Monday, 16 March 2026

Blog

E-పేపర్

ఒంటిమిట్ట పాదయాత్రలో అమర్నాథ్ రెడ్డివి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

ఒంటిమిట్ట పాదయాత్రలో అమర్నాథ్ రెడ్డివి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల రైల్వేకోడూరు మేజర్ న్యూస్ వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి 11వ ఒంటిమిట్ట మహాపాదయాత్ర సందర్భంగా ఈరోజు ఉదయం నందలూరు వద్ద కలిసి శాలువాతో సత్కరించి పూలమాలవేసి పాదయాత్రలో పాల్గొన్న వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, గునిశెట్టి రమేష్, విజయ్ కుమార్ రెడ్డి, పుల్లంపేట జడ్పిటిసి రాంనాదం,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

అమర్నాథ్ రెడ్డి 11వ ఒంటిమిట్ట మహా పాదయాత్ర శాలువాతో సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

నందలూరు:వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 11వ ఒంటిమిట్ట మహా పాదయాత్ర సందర్భంగా ఈరోజు ఉదయం నందలూరు వద్ద కలిసి శాలువాతో సత్కరించి పూలమాలవేసి పాదయాత్రలో పాల్గొన్న *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, గునిశెట్టి రమేష్, విజయ్ కుమార్ రెడ్డి, పుల్లంపేట జడ్పిటిసి రాంనాదం,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన *వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి & నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ సినియర్ నాయకులు మాదినేని వెంకట్ రెడ్డి,స్టేట్ వైస్సార్సీపీ ముస్లిం మైనారిటీ సినియర్ నాయకులు ముజీబ్, మస్తాన్,స్టేట్ ఎక్సక్యూటివ్ మెంబెర్ నందా బాల,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, యాదవ్ సంగమ్ అధ్యక్షుడు కౌరెడ్డి సిద్దయ్య,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఇనమాల మహేష్,పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్,సర్పంచ్ శైలజ,నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు దుర్గయ్య,ఎంపీటీసీలు గని (రాజా ), పుష్పలత,ఏడిక మహేష్, రౌఫ్,బండారు మల్లికార్జున,ఆంజనేయులు,రాజగోపాల్, డమ్ము రఘు తుమ్మల సురేష్, డీవీ రమణ,కోప్పల శంకరయ్య, సిద్దయ్య,నగిరిపాటి మహేష్,రాజారావ్,పండుగొల మని,నారాయణమ్మ, బుజ్జి,గుణిశెట్టి రమేష్,కరీముల్లా,ఫరూక్,లక్కీరెడ్డి రాజారెడ్డి, రమణ,సుబ్బారాయుడు,ఇనమాల చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల గణిత శాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడిన గెస్ట్ లెక్చర్

శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో గణిత శాస్త్ర విభాగం 5/12/2025 వ తేదీన*The Role of Mathematics in AI*అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి Dr. R. Vijayakrishna గారు, Asst. Professor, SRM University ప్రధాన అతిథిగా విచ్చేశారు. Shri V. S. Pradeep గారు, Asst. Director, SRM University ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేశారు. Dr. V. V. S. Kumar గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని Dr. P. V. DurgaVathi గారు,B.kiranmayi,K. Bhanupriya, Dr. Y. Praroopa, N. Jahnavi Devi తదితరులు విజయవంతంగా నిర్వహించారు. ప్రధాన అతిథి గారు మాట్లాడుతున్న సందర్భంగా ప్రస్తుత కాలంలో గణిత శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యత, అది ఎలా AI మరియు ML రంగాల్లో ఉపయోగపడుతుందో వివరించారు. గణిత శాస్త్రం ఆధారంగానే AI టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని అన్నారు. Dr. P. V. DurgaVathi గారు మాట్లాడుతూ గణితం రాండమ్ ప్రాసెస్‌లను అర్థం చేసుకోవడంలో కీలకమని, AI లో డేటా విశ్లేషణలు, Machine Learning విధానాలు, ML–AI అప్లికేషన్లలో గణితం ఆధారమైనదని వివరించారు. తదుపరి మాట్లాడుతూ డిజిటల్ విప్లవ కాలంలో AI అనువర్తనాల భవిష్యత్తు అవకాశాలపై కూడా చర్చించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

అన్నమయ్య జిల్లా శాకం వారి పల్లిలోని MPPS లో ఘనంగా నిర్వహించిన PTM

అన్నమయ్య జిల్లా శాకం వారి పల్లి వాల్మీకిపురం మండలంలోని ఎంపీపీ స్కూల్లో వైభవంగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం జరిగినది.ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సంభాషణానంతరం విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరిగినది.ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అయినవోలు కృష్ణవేణి గారిని , సహాయఉపాధ్యాయులు జి మోహన్ నాయుడు గార్లను తల్లిదండ్రులు అభినందించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

అన్నమయ్య జిల్లా… శాకoవారిపల్లిలో ఘనంగా జరిగిన ప్రతిష్టాత్మక తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం….3.0..

అన్నమయ్యజిల్లా వాల్మీకిపురం మండలం గ్రామం లోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మక తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం….3.0.. జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల ప్ర ధానోపాధ్యాయురాలు అయినవోలు కృష్ణవేణి మాట్లాడుతూ *మాతృదేవోభవ ,పితృదేవోభవ ,ఆచార్యదేవోభవ * ….. పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువులు అని వారిలోని ప్రతిభను వెలికి తీసుకుని వచ్చే బాధ్యత అందరిదీ అని వారి ప్రతిభను సాన పెడితే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని ఆకాంక్షించారు. తదుపరి ఉపాధ్యాయులు జి.మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఆటపాటలతో ఆర్జించే విజ్ఞానం ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని ఇస్తుంది అని కొనియాడారు. తల్లితండ్రులు ఉపాధ్యాయులు కృషిని కొనియాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరల్డ్ డిజేబుల్ డే కార్యక్రమంలో ఏపీసీ – పాఠశాల అభివృద్ధిపై సమీక్ష

ఇందుకూరు పేట డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) ఇందుకూరుపేట మండలంలోని భవిత సెంటర్‌లో జరిగిన వరల్డ్ డిజేబుల్ డే కార్యక్రమాన్ని గౌరవ ఏపీసీ గారు, జిల్లా IE కోఆర్డినేటర్ పొట్లూరు ప్రసాద్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి అధికారి ప్రశంసలు తెలిపారు. అనంతరం కొత్తూరు హైస్కూల్‌ను సందర్శించి PM Shri స్కూల్‌లోని కెమిస్ట్రీ ల్యాబ్ పనితీరును సమీక్షించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి బోధన ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, ప్రయోగశాల వినియోగంపై కీలక సూచనలు, సలహాలు అందించారు.

కర్నూలు

Dr. br అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేయడం జరిగింది

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామం పున్నమి ప్రతినిధి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామంలో ఈ రోజు DR.br అంబేద్కర్ గారి 69 వ వర్థంతి సందర్భంగా గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి మన రాజ్యాంగ గ్రహీత ఐనటి వంటి మన DR.br అంబేద్కర్ గారికి పులమలతో నివాళి అర్పించడం జరిగింది

జాతీయ అంతర్జాతీయ

*కెనడా టొరంటోలో – డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి)

ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన – డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025(ఫ్యామిలీ ఫెస్టివల్ 2025)* కెనడాలోని డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో, కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్‌తో “డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025:” వేడుకలు టొరంటోలోని మ్యాక్స్‌వెల్ హైట్స్ సెకండరీ స్కూల్, ఓషావా ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సుమారు 800కి పైగా తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నాయి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణా రంభోట్ల సంతోష్ కుంద్రు, అలాగే యువ వ్యాఖ్యాతలుగా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు. డి.టి.సి ఎగ్జిక్యూటివ్ కమిటీసభ్యులు నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవ‌కుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకు పాలెం, శివరామ్ మోహన్ పసుపులేటి గార్ల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. తరువాత కెనడా జాతీయ గీతం మరియు మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తదుపరి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని వయసుల పిల్లలు, కళాకారులు అద్భుతమైన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలో డి.టి.సి కుకింగ్ షో మరియు డి.టి.సి కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. విజేతలు మరియు పాల్గొన్న వారికి Advanced Physio వారి బహుమతులు గ్రాండ్ స్పాన్సర్‌గా తూసి వినయగమూర్తి అందజేశారు. డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు మాట్లాడుతూ, మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. కెనడాలో నివసిస్తున్న తెలుగు సమాజం చూపుతున్న ఐక్యత, సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మన భారత సాహితి, సంపద ఉత్సవాలను కెనడా లో ఘనంగా జరపడం మన అదృష్టం గా భావిస్తున్నానని డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు గుర్తు చేసారు ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా డా. బాబీ యానగావా గారు (ఎం.డి, పీహెచ్.డి, ఎఫ్.ఆర్.సి.ఎస్.సి), డివిజన్ హెడ్ – కార్డియాక్ సర్జరీ, సెయింట్ మైకేల్ హాస్పిటల్ విచ్చేశారు. ఆయన కార్డియో ఆరోగ్యం మరియు కుటుంబ ఆరోగ్యంపై విలువైన సూచనలు అందించి డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) కుటుంబ సభ్యులకు మరింత ఆరోగ్య సంరక్షణ గురించి అందరికీ ఉపయోగపడే విషయాలను చక్కగా వివరించారు. ఈ సందర్భంగా డీ.టి.సి ఎక్సలెన్సీ అవార్డులు అందజేయబడ్డాయి. డా. బాబీ, డా. శరత్ గుండల, డా. శ్రీవాణి గుండల గారి చేతుల మీదుగా డి.టి.సి కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డు – శ్రీమతి ఉషా నడుఱి గారికి, డి.టి.సి ఆర్ట్స్ మ్యూజిక్ & క్లాసికల్ డాన్స్ ఎక్సలెన్సీ అవార్డు – చిన్నారి సిరి వంశిక చిలువేరు కి, డి.టి.సి ఆర్ట్స్ & సింగింగ్ ఎక్సలెన్సీ అవార్డు – చిన్నారి శ్రేయస్ ఫణి పెండ్యాలకి, అందజేసారు. ముగ్గురు అవార్డు గ్రహీతలకు DTC తరఫున సత్కారం చేసి, వారి ప్రతిభను అభినందించారు. కార్యక్రమ విజయానికి చేయూతనిచ్చిన ప్రాయోజకులను DTC సంస్థ శాలువాలతో సత్కరించింది. ఈ సందర్భంగా గ్రాండ్ స్పాన్సర్‌గా తూసి వినయగమూర్తి, ఫుడ్ స్పాన్సర్స్‌గా సింప్లీ సౌత్ రెస్టారెంట్ – ఓషావా (రామ్ & సస్య పెడ్డి) గార్లు సహకరించారు. సిల్వర్ స్పాన్సర్స్‌గా రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియాల్టీ (రమేష్ గోలు, ఆనంద పెరిచెర్ల), రఘు జులూరి, భారత్ లా గార్లు మద్దతు అందించారు.అలాగే సపోర్టింగ్ స్పాన్సర్స్‌గా అడ్వాన్స్ ఫిజియో (గౌతమ్ పిడపర్తి), డా. శరత్ గుండల, డా. పద్మజరాణి కొంగరా, డా. సౌజన్య కసులా, దేశీ కార్ట్ గ్రోసరీస్ (రాజశేఖర్), సివమ్మ టిఫిన్స్, బండీ మేడ బజ్జి (శ్రవంతి), నమస్తే ఇండియా సూపర్ మార్కెట్ – ఏజాక్స్ (యోగేశ్ జీ), షోబి డెకోర్స్, పవన్ పీ.కె ఫోటోగ్రఫీ వంటి ప్రాయోజకులు ఈ కార్యక్రమానికి విలువైన సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గ్రేటర్ టొరాంటో ఏరియా(జీ.టీ.ఏ) లోని పలు తెలుగు సంఘాల ప్రతినిధులను డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు ఆహ్వానించి వారిని సత్కరించారు. ఈ సందర్భంలో DTC ప్రెసిడెంట్ శ్రీ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి మాట్లాడుతూ: “తెలుగు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించే దిశగా, గ్రేటర్ టొరాంటో ఏరియా(జీ.టీ.ఏ) లోని అన్ని సంస్థలు పనిచేస్తున్నాయి అని పేర్కొన్నారు. అంతేకాక, డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) సమాజ కార్యక్రమాలు, వినూత్న ప్రోగ్రామ్స్, ఎక్సలెన్సీ అవార్డులు, సహకార కార్యక్రమాల విజయానికి ప్రాయోజకులు అందిస్తున్న మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, డర్‌హమ్ తెలుగు అసోసియేషన్ (డీ.టి.ఏ) నుండి శ్రీమతి స్వాతి మీర్యాల గారు, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (ఓ.టి.ఎఫ్) నుండి శ్రీ ప్రవీణ్ నీలా గారు, బర్చ్‌మాంట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (బి.ఎఫ్.సి) నుండి – శ్రీ జగపతి రాయల గారు, శ్రీ సూర్య కొండేటి, టొరంటో తెలుగు కమ్యూనిటీ (టి.టి.సి) నుండి – శ్రీ విజయ కుమార్ కోట గారు, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్ మరియు డర్‌హమ్ హైదరాబాదీ అసోసియేషన్ నుండి వారి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు తెలుగు సమాజానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమంలో తెలుగింటి భోజనం, తినుబండారాలు, తేనీరు విందును సింప్లీ సౌత్ – ఒషావా సౌజన్యంతో అందించారు. అలాగే, డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) వారు 20 కిపైగా బహుమతులతో రాఫెల్ డ్రా విజయవంతంగా నిర్వహించారు. డీటీసీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి గారు మాట్లాడుతూ – ఏ దేశమేగినా ఎందుకాలిడిన ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న భావంతో, తెలుగు సంస్కృతి, ఐక్యత, ఆనందాలతో నిండిన డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 కార్యక్రమం కెనడా టొరంటోలో ఘనంగా విజయం సాధించింది. చివరగా డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు డి.టి.సి కార్యకర్తలు, స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు, వందన సమర్పణలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు

కామారెడ్డి

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

కామారెడ్డి, 06డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి యి గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుక లు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆదర్శ పురు షుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, అర్పించినివాళులు అర్పించారు.స్థానిక నాయకు లు, యువత,రైతులు సహా పాల్గొని, ఆయన సంఘ సంస్కరణలకు ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ,, బాబాసాహెబ్ రాజ్యాంగ రచన, అస్పృశ్యత నిర్మూలన పోరాటాలను గుర్తు చేశారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలు, యువ సంఘాలు, అంబేద్కర్ సిద్ధాంతాలు గ్రామీణ జీవితాల్లో అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల స్పందనకుల్వాయి ప్రజలు ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం వల్ల గ్రామంలో ఐక్యత, సామాజిక న్యాయ భావనలు మరింత పెరిగాయి. డా. అంబేద్కర్ ఆదర్శాలు తెలంగాణ గ్రామాల్లో జీవించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇలాం టి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయని నాయకులు చెప్పారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కొత్తల గంగారం సొసైటీ డైరెక్టర్ నారాయణరెడ్డి రాజకీయ నేతలు, అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.