Monday, 16 March 2026

Blog

జోగులాంబ గద్వాల

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన.అంబేద్కర్ సంఘం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన.అంబేద్కర్ సంఘం… డిసెంబర్ 6వ తేదీన ఈరోజున ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో చేసిన కృషి, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ దేశవ్యాప్తంగా, వర్ధంతి నిర్వహిస్తారు.. ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చిన్న తాండ్రపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని స్మరించుకుంటూ గ్రామ పెద్దలు యువకులు ప్రజలందరూ పాల్గొన్నారు..

E-పేపర్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జట్ల రాజను పరామర్శించి ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ. న

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 05: ఇటీవలే కంటి శాస్త చికిత్స చేయించుకున్న రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జట్ల రాజా ను ప్రతిపా నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పైల వేణుగోపాల్, రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ ఇట్టం శెట్టి సూర్య భాస్కర బాబు, పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగు చలనచిత్ర గానవిభూషణం – ఘంటసాల వెంకటేశ్వరరావు స్మరణ సందర్భం గా సంకీర్తనా కళా సమితి వాట్స్ అప్ గ్రూప్ మెంబర్స్ వినమ్ర నివాళులు

తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచానికి చిరస్మరణీయమైన వెలుగు పంచిన గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నాం. స్వరసాహిత్య సమ్మేళనానికి ప్రతిరూపంగా నిలిచిన ఘంటసాల గారు, సంగీతాన్ని భగవద్గీతలా భావించి ప్రతి తరం గుండెల్లో నిలిచిపోయే అమర గానాలు అందించారు. భక్తి, భవగీత, దేశభక్తి, జనపదం—ఏ శైలినైనా తన ప్రత్యేక స్వరంతో అద్భుతంగా మలిచిన సంగీతవిద్వాంసుడు. తెలుగు కళారంగానికి ఆయన చేసిన సేవలు అపూర్వమైనవి. బిరుదాంకితుడైన ఈ మహానుభావుడి జయంతి సందర్భంగా, ఆయన త్యాగం, సంప్రదాయం, సంగీతానికి చూపిన నిబద్ధతకు సంకీర్తన కళా సమితి వాట్సప్ గ్రూప్ మెంబర్స్ తరుపున ప్రసాద్ బాబు హృదయపూర్వక వినమ్ర నివాళులు అర్పించారు

E-పేపర్

ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం.

రౌతులపూడి,( పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 05: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రశ్నాత్మకంగా చేపట్టిన మెగా( పిటిఎం ) తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మండలంలోని రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులచే పలు సంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి పాఠశాలను తలదన్నేలా ఈ మెగాపిటీఎం నిర్వహించిన స్కూలు ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబును పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని తద్వారా వాళ్ల ఉన్నతికి తోడ్పడిన వారు అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పైల సాంబశివరావు, మాజీ ఎంపీపీ ఇట్టం శెట్టి భాస్కర బాబు, నీటి సంఘాల చైర్మన్ పైల రాజేష్, శెట్టి రమణ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బండారు సత్తిబాబు, మండల విద్యాశాఖ అధికారులు సతీష్ బాబు, గాడి కొండబాబు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగమణి, వెంకటలక్ష్మి ములకపూడి పీహెచ్సీ డాక్టర్ సౌందర్య, మరియు స్కూలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు కార్యాలయంలో ప్రభుత్వ అధికారి వి ఆర్ ఓ సస్పెండ్

దుత్తలూరు మండల లో VRO గా పనిచేస్తున్న చింతల చెరువు శ్రీనివాసులు సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాదికారులు ఆదేశాలు జారీచేశారు ఈ వివరాలను దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు VRO గా గతంలో ఏరుకొల్లు పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు .

అనంతపురం

పవర్ గ్రిడ్ అధికారుల దౌర్జన్యం – రైతు ఆత్మహత్యాయత్నం

రైతు గంగాధర్ పరిస్థితి విషమం తాడిపత్రి, శుక్రవారం: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో పవర్ గ్రిడ్ అధికారులు నిర్వహిస్తున్న టవర్ ఏర్పాటుపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులతో చర్చించకుండా, వారికి అందాల్సిన పరిహారం కన్నా తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ టవర్లను బలవంతంగా ఏర్పాటు చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేడ్కరిస్ట్) అనంతపురం జిల్లా అధ్యక్షుడు వీర నాగరాజు మాట్లాడుతూ, “పవర్ గ్రిడ్ అధికారుల నిరంకుశ చర్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. రైతులను నష్టపరిచే ఈ ప్రాజెక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము” అని పేర్కొన్నారు. అధికారుల వ్యవహారశైలి వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన రైతు గంగాధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబసభ్యులు, గ్రామస్థులు స్పందించి అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామంలో ఈ ఘటన కలకలం రేగించగా, రైతులు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు టవర్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అనంతపురం

సజ్జలదిన్నెలో జడ్‌పి హై స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ విజయవంతం

సజ్జలదిన్నెలోని జడ్‌పి హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ హర్షోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల అభ్యాసం, పాఠశాల అభివృద్ధి, భవిష్యత్ విద్యా మార్గదర్శకాలపై తల్లిదండ్రులతో కలిసి సమగ్ర చర్చలు జరిపారు. కార్యక్రమానికి మాజీ ప్రెసిడెంట్ రంగన్న, స్కూల్ కమిటీ చైర్మన్లు ప్రకాశ్, నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరై సమావేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం తెచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహులు విద్యార్థుల విద్యా ప్రగతి, స్కూల్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే పరీక్షలపై వివరాలు అందించారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో మీటింగ్‌కు హాజరై ఉపాధ్యాయులతో విద్యార్థుల ప్రగతి, బలాలు–బలహీనతలపై ఆలోచనలు పంచుకున్నారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం స్కూల్–పేరెంట్స్ మధ్య సమన్వయం మరింత బలపడాలని అతిథులు సూచించారు. సక్రమమైన విద్యతో పాటు నియమనిష్టలు, నైపుణ్యాలు పెంపొందించే వాతావరణం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలకు తల్లిదండ్రుల సహకారం కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

క్షణాల్లో టీటీడీ టికెట్లు ఖాళీ

జనవరి 2 నుంచి 8 దాకా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి 300 రూపాయల వైకుంఠ దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వెబ్సైట్ ద్వారా లక్ష 500 టికెట్లను ఆన్లైన్లో ఉంచింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అన్ని బుక్ అయిపోయాయి

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ వారి*FIRELESS COOKING*

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల (విజయవాడ ) 6.12.2025 వ తేదీన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండో సంవత్సరం విద్యార్థుల కోసం **ఫైర్‌లెస్ కుకింగ్ కార్యక్రమం** నిర్వహించింది. ఇందులో విద్యార్థులు **పన్నగుల్కండ్, క్యారట్ లడ్డూ, బ్రెడ్ రసమలై, చాక్లెట్ ఫడ్జ్, గ్రౌండ్‌నట్ సాలాడ్లు** తదితర వంటకాలను సిద్ధం చేశారు. ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ సృజనాత్మక ఆలోచనలను మరియు నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నందుకుగాను ప్రిన్సిపల్ డాక్టర్ VVS కుమార్ గారు FOOD SCIENCE AND TECNOLOGY DEPARTMENT HOD Dr.A. అన్నపూర్ణ , అధ్యాపకులు CH. గాయత్రి, తేహమిన,T. కుందన విద్యార్థులను అభినందించారు.

తెలంగాణ

క్రీడలు విద్యార్థి భవిష్యత్తును తీర్చి దిద్దుతాయన్న : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) క్రీడల ద్వారా సహజ సిద్ధంగా విలువలు, జట్టు భావన, పట్టుదల, కృషి, సమయపాలన, విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే, సమగ్ర వికాసం సాధ్యమవుతుందన్నారు. ఓటమి, విజయాలను సమానంగా స్వీకరించే సంస్కారాన్ని క్రీడలు నేర్పుతాయని, అందుకే ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడను అభ్యసించే అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదువుకొనడం చాలా అదృష్టమని, బాగా చదువుకొని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.