమరాంబ,సభాధ్యక్షులు శ్రీ ఎస్ సుభాకర్ రావు గారు, ప్రిన్సిపల్ గారు మరియు ఉపాధ్యాయిని ఉపద్యేయులు ప్రసంగించి వివిధ పోటీలలో విజేతలకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం కోట మండల విద్యాశేఖ అధికారి దార మస్తానయ్య గారు మాట్లాడుతూ విద్య పిల్లలను ప్రయోజకులుగా చేస్తుందని కనుక ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చి దిద్దాలని అన్నారు ప్రిన్సుపల్ శ్రీ సుభాకర్ గారు మాట్లాడుతూ రాబోయే పదవతరగతి పరీక్షలలో నూరు శాతం సాధించాలని కోరారు అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరు కలసి విద్యార్థులతో సమ పంక్తి లో భోజనం చేసారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం లో పేరెంట్స్ డే కార్యక్రమాలు

మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మర్రిపాడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్స్ డే 3.0 (తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ) కార్యక్రమంలో శుక్రవారం కస్తూర్బా గాంధీ కళాశాలలో బాలు పల్లి ప్రాథమిక పాఠశాలలో పాల్గొన్న ఆత్మకూరు ఏఎంసి చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు. మండలంలోని 24 పంచాయతీల్లోని పాఠశాలల్లో చైర్మన్ ల పంచాయతీ సర్పంచ్ల ప్రధానోపాధ్యాయుల మండల సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంను పండగ వాతావరణం లో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్రిపాడు మండల మాజీ కన్వీనర్ శాఖమూరి నారాయణ మండల అభివృద్ధి అధికారి నాగేశ్వరప్రసాద్ విద్యాధికారులు తిరుపతయ్య ధనలక్ష్మి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మలత మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ఎస్ కే బిబిజాన్ మర్రి పాడు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రాటకొండ వెంకటసుబ్బయ్య పాఠశాలల చైర్మన్లు కస్తూర్బా గాంధీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు బాలుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.