Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖలో 15వ లక్కీ షాపింగ్ మాల్ ఘన ప్రారంభం

విశాఖలో 15వ లక్కీ షాపింగ్ మాల్ ఘన ప్రారంభం సినీ నటి–యాంకర్ అనసూయ సందడి… ప్రజాప్రతినిధుల హాజరుతో పండగ వాతావరణం విశాఖపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ 15వ శాఖ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ హాజరై అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, గణబాబు, గండి బాబ్జి, పరుశురామరాజు, కందుల నాగరాజు తదితర ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొని మాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు వినియోగదారులను విశేషంగా ఆకర్షించాయి. అనసూయను ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తి, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందాలనే ఆశతో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో షాపింగ్ మాల్ జనసంద్రాన్ని తలపించి పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన అనసూయ భరద్వాజ, లక్కీ షాపింగ్ మాల్ సాధించిన ప్రగతిని అభినందిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. లక్కీ షాపింగ్ మాల్ 15వ శాఖ ప్రారంభం విశాఖ నగరంలో షాపింగ్ ప్రియులకు మరో ఆకర్షణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఖమ్మం

జిల్లాలో ముగిసిన రెండో దశ పోలింగ్.. కాసేపట్లో ప్రారంభం కానున్న లెక్కింపు

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లాలో రెండో దశ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా సాగింది. పోలింగ్ ముగిసిన అనంతరం అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లోనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడవుతాయని, ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఈ సాయంత్రం పూర్తవుతాయని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

HAPPY WELLNESS CENTER వారి ఉచిత సేవలు…….FETE 2025. SDMSM K.. VJA…

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిన FETE 2K25 లో స్టాల్ నెంబర్ 17 నందు వెల్నెస్ సెంటర్ వారు ఉచిత సేవలను అందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు స్టాల్ ని ప్రారంభించగా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ విద్యార్థులు సుమారు 60 మంది వీరి సేవలను వినియోగించుకున్నారు….. కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఫెట్లో అన్వయించడానికి వచ్చిన వారు హ్యాపీ వెల్నెస్ సెంటర్ వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో హ్యాపీవెల్నెస్ సెంటర్ వారు పి. రాము , సింతియా రాజు, ఫణి కుమారి, రావి పూర్ణ ,గీత ,దుర్గా, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ట్యూటర్ వార్డ్ ఫ్యాకల్టీ డాక్టర్ ఐ మంజుల, రాధిక పాల్గొన్నారు.

కామారెడ్డి

గోకుల్‌ తండా సర్పంచ్ మోహన్‌కు ఘన సన్మానం..

రెండు తండాల ఐక్యతతో అభివృద్ధి పోరు! కామారెడ్డి, 14 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గోకుల్ తండా గ్రామంలో స్థానిక సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఘన విజయం! కేతావత్ మోహన్ సర్పం చ్‌ గా గెలిచి, గ్రామ ప్రజల హృదయాల్లో మరోసారి స్థానం చేసుకున్నారు. ఎన్నికల తీర్థం ముగిసిన వెంటనే రెండు తండాల గ్రామస్తులు కలిసి ఆయన ను, పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. “కలిసి అభివృద్ధి.. కలిసి సాగుదాం!” అనే నినాదంతో గ్రామం మొత్తం ఉల్లాసంగా ముందుకు సాగనుంది!గ్రామ పెద్దల ఐక్యత.. మోహన్ విజయం సాధించా రు. గూగుల్‌తండా గ్రామంలో రెండు తండాల కలయికే మాలవత్ మోహన్ విజయ రహస్యం! ఎన్నికల పోరాటంలో గ్రామస్తులు ఒక్కటిగా నిలబడి, అభివృద్ధి కోసం మోహన్‌ను చేతిలో ఆయుధంగా చేశారు. సర్పంచ్‌గా గెలిచిన అనంత రం గ్రామ పెద్దలు, యువత, మహిళలు కలిసి సన్మాన సమ్మేళనం నిర్వహించారు. “మా గ్రామం రెండు తండాలు కలిసి ఒక్కటే.. మోహన్ నాయక త్వంలో అభివృద్ధి రంగులు చూస్తాం!” అంటూ ఘనంగా స్వాగతించారు. ఈ ఐక్యతే గ్రామ భవిష్య త్తుకు బలమైన పునాది అవుతుందని గ్రామ పెద్ద లు స్పష్టం చేశారు.”కలిసి సాగుదాం” నినాదం.. గ్రామ అభివృద్ధికి కొత్త దిశ!సన్మాన సమ్మేళనంలో మాట్లాడిన గ్రామ పెద్దలు, “రెండు ఖండాల కలయి కతోనే మా గోకుల్ తండా ముందు కు సాగాలి. మోహన్ సర్పంచ్ నాయకత్వంలో రోడ్లు, నీరు, విద్యుత్, ఆరోగ్యం.. అన్ని అభివృద్ధి పనులు వేగం గా పూర్తవుతాయి” అని ప్రకటించారు. “కలిసి అభివృద్ధి చేసుకుందాం..కలిసి సాగుదాం!” అనే నినాదంతో గ్రామస్తులు ఉల్లాసపడ్డారు.ఈ ఘన సన్మానం గ్రామంలో కొత్త ఉత్సాహాన్ని, ఐక్యతను నింపింది. మోహన్ సర్పంచ్ స్పందిస్తూ, “గ్రామ ప్రజల నమ్మకంతో అభివృద్ధి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తాను” అని హామీ ఇచ్చారు.ఈ సంఘటన తెలం గాణ గ్రామీణ ఎన్నికల్లో ఐక్యత శక్తిని మరోసారి నిరూపించింది.

అన్నమయ్య

మానవతా దృక్పథం: ప్రమాదంలో ఉన్న కుటుంబానికి ఎస్ఐ రామమోహన్ రక్ష

ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లిన కారు.. తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడిన స్పెషల్ ఎస్ఐ లయన్స్ క్లబ్ ఆఫ్ నందలూరు, వాకర్స్ ఇంటర్నేషనల్ నందలూరు నుండి అభినందనలు చిట్వేల్, డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి విధి నిర్వహణలో మానవతా విలువలను ప్రదర్శించిన స్పెషల్ పోలీస్ ఎస్ఐ మన్నెం రామమోహన్ ఔదార్యం ప్రశంసలు అందుకుంటోంది. తిరుమల దర్శనం పూర్తి చేసుకుని కర్నూలుకు వెళ్తున్న శ్రవణ్ కుమార్ కుటుంబానికి చెందిన కారు ప్రమాదవశాత్తూ ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లగా, ఎస్ఐ సకాలంలో స్పందించి వారిని కాపాడారు. ఆదివారం ఉదయం సుమారు 06:00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శ్రవణ్ కుమార్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఒంటిమిట్ట చెరువు సమీపంలో అదుపుతప్పి నీటిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. సరిగ్గా అప్పుడే నందలూరు నుండి అదే రూట్‌లో వెళుతున్న స్పెషల్ పోలీస్ ఎస్ఐ మన్నెం రామమోహన్ కారును గమనించి తక్షణమే స్పందించారు. ఎస్ఐ మన్నెం రామమోహన్ ఒంటరిగా సాహసించి, ఆ రూట్‌లో వెళుతున్న ఇంకొక వ్యక్తి సహాయంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టారు.ఎస్ఐ చూపిన తెగువ కారణంగా చెరువులో నుండి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది.తదనంతరం, ఎస్ఐ మన్నెం రామమోహన్ వెంటనే ఒంటిమిట్ట సీఐ గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, స్థానిక పోలీసులను రప్పించారు. ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తదుపరి అవసరాలను సమకూర్చడంలో ఎస్ఐ చూపిన చొరవ అభినందనీయం.ఎస్ఐ మన్నెం రామమోహన్ మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించి, ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను కాపాడటం ప్రశంసనీయమని స్థానిక ప్రముఖులు కొనియాడారు.లయన్స్ క్లబ్ ఆఫ్ నందలూరు మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ నందలూరు ఈ సందర్భంగా ఎస్ఐ మన్నెం రామమోహన్‌కు తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశాయి.

అన్నమయ్య

రాజంపేట జిల్లా కోసం రైల్వే కోడూరులో రిలే దీక్షలు ప్రారంభం

అన్నమయ్య జిల్లా కేంద్రం డిమాండ్‌తో టోల్‌గేట్ వద్ద నేతల ఆందోళన రైల్వే కోడూరు, డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు పట్టణంలోని టోల్‌గేట్ సమీపంలో ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంఘీభావంతో ప్రారంభమైన ఈ ప్రజా ఉద్యమంలో నేడు పలువురు నాయకులు తొలిరోజు దీక్షకు దిగారు.పోతురాజు నవీన్,నార్జల హేమరాజ్, మల్లెం హేమంత్ కుమార్, భువనేశ్వర్ వీరు దీక్షలో కూర్చొని, రాజంపేట జిల్లా సాధన ఆవశ్యకతను తెలియజేశారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తేనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని దీక్షాకారులు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని, దీక్షల్లో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

అన్నమయ్య

ఆడపూరులో మినీ గోకులం ప్రారంభం:-ఘన స్వాగతం పలికిన శౌర్య సేన

ఆడపూరు పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై మినీ గోకులం శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, దిశానిర్దేశంలో, పశుసంవర్ధక–పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చంనాయుడు ప్రోత్సాహంతో గ్రామీణాభివృద్ధి, పశుసంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలకు ఈ మినీ గోకులం ప్రతీకగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు. ఈ మినీ గోకులం ఏర్పాటు మేడా విజయ శేఖర్ రెడ్డి చొరవ, కృషి వల్లే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన సేవలను కొనియాడారు. ముఖ్యంగా పశుసంపద సంరక్షణ, రైతులకు మేలు చేసే కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండూరు దిలీప్‌తో పాటు గ్రామ టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. మినీ గోకులం ఏర్పాటుతో గ్రామంలోని గోవులకు సురక్షిత ఆశ్రయం లభించడమే కాకుండా, రైతులకు సేంద్రీయ ఎరువులు అందుబాటులోకి వస్తాయని, దీని ద్వారా గ్రామ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, కొండూరు దిలీప్ రాజు, కొండూరు వెంకటేష్ రాజు, కొండూరు రమేష్ రాజు, కొండూరు సుదర్శన్ రాజు, కొండూరు రవిచంద్ర రాజు, కొండూరు రాజశేఖర్ రాజు, కొండూరు కార్తీక్ వర్మ, కొండూరు భరత్ రాజు, కొండూరు అచ్యుత్ వర్మ, చుక్క వెంకటేష్, టిడిపి నాయకుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఆడపూరు స్కూల్ చైర్మన్ ఇరువురి మురళి, ముస్లిం మైనారిటీ యువ నాయకుడు పఠాన్ మెహర్ ఖాన్, ఎల్లమరాజుపల్లి శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవంతం రెయిన్బో వీక్ వేడుకలు 2025 …ఎస్ డి ఎం ఎస్ ఎం కళాశాల….

రెయిన్‌బో వీక్ వేడుకలు–2025 విజయవంతంగా నిర్వహణ విజయవాడలోని శ్రీ దుర్గ మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెయిన్‌బో వీక్ వేడుకలు–2025లో భాగంగా 13 డిసెంబర్ 2025న నేషనల్ సెమినార్“మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్ హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు లక్ష్యసాధనలో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని, పరిశ్రమలలో అవకాశాలను కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు 8 డిసెంబర్ నుండి 13 డిసెంబర్ వరకు విద్యార్దునులకు అనేక రకాల వినూత్న కాంపిటీషన్లు నిర్వహించబడాయి.పోస్టర్ ప్రెజెంటేషన్, కెమిస్ట్రీ గ్రూప్ క్విజ్, మ్యాజిక్ ఆఫ్ కెమిస్ట్రీ, థంషల్ ఆర్ట్స్, డాన్సింగ్ ఎలిమెంట్స్, కెమికల్ తాంబూలా వంటి సృజనాత్మక మరియు విజ్ఞానాత్మక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థునుల సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్, హైదరాబాద్ పాల్గొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎం. సుభాషిని, రసాయన శాస్త్ర అధ్యాపకులు మరియు కళాశాల విద్యార్థునులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

E-పేపర్

విజయవంతం రెయిన్బో వీక్ వేడుకలు..2025… శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల. విజయవాడ.

రెయిన్‌బో వీక్ వేడుకలు–2025 విజయవంతంగా నిర్వహణ.. ( పున్నమి విజయవాడ డాక్టర్ మంజుల గుదిమెళ్ళ.) విజయవాడలోని శ్రీ దుర్గ మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెయిన్‌బో వీక్ వేడుకలు–2025లో భాగంగా 13 డిసెంబర్ 2025న నేషనల్ సెమినార్“మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్ హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు లక్ష్యసాధనలో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని, పరిశ్రమలలో అవకాశాలను కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు 8 డిసెంబర్ నుండి 13 డిసెంబర్ వరకు విద్యార్దునులకు అనేక రకాల వినూత్న కాంపిటీషన్లు నిర్వహించబడాయి.పోస్టర్ ప్రెజెంటేషన్, కెమిస్ట్రీ గ్రూప్ క్విజ్, మ్యాజిక్ ఆఫ్ కెమిస్ట్రీ, థంషల్ ఆర్ట్స్, డాన్సింగ్ ఎలిమెంట్స్, కెమికల్ తాంబూలా వంటి సృజనాత్మక మరియు విజ్ఞానాత్మక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థునుల సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్, హైదరాబాద్ పాల్గొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎం. సుభాషిని, రసాయన శాస్త్ర అధ్యాపకులు మరియు కళాశాల విద్యార్థునులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

E-పేపర్

ఓటు వేసేందుకు స్వగ్రామానికి బైక్‌పై వెళ్తూ, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు

ఓటు వేసేందుకు స్వగ్రామానికి బైక్‌పై వెళ్తూ, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి హైదరాబాద్ లో ఉంటూ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి బైక్‌పై బయలుదేరిన బుర్ర కళ్యాణ్(27), నవీన్(27) అనే స్నేహితులు ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రాఘవపూర్ వద్ద జాతీయ రహదారిపై వీరి బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.