Saturday, 14 March 2026

Blog

ఆదిలాబాదు

క్యాలెండర్లను ఆవిష్కరించిన – రీజినల్ మేనేజర్ & ఎల్డిఎం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ ఎస్బిఐ రీజినల్ ఆఫీస్ నందు వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ (విడ్స్) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల 2026 నూతన క్యాలెండర్లను రీజినల్ మేనేజర్ రామచందర్ రావు, ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిర్వహించే అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐ మేనేజర్ విజయ్, పాపయ్య, మావల ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ కమలాకర్, సత్యనారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొట్టెంపాడు గిరిజన కలనీలో బొబ్బేపల్లి పర్యటన

(ముత్తుకూరు పున్నమి ప్రతినిధి, డిసెంబర్ 17):- డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలం పొట్టెంపాడు పంచాయతీ పరిధిలోని కట్టకింద గిరిజన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించినప్పటికీ, ఆ వ్యవస్థ పేద గిరిజనులకు ఉపయోగపడలేదని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ నాయకులు ఏ విధంగా వినియోగించుకున్నారో వారికే తెలియాలన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగంగా పేదల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడంతో పాటు ఆధార్, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్థానిక గిరిజన కాలనీల్లో తిరిగి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య, బోలా అశోక్, సందురి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, దగ్గోలు సుమన్, అక్బర్, గుడి సీనయ్య తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నర్సాపూర్ జి సర్పంచ్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రానికి చెందిన నర్సాపూర్ జి గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెల్పొందిన ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియుఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మజార్ అండ్ సభాకళిం గారు మరియునర్సాపూర్ జి మండల మైనార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

నిర్మల్

నర్సాపూర్ జి సర్పంచ్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రానికి చెందిన నర్సాపూర్ జి గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెల్పొందిన ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియుఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మజార్ అండ్ సభాకళిం గారు మరియునర్సాపూర్ జి మండల మైనార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి

అడ్లూర్‌లో బంగారు తల్లి ఫౌండేషన్ మోటివేషన్ క్లాసులు.. విద్యార్థులు సంతోషం!

కామారెడ్డి,17 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సధాశివ నగర్ మండల కేంద్రం తో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, మహాత్మా జ్యోతిబా పూలే కుప్రియాల్ పాఠశాలల్లో బంగారు తల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాసులు ఘనంగా నిర్వాహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వా సం, క్రమశిక్షణ పెంచే ఈ కార్యక్రమం సూపర్ హిట్!ఇంపాక్ట్ ట్రైనర్స్ వజ్జా నవనీత, వజ్జా మహేందర్, మర్రి సదాశివరెడ్డిలు ‘లక్ష్య నిర్ధారణ, కాల నిర్వహ ణ, వ్యక్తిత్వ వికాసం’ అంశాలపై ప్రేరణాత్మక సెషన్లు నడిపారు. విద్యార్థులు ఈ శిక్షణతో లక్ష్యాలు సాధించే మార్గం తెలుసుకుని ఉత్సాహంగా ఉన్నారు! పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ,ఇది భవిష్యత్తుకు సూపర్ బూస్ట్! ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల ని అన్నారు. ఉత్తమ విద్యార్థులకు మెమెంటోలు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇంపా క్ట్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్ష మర్రి సదాశివరెడ్డి, బంగారు తల్లి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ట్రైనర్స్ వజ్జా నవనీత, వజ్జా మహేందర్ ముఖ్యంగా పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

హిందూ సమ్మేళనానికి ప్రముఖులకు ఆహ్వానం

నందిగామలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం సందర్భంగా స్థానిక ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర నాయకులు బచ్చలకూర పుష్పరాజు, నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజు, నందిగామ ఎస్‌ఐ–1 సూర్యవంశీ, నందిగామమహిళా ఎస్‌ఐ–2, నందిగామ ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ తదితరులను వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానించారు.హిందూ సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే విధంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనివిజయవంతం చేయాలని వారు కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలతో చెరువుల అత్యవసర పనులకు 47.60 లక్షలు మంజూరు..

ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలతో చెరువుల అత్యవసర పనులకు 47.60 లక్షలు మంజూరు.. బలహీనంగా ఉన్న చెరువుల పనులను త్వరగా పూర్తి చేయండి.. ఇరిగేషన్ శాఖ ఏఈ మహేందర్ ను కోరిన మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి.. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలతో వింజమూరు మండలంలోని చెరువుల అభివృద్ధి పనులకు 47.60 లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్లు ఇరిగేషన్ శాఖ ఏఈ మహేందర్ తెలిపారు. ఆ పనులకు సంబంధించి నివేదికలను కోరిన మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి చెరువు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యాల చూడాలన్నారు. వింజమూరు మండలంలోని నల్లగొండ్ల బొడ్డు వాగు చెరువుకు 4.95 లక్షలు తక్కెళ్ళపాడు, చెరువుకు 4.45 లక్షలు చంద్రపడియ, చెరువుకు 4.75లక్షలు శంఖవరం, చెరువుకు 4.50 లక్షలు బుక్కాపురం, చెరువుకు4.95 లక్షలు మోటచింతలపాలెం రామలింగారెడ్డి చెరువుకు 4.50 లక్షలు ఎర్రబెల్లి పాలెం, చెరువుకు 4.85 లక్షలు ఏ కిస్తీపురం, చెరువుకు 4.85 లక్షలు వింజమూరు మలపరాజు వాగు చెరువుకు 4.95 లక్షలు బుక్కాపురం పెద్ద చెరువు 4.90 లక్షలు రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. శంఖవరం చెరువు పనులు ప్రారంభమయ్యాయి అన్నారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలు వేయడం, తూములు, అలుగులు, పనులు, సప్లై ఛానల్ పనులు, పంట కాలువల పనులు అవసరం నిమిత్తం చేయడం జరుగుతుందన్నారు.

తెలంగాణ

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు పరిశీలించినారు. కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, సాయంత్రం లోపు , ఫలితాలు ప్రకటించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

అంగన్వాడీలకు 5జి స్మార్ట్ ఫోన్లు పంపిణీ

నందిగామ పట్టణం కాకాని నగర్‌లో బుధవారం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు 5జి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నదని తెలిపారు. పోషణ ట్రాకర్‌, బాల సంజీవిని యాప్‌ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ వివరాలు, అందుతున్న సేవల సమాచారాన్ని అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో జరిగే ప్రతి కార్యక్రమం డిజిటల్‌గా నమోదు కావడం వల్ల పనితీరు లో నాణ్యత పెరుగుతుందని, ప్రభుత్వానికి తక్షణ సమాచారం అందడంతో సేవల అమలులో జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీఓ లక్ష్మీ భార్గవి, ఐసిడిఎస్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లుపాల్గొన్నారు.

కామారెడ్డి

కామారెడ్డి అటవీలో పెద్దపులి సంచరణ!

మాచారెడ్డి రేంజ్‌లో 5 మండలాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరిక.. జాగ్రత్తలు తప్పక పాటించండి! కామారెడ్డి,17 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, బిబిపేట్, పాల్వంచ మండలాల గ్రామాల్లోని అటవీ ప్రాంతా లు, వ్యవసాయ క్షేత్రాల్లో పులి కనిపించడం గుర్తిం చిన అధికారులు ప్రజలకు జాగ్రత్తలు తెలియజే శారు.అటవీ శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చ రిక ప్రకారం, గ్రామ ప్రజలు తప్పకుండా ఈ నియ మాలు పాటించాలి:అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకూడదు.సాయంత్రం 5 గంటల నుంచి ఉద యం 7 గంటల వరకు వ్యవసాయ భూముల్లో తిరగకూడదు.రాత్రిపూట పశువులను క్షేత్రాల్లో ఉంచకూడదు.పగలు కూడా ఒంటరిగా వ్యవసా య క్షేత్రాలకు వెళ్లకూడదు.పులి దాడి సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అటవీ అధికారులకు లేదా పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. పశువులపై దాడి జరిగినా, పులి లేదా ఆనవాలు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వండి – తగి న నష్టపరిహారం పొందవచ్చు.కఠిన హెచ్చరిక: పులికి నష్టం కలిగించేలా కరెంటు వైర్లు, ఉచ్చులు పెట్టడం లేదా విషప్రయోగం చేయడం అటవీ చట్టం ప్రకారం శిక్షార్హులు ఇలాంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.సంప్రదించండి: అటవీ శాఖ – 8555830266, 9490411547, 7981949524 .కామారెడ్డి డివిజన్ అటవీ శాఖ, మాచారెడ్డి రేంజ్ ప్రజల సురక్షితంగా ఉండేందుకు అందరూ సహక రించాలని కోరారు. ఇలాంటి సంఘటనలపై మరి న్ని వివరాలు తెలిసినప్పుడు తాజా అప్‌డేట్స్ అందిస్తాంమన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.