Friday, 6 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిధులు దుర్వినియోగం పై విచారణ జరిపిన అధికారి

వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల పంచాయతీ అలివేలు మంగాపురంలో వాటర్ ప్లాoట్ నిర్మాణం కోసం 2023లో ఎంపిపి నిధుల్లో అడ్వాన్స్ పేమెంట్ కింద రూ. రెండు లక్షలు ఒక వ్యక్తి తీసుకున్నారు వాటర్ ప్లాoట్ ఏర్పాటు చేయకుండా నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు రావడoతో కావలి DLPO వెంకటరమణ సచివాలయంలో విచారణ చేపట్టారు సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకోని 15 రోజులోగా ఉన్నతాదికారులకు నివేదికలు అందజేస్తామన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లాంగ్వేజ్ ఫెస్టివల్ సత్తా చాటిన ఉదయగిరి విద్యార్థులు

జిల్లా స్థాయి లో జరిగిన లాంగ్వేజ్ ఫెస్టివల్ ఉదయగిరి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటినట్లు ఉదయగిరి హెచ్ యం శ్రీనివాసరావు తెలిపారు పల్లెపాడు డైట్ కళాశాలలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు అధ్యర్యoలో జరిగిన పోటీలలో తొమ్మిది విభాగల్లో విజయకేతానం ఎగరావేసారన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిఈ ఓ పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు మండలం లోని శoఖవరం గ్రామం భూమి కబ్జాకు ప్రయత్నం

వింజమూరు మండలం లోని శoఖవరం గ్రామంలో ప్రభుత్వం భూమిని శంఖవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమించే ప్రయత్నం చేశారు ఆ గ్రామ తాళారితో పాటు మరి కొందరు అడ్డుకున్నారు 12 ఎకరాల భూమి ఉంది అందులో ఇద్దరికి 4 ఎకరాల ఢీ పట్టా ఇచ్చారు మిగిలిన భూమిని రెండేళ్ల నుంచి ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు అక్రమించే ప్రయత్నం చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకొని హెచ్చరిక బోర్డు వేయడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నర్రవాడ లోని గోశాలకు పశుగ్రహం వితరణ

దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామం లో వెలసిన శ్రీ వెంగమాంబ దేవస్థానం అధ్యర్యంలో నిర్వహిస్తూన్న గోశాలకు వరికుంటపాడు గ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త ట్రాక్టర్ ద్వారా పశుగ్రాశాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు గోశాలకు దాతలు ముందుకు వచ్చి గోవులను సoరక్షిoచే బాధ్యతలను తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్

అకాల వర్షాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

పున్నమి ప్రతి నిధి రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు పలు సూచనలు చేశారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లను వినియోగించి మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం, మక్కజొన్న తదితర పంటలను రక్షించాలన్నారు. రైతులకు నష్టాలు కలగకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పంటలను భద్రపరచాలని సూచించారు. వర్షాల ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

అన్నమయ్య

అదనపు పీపీగా బాధ్యతలు స్వీకరించిన నాయిని బాలాజీ

– రాజంపేట మూడవ అదనపు జిల్లా కోర్టులో నియామకం – న్యాయవాదులు, మిత్రుల ఘన స్వాగతం రాజంపేటలోని మూడవ అదనపు జిల్లా కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా తిరుపతి జిల్లా చిట్వేల్ మండలానికి చెందిన ప్రముఖ న్యాయవాది నాయిని బాలాజీ నియమితులయ్యారు. బుధవారం ఆయన కోర్టు ఆవరణలో తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘ అనుభవం: వృత్తిరీత్యా న్యాయవాదిగా చిట్వేల్, రాజంపేట ప్రాంతాల్లో మంచి గుర్తింపు పొందిన బాలాజీ గారిని ప్రభుత్వం ఈ బాధ్యతలకు ఎంపిక చేసింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, న్యాయస్థానానికి పూర్తిస్థాయిలో సహకరిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. శుభాకాంక్షల వెల్లువ: బాలాజీ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాజంపేట బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు సీనియర్ న్యాయవాదులు, చిట్వేల్ మండల ప్రముఖులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల చిట్వేల్ మండల వాసులు మరియు న్యాయవాద వృత్తిలోని సహచరులు హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తి యువతకు ‘స్థానిక’ భరోసా-అసెంబ్లీలో పట్టుబట్టిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి నియోజకవర్గ పారిశ్రామిక ముఖచిత్రం మారుతున్న తరుణంలోఆ అభివృద్ధి ఫలాలు నేరుగా స్థానిక యువతకే దక్కాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రాష్ట్ర శాసనసభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్‌ను లేవనెత్తారు. బుధవారం నాడు అసెంబ్లీలో యువత ఉపాధి, పరిశ్రమల స్థాపనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ….నియోజకవర్గంలోని నిరుద్యోగుల పక్షాన తన గళాన్ని బలంగా వినిపించారు. పరిశ్రమలు మనవి – ఉద్యోగాలు మన వారికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, యువనేత నారా లోకేష్ చొరవతో శ్రీకాళహస్తి నియోజకవర్గం పారిశ్రామికంగా పరుగులు తీస్తోందని సుధీర్ రెడ్డి కొనియాడారు. ముఖ్యంగా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఏర్పేడు పరిసరాల్లో వెలుస్తున్న కంపెనీల్లో స్థానిక యువతకు మెజారిటీ వాటా ఉద్యోగాలు కల్పించాలని ఆయన పట్టుబట్టారు. మా ప్రాంత భూములు, మా ప్రాంత వనరులు వాడుకుంటున్నప్పుడు, మా నియోజకవర్గ యువతకు ప్రాధాన్యత ఇవ్వడం కంపెనీల బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రధాన విజ్ఞప్తులు 75% స్థానిక కోటా: రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన స్థానిక ఉద్యోగాల నిబంధనను శ్రీకాళహస్తిలో వంద శాతం అమలు చేయాలి. స్కిల్ హబ్ ఏర్పాటు: కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గంలో ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి కేంద్రం (Skill Development Centre)ను బలోపేతం చేయాలి. ప్రత్యేక పర్యవేక్షణ: పరిశ్రమల్లో స్థానికులకు ఇస్తున్న ఉద్యోగాలపై త్రైమాసిక నివేదికలు తెప్పించుకుని, పారదర్శకత పాటించాలన్నారు. యువత భవిష్యత్తుపై అలుపెరగని పోరాటం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో పలు ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరిపి, స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో విజయం సాధించారు. ఈ ప్రసంగంపై శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు, తొట్టంబేడు, శ్రీకాళహస్తి రూరల్ ప్రాంతాల యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల వల్ల కాలుష్యం, భూముల నష్టం భరించే స్థానికులకు ఉద్యోగాల్లో మొదటి హక్కు ఉండాలన్న ఎమ్మెల్యే ఆలోచనను అందరూ స్వాగతిస్తున్నారు.

తిరుపతి

నాగబాబుతో అంజూరు చక్రధర్ మర్యాదపూర్వక భేటీ-పార్టీ బలోపేతంపై చర్చ

జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ బుధవారం రాష్ట్రస్థాయిలో పార్టీ అగ్రనేతలు, ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ సంస్థాగత బలోపేతం, జిల్లాలో పార్టీ కార్యక్రమాల విస్తృతిపై ఈ సందర్భంగా ఆయన పలువురు నేతలతో చర్చించారు. ముందుగా విజయవాడలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌లో బస చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు (MLC) కొణిదల నాగేంద్ర బాబు (నాగబాబు)ని అంజూరు చక్రధర్ కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని, రాబోయే రోజుల్లో చేపట్టబోయే సేవా కార్యక్రమాలను ఆయన నాగబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ..పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.

తిరుపతి

శ్రీ రామయాల కుంభాభిషేకంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్సివి

శ్రీకాళహస్తి నియోజకవర్గ తొట్టంబేడు మండలం తాటిపర్తి పంచాయతీ తాటిపర్తి గ్రామ ఎస్సీ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ రాముల వారి కుంభాభిషేకానికి గ్రామస్తులు ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు గ్రామస్తులతో కలిసి శ్రీశ్రీ రామాలయా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శోభన నాయుడు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

సి.యస్.ఆర్. నిధులపై పారదర్శకత కొరవడింది- ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ …..కంపెనీలు తమ లాభాల్లోంచి ఖర్చు చేయాల్సిన CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులపై పారదర్శకత కొరవడిందని ఎమ్మెల్యే సూచించారు. ఈ కంపెనీలు CSR నిధులను ఎక్కడ, ఎలా ఖర్చు చేస్తున్నాయో ఎవరికీ తెలియడం లేదని కనీసం స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఆ వివరాలు చెప్పడం లేదన్నారు. ఇకపై ప్రతి కంపెనీ తమ CSR నిధుల ఖర్చు వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి నివేదించేలానిబంధనలుతీసుకురావాలనికోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వార్ల సహకారంతో శ్రీకాళహస్తి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని, అయితే ఆ అభివృద్ధి స్థానికుల ప్రాణాలకు, ఉపాధికి భరోసా ఇచ్చేలా ఉండాలని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు, కాలుష్య నివారణ, CSR నిధుల వినియోగంపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.