Friday, 6 March 2026

Blog

తిరుపతి

500 సంవత్సరాలు చరిత్ర కలిగిన శివయాలనికి శంకుస్థాపన

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామపంచాయతీ సంబంధించిన చుక్కలు నిడిగల్లుఎస్టీ కాలనీలో గురువారం నాడు శివయ్యకు శంకుస్థాపన, బాలలయం కార్యక్రమం నిర్వహించి అనంతరం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి నరసింహమూర్తి, ఎక్సైజ్ సీఐ లావణ్య, ఐ సి డి సి ప్రాజెక్టు అధికారి దుర్గా ప్రియాంక బోడి దేవాలయం కమిటీ సభ్యులు అర్చకులుపాల్గొని కార్యక్రమం నిర్వహించారు. నాలుగు కలశాల సుగంధ ద్రవ్యాలతో స్వామికి శాస్త్రపరంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గత 500 సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతన కాలమైన ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శివయ్యకు నీడ కలిగినందుకు చుక్కలు నిడుగల్లు భక్తులు ఆనంద వ్యక్తం చేశారు గ్రామం పచ్చగా ఉండాలని ఊరు అభివృద్ధి కావాలని కోరుకున్న వారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మలపూడిలో క్షయ రోగి కుటుంబాన్ని పరామర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో క్షయ వ్యాధిగ్రస్తుడి కుటుంబాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ నితీష్ రామ్ స్వయంగా పరామర్శించారు. రోగికి మందులు సకాలంలో అందుతున్నాయా, ఆర్థిక సహాయం చేరుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. రోగి కుటుంబం సంతృప్తికర సమాధానాలు ఇవ్వగా వైద్య బృందం అభినందించింది. సమయానికి మందులు తీసుకుని త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షయ నివారణ అధికారి దేవ గణేష్, జిల్లా అదనపు వైద్యాధికారి ఖాదరవల్లి తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు చిట్వేల్ విద్యార్థులు.

సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సమగ్ర శిక్ష మహోత్సవం పోటీలకు పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేల్ విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు తెలిపారు.పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో వివిధ విభాగాల కింద విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఈనెల 23వ తేదీన ఆన్లైన్ విధానం ద్వారా సమర్పించగా, అందులో పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఎ.శివన్నారాయణ గౌడ్ మార్గదర్శకత్వంలో ఏ.సుస్మిత వి.దివ్యశ్రీ మరియు ఆర్. కుషాల్ రూపొందించిన రాకెట్ మోడల్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు మాట్లాడుతూ, సైన్స్ సమగ్ర మహోత్సవం పోటీల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్కోణం అభివృద్ధి చెందడం,రోజువారీ జీవితంలో శాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో అవగాహన పెరుగుతుందని,అనుభవాత్మక అభ్యసనంను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులలో స్వయంకృషి, పరిశోధనాత్మక దృక్కోణం అభివృద్ధి చెందుతుందని, జాతీయ విద్యా విధానం- 2020 లక్ష్యాల సాధనకు తోడ్పాటు,విద్యార్థుల ప్రతిభను సమాజం నేరుగా చూసే అవకాశం లభిస్తుందని,స్కూళ్లలో ఆరోగ్యకరమైన పోటీ, సృజనాత్మకతకు ప్రోత్సహిస్తుందని,డిజిటల్ లిటరసీ & స్టెమ్ నైపుణ్యాలకు బలం చేకూరుస్తుందని అన్నారు.అలాగే ప్రతిష్టాత్మకమైన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కవర్ పేజీ నందు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టు ఫోటోలకు స్థానం దక్కడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సైన్సు ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, సోఫియా, కళావతి, సుహాసిని, సునీత కుమారి మొదలగు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

మహిళా సాధికారతే సమాజానికి పునాది!

మహిళా శ్రేయస్సే సమాజ పురోగతి అని, మహిళా సాధికారతే అభివృద్ధికి అసలైన పునాది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె. సూర్యనారాయణ గారి పిలుపు మేరకు మార్చి 7వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న భారీ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను గురువారం చిట్వేల్‌ పీహెచ్‌సీ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రైల్వే కోడూరు తాలూకా ఏపీజీఈఏ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. మహిళా ఉద్యోగుల సమస్యలు, వారి హక్కులు మరియు సాధికారతపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి చిట్వేల్‌ పీహెచ్‌సీలోని మహిళా ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో పనిచేస్తున్న మహిళా వైద్యులు, సిబ్బందికి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు. మహిళా సాధికారత నినాదాలతో నిర్వహించనున్న ఈ సదస్సు ఉద్యోగినుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని అసోసియేషన్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ తాలూకా ప్రెసిడెంట్, పీహెచ్‌సీ వైద్యులు మరియు మహిళా ఉద్యోగస్థులు పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగు మట్ల బాధితులకి కేటీఆర్ పరామర్శ ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల బుధన్ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను గురువారం కల్వకుంట్ల తారక రామారావ్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం పరామర్శించింది. ఇటీవల జరిగిన కూల్చివేతలతో నిరాశ్రయులైన కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తక్షణమే నివాసం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు శాశ్వత పరిష్కారం లభించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పేదల వద్ద ఉన్న నివాసాలను తొలగించి, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా వదిలేయడం అమానుష చర్య అని విమర్శించారు. మీకోసం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి కోట్లాడతాము ఇదే స్థలంలో మా బి ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టించి, గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది ఈ అక్రమ కూల్చివేతల గురించి శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ప్రస్తుత ప్రభుత్వం లేనివారి వద్ద నుండి తీసుకుని ఉన్నవారికి మేలు చేసే విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. వెలుగుమట్ల బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాత మధు, ఆర్‌వీఎస్ ప్రవీణ్ కుమార్, పువ్వాడ అజయ్, వద్ధి రాజు రవిచంద్ర, సండ్ర వెంకట వీరయ్య, పగడాల నాగరాజు, ఆర్‌జెసి కృష్ణ, కూరాకుల నాగభూషణం, విజయ్ కుమార్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

వి.ఎం బంజర్ శ్రీ రాజా సాయి మందిరంలో అన్నదానం కార్యక్రమం

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో గలర వంగా ముత్యాల బంజర లోని శ్రీ రాజా సాయి మందిరంలో గురువారం శాశ్వత దాతల సహకారంతో పాటు పలువురు దాతల ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆచంటి రాణి – సుందర్ రావు దంపతుల పెళ్లిరోజు సందర్భంగా, అలుగోజు ఉదయ్ విష్ణువర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు లక్ష్మీ, రామ నర్సింహం, రామచంద్రరావు, బలుసుపాటి రమాదేవి, రామచంద్రరావు కుటుంబ సభ్యులు, అలాగే పరకాల మనీషా – సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కృపమ్మ, రాంబాబు, రామచంద్రరావు అన్నదానం నిర్వహించారు. అదే విధంగా రిటైర్డ్ ఎస్పీ శ్రీ తిరుపతి ఐపీఎస్ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కూడా ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సాయి మణికంఠ, ఎల్‌వి ఆర్‌కే దత్తు, ప్రసాద్, లైబ్రరీ సత్యనారాయణ, జెన్నారెడ్డి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఖమ్మం

ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతల్లో బిగ్ ట్విస్ట్ – ఆర్డీవో నరసింహారావు అర్ధాంతర బదిలీ:

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు పర్యటన అనంతరం, కూల్చివేతల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఖమ్మం ఆర్డీవో నరసింహారావును అర్ధాంతరంగా బదిలీ చేశారు. ఖమ్మం ఆర్డీవోగా ఉన్న నరసింహారావును మెట్‌పల్లికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్‌పల్లిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్డీవో శ్రీనివాసరావును ఖమ్మం ఆర్డీవోగా నియమించారు. అనుమానాలకు తావు వెలుగుమట్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కూల్చివేతల బాధ్యతను అధికారులపై నెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ బదిలీ జరిగిందా? రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ బాధితులను పరామర్శించిన వెంటనే ఈ బదిలీ జరగడం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార యంత్రాంగం పాత్రపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం కేసుకు కొత్త మలుపు తిప్పింది.

ఖమ్మం

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్ – టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందం. అర్హులైన బాధితులకు స్థలాలు కేటాయించాలి.

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అని సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాస్ రావు ఖండించారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్న వందలాది పేద కుటుంబాలను ఒక్కసారిగా భారీ పోలీస్ బలగాలతో ఖాళీ చేయించడం సరైంది కాదన్నారు.పేదల నివాస హక్కును రక్షించాల్సిన ప్రభుత్వం, వారి ఇళ్లను కూల్చివేసి రోడ్డున పడేయడం అన్యాయమని విమర్శించారు. ఇండ్ల కూల్చివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత నిరసనలో పాల్గొన్న సీపీఐ(ఎం) నాయకులను అరెస్ట్ చేసి నిర్భందించడం సరైన కాదన్నారు. ఇదే సమయంలో కొంతమంది అరాచక శక్తులు ఈ ఇళ్ల సమస్యను ఆసరాగా చేసుకుని పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న అలాంటి వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన పేద కుటుంబాలందరికీ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తాత్కాలిక నివాసం, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, భూక్యా శ్రీనివాస్ రావు, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు కూచిపూడి నరేష్, వడ్లముడి నాగేశ్వరరావు, మల్లికార్జున్ రెడ్డి, కొండం కరుణాకర్, పి సుభాష్, నల్లమల్ల సత్యనారాయణ, జట్ల ఆనందరావు పోటు హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిధులు దుర్వినియోగం పై విచారణ జరిపిన అధికారి

వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల పంచాయతీ అలివేలు మంగాపురంలో వాటర్ ప్లాoట్ నిర్మాణం కోసం 2023లో ఎంపిపి నిధుల్లో అడ్వాన్స్ పేమెంట్ కింద రూ. రెండు లక్షలు ఒక వ్యక్తి తీసుకున్నారు వాటర్ ప్లాoట్ ఏర్పాటు చేయకుండా నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు రావడoతో కావలి DLPO వెంకటరమణ సచివాలయంలో విచారణ చేపట్టారు సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకోని 15 రోజులోగా ఉన్నతాదికారులకు నివేదికలు అందజేస్తామన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లాంగ్వేజ్ ఫెస్టివల్ సత్తా చాటిన ఉదయగిరి విద్యార్థులు

జిల్లా స్థాయి లో జరిగిన లాంగ్వేజ్ ఫెస్టివల్ ఉదయగిరి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటినట్లు ఉదయగిరి హెచ్ యం శ్రీనివాసరావు తెలిపారు పల్లెపాడు డైట్ కళాశాలలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు అధ్యర్యoలో జరిగిన పోటీలలో తొమ్మిది విభాగల్లో విజయకేతానం ఎగరావేసారన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిఈ ఓ పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.