మే లో భోగాపురానికి ఎయిర్ పోర్ట్
భోగాపురం ఎయిర్ పోర్టును అందంగా సిద్ధం చేస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వచ్చేనెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం-విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేయనున్న జీఎంఆర్- మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ప్రారంభ వేడుకలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్కు ఎయిర్పోర్టును ప్రారంభించాలనుకున్నామని, కానీ, ఒక నెల ముందే ప్రారంభిస్తామన్నారు. ఎడ్యు సిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు, యూనివర్సిటీలు పెట్టుకోవచ్చన్నారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు.











