Saturday, 14 March 2026

Blog

E-పేపర్

బైసాని వెంకట సుబ్బా సత్యనారాయణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముక్కా వరలక్ష్మి

బైసాని వెంకట సుబ్బా సత్యనారాయణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముక్కా వరలక్ష్మి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు పట్టణం సూర్య నగర్ వాస్తవ్వులు బైసాని వెంకట సుబ్బా సత్యనారాయణ గారు మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు* అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు *ఈ కార్యక్రమం లొ* NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

E-పేపర్

రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు: 5 రోజుల దీక్షలో ఆటో యూనియన్

రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు: 5 రోజుల దీక్షలో ఆటో యూనియన్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ‘రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు’ అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 5 రోజుల రిలే నిరాహార దీక్షలో ఈరోజు ఆటో యూనియన్ అండ్ ఓనర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వందలాది ఆటోలు ర్యాలీలో పాల్గొని తమ నినాదాలతో రైల్వే కోడూరు దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు స్కూల్ కరస్పాండెంట్లు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగినది.

కామారెడ్డి

యూరియా బుకింగ్ యాప్‌పై వీడియో కాన్ఫరెన్స్.. వ్యవసాయ డైరెక్టర్ గోపి వివరాలు!

కామారెడ్డి, డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రైతులకు యూరియా కొనుగోలు సులభంగా జరగేలా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ విధానా న్ని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ గోపి గురు వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల వ్యవసాయ అధికారులకు, డీలర్లకు వివరించారు. ఈనెల 20న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యాప్‌ను ప్రారంభిస్తారని డైరెక్టర్ తెలిపారు.ఈయాప్‌లో రైతులు సమీప డీలర్ల వద్ద జిల్లా స్థాయిలో ఎన్ని యూరియా బస్తాలు లభిస్తు న్నాయో తెలుసుకోవచ్చని చెప్పారు.తమ పంట వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేస్తే యూరియా పరిమాణం స్వయంగా చులకంగా లెక్కించ బడు తుంది. బుకింగ్ పూర్తయిన వెంటనే బుకింగ్ ఐడి లభిస్తుంది.ఆ ఐడి చూపించి డీలర్ వద్ద యూరి యా పొందవచ్చునని అన్నారు.ముందస్తు బుకింగ్ సౌకర్యంతో పాటు రైతులు తమకు అనుకూలమైన డీలర్‌ను ఎంపిక చేసుకోవచ్చని గోపి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో భాను శ్రీ, ఏఈవోలు నిఖిత, భబిత తదితరులు, డీలర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక సందర్శన చేసిన MLA

గూడూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంని ఆకస్మికం గా సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలుపై సిబ్బందితో పాటు పేషంట్స్,స్థానికులతో మాట్లాడి తెలుసుకున్న పెడన MLA కాగిత కృష్ణ ప్రసాద్. ఈ సందర్భం గా హాస్పిటల్ లోఅందుతున్న సేవలు గురుంచి పెషేంట్ ల ను అడిగి తెలుసు కొని,ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓ.పీ సంఖ్య మరింత పెరగాలని ఆయన సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం: ఎమ్మెల్యే అరవ శ్రీధర్

అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. చిట్వేల్ మండలానికి చెందిన బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును ఆయన పంపిణీ చేశారు. ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిట్వేల్ మండలానికి చెందిన ఆనందాల మాధవి అనే మహిళ అనారోగ్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం స్పందించి రూ. 1,55,000/- విలువైన చెక్కును మంజూరు చేసింది. ఈ చెక్కును బాధితురాలికి నేతలిద్దరూ కలిసి అందజేశారు. ప్రజల వెంటే ప్రభుత్వం: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ… “ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వేళ కూటమి ప్రభుత్వం వారి వెంట నిలుస్తోంది. గత ప్రభుత్వంలో సహాయం అందక ఇబ్బంది పడిన వారికి సైతం ఇప్పుడు న్యాయం చేస్తున్నాం. బాధల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం త్వరితగతిన అందేలా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం.” అని తెలిపారు. ముక్కా వరలక్ష్మి గారి వ్యాఖ్యలు: ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక గొప్ప ఊరటనిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా క్షేత్రస్థాయిలో తాము కృషి చేస్తామని, అవసరంలో ఉన్న వారికి సహాయం అందించడం ఎంతో తృప్తినిస్తుందని ఆమె పేర్కొన్నారు. కూటమి నాయకుల ఉత్సాహం: తమ కష్టాన్ని గుర్తించి భారీ ఆర్థిక సహాయం అందించినందుకు బాధితురాలు మాధవి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య

కేజీబీవీలో బాలికలకు భద్రతపై అవగాహన …..శక్తి యాప్‌, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై ఎస్సై వినోద్ కుమార్ సూచనలు

చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)ను గురువారం ఎస్. వినోద్ కుమార్ సందర్శించి విద్యార్థినులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల భద్రత, సామాజిక బాధ్యతలపై పలు కీలక అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. శక్తి యాప్ వినియోగ విధానం, బాల్యవివాహాల నివారణ అవసరం, ఆత్మహత్యల వంటి ప్రమాదకర ఆలోచనల నుంచి బయటపడే మార్గాలు, ఈవ్‌టీీజింగ్‌ – ర్యాగింగ్‌లపై చట్టపరమైన చర్యలు, అత్యవసర సమయంలో డయల్ చేయాల్సిన ముఖ్య నంబర్లు, అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థినులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైనప్పుడు వెంటనే పోలీసు సహాయం కోరాలని సూచించారు. మహిళలు, బాలికల రక్షణలో శక్తి యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని అవగాహన సదస్సును విజయవంతం చేశారు.

అన్నమయ్య

చిట్వేల్ పీహెచ్‌సీకి డెలివరీ టేబుల్ విరాళం

చిట్వేల్ మండలం మారటిపల్లి గ్రామానికి చెందిన వలసాని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులైన వలసాని గుండాలయ్య కుమారుడు వలసాని గోపాల్ చిట్వేల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కు డెలివరీ టేబుల్‌ను విరాళంగా అందజేశారు. 2019 నుంచి ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలకు వచ్చే వారికి తాగునీరు, జ్యూస్‌, అల్పాహారం అందజేస్తూ సేవాభావం చాటుకుంటున్నారు. అలాగే కరోనా కాలంలో వేల సంఖ్యలో సిరంజీలు, శానిటేషన్ సామగ్రి, మాస్కులు విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రిలో రోగులు కూర్చోవడానికి సిమెంట్ బెంచీలను కూడా ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్సారీ మాట్లాడుతూ, అవసరమైనప్పుడల్లా చిన్నా–పెద్దా సహాయాలు అందిస్తూ ఆసుపత్రికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. వలసాని గోపాల్‌కు ఆసుపత్రి సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

నారాయణపేట

కున్సి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఘన విజయం

కున్సి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఎం సురేష్ తన ప్రత్యర్థి పై 512 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ఉప సర్పంచ్ గా ఉప్పరి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విజయంతో గ్రామంలో బి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెలువిరిసింది. నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎం. సురేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన కార్యకర్తలకు యూత్ లీడర్స్కు గ్రామ ప్రజలకు మహిళలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలుపుకోవడం జరిగింది.

విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో బుధవారం 373 ఆక్రమణల తొలగింపు.

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో బుధవారం 373 ఆక్రమణల తొలగింపు. – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్పు 17 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 373 ఆక్రమణలను బుధవారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ పరిధిలో తిమ్మాపురం నుండి భీమిలి వరకు 8 ఆక్రమణలు, 2వ జోన్ పరిధిలో పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ నుండి N H-16 (కార్ షెడ్ జంక్షన్) వరకు, బోయపాలెం జంక్షన్ నుండి N H-16 వరకు 37 ఆక్రమణలు, 3వ జోన్ పరిధిలో సంపత్ వినాయక టెంపుల్ రోడ్డు, వి ఐ పి రోడ్డు నుండి రామా టాకీస్ రోడ్డు వరకు, ఆర్ టి సి కాంప్లెక్ష్ BRTS రోడ్డు నుండి మద్దిలపాలెం వరకు, మద్దిలపాలెం డిపో నుండి ఇసుకతోట హైవే వరకు 84 ఆక్రమణలు, 4వ జోన్ పరిధిలో యూనియన్ బ్యాంకు దొండబజార్ రోడ్ నుండి ఫిష్ మార్కెట్ దొండబజార్ రోడ్ వరకు, దొండబాజార్ మెయిన్ రోడ్ నుండి MVDM హై స్కూల్ దొండబాజార్ రోడ్డు వరకు 49 ఆక్రమణలు, నార్త్ జోన్ పరిధిలో 80 ఫీట్ రోడ్డు నుండి రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ వరకు 32 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలో బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుండి దుర్గా నగర్ రోడ్డు వరకు, వేపచెట్టు జంక్షన్ నుండి 60 ఫీట్ రోడ్డు వరకు, పెదగంట్యాడ జంక్షన్ నుండి న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు 114 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలో GNT రోడ్డు నుండి పెరుగు బజార్ జంక్షన్ వరకు 12 ఆక్రమణలు వెస్ట్ జోన్ పరిధిలో శ్రీ హరి పురం జంక్షన్ నుండి జవహర్ నగర్ వరకు 10 ఆక్రమణలు, 8వ జోన్ పరిధిలో కృష్ణాపురం జంక్షన్ నుండి చినముసిడివాడ వరకు 22 ఆక్రమణలతో కలిపి మొత్తం 373 ఆక్రమణలు తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

జనవరి 15 లోపు కేంద్ర పధకాల నిధులు పూర్తిగా వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశం*

*జనవరి 15 లోపు కేంద్ర పధకాల నిధులు పూర్తిగా వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశం* – PMAY అర్బన్ నిధులు ఖర్చు చేయడానికి జనవరి 15 గడువు విధించిన సీఎం; కేంద్ర మంత్రి అదనంగా ₹1,200 కోట్లు ఇస్తామని హామీ – “కేంద్ర డబ్బు ఖర్చు చేయడంలో రాజీ లేదు. ప్రతి రూపాయి ఖర్చు చేయాలి” – ముఖ్యమంత్రి – రాష్ట్రంలో 75 CSS పథకాలు అమలు జరిగింది; కేంద్రం ₹15,173 కోట్లు, రాష్ట్రం ₹9,340 కోట్లు కేటాయించింది – ₹1,268 కోట్లు అందుబాటులో ఉన్నా PMAY అర్బన్‌లో కేవలం 38% వినియోగం; తక్షణ చర్యలకు ఆదేశాలు – స్పందించని నిర్మాణ సంస్థలను బ్ల్యాక్‌లిస్ట్ చేయాలని సీఎం ఆదేశం *అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి*: కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) అమలుపై డా. డి. రొనాల్డ్ రోజ్, IAS, సెక్రటరీ, ఫైనాన్స్ (బడ్జెట్ & అంతర్గత ఆర్థిక విభాగం), బుధవారం ఇక్కడ జరిగిన 5వ కలెక్టర్ల సమావేశంలో సమగ్ర వివరణ అందించారు. 75 CSS పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర పనితీరును వివరిస్తూ, భారత ప్రభుత్వం మొత్తం ₹15,173 కోట్లు కేటాయించిందని, రాష్ట్రం దీనికి అదనంగా ₹9,340 కోట్లు ఇస్తుందని తెలిపారు. కేంద్ర పధకాల అమలుకు రాష్ట్రం రెండు విధానాలను అనుసరిస్తోందని డా. రొనాల్డ్ రోజ్ వివరించారు. స్టేట్ నోడల్ ఏజెన్సీ (SNA) విధానంలో, జిల్లాలు ప్రధాన SNA ఖాతాకు అనుసంధానించబడిన జీరో-బ్యాలెన్స్ సబ్సిడియరీ ఖాతాలను నిర్వహిస్తాయి, డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే విడుదల చేస్తారు. SPARSH విధానంలో, రాష్ట్ర వాటా నేరుగా అందించబడుతుంది. ప్రస్తుతం SNA పథకాలకు ₹6,910 కోట్లు విడుదల చేయబడ్డాయి మరియు SPARSH పథకాలకు ₹7,883 కోట్లు అందుబాటులో ఉన్నాయి. తక్షణ శ్రద్ధ అవసరమైన నాలుగు ప్రధాన పథకాలపై దృష్టి సారించారు, వీటికి జిల్లాలకు ₹1,000 కోట్లకు పైగా నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సమగ్ర శిక్ష (₹1,363 కోట్లు, 92% వినియోగం), PMAY అర్బన్ (₹1,268 కోట్లు, 38% వినియోగం), ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కోసం ఫ్లెక్సిబుల్ పూల్ (₹1,153 కోట్లు, 87% వినియోగం) మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (₹1,018 కోట్లు, 55% వినియోగం) ఉన్నాయి. సమగ్ర శిక్షలో పల్నాడు, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి జిల్లాలు 99% కంటే ఎక్కువ వినియోగం సాధించాయని, అయితే చాలా జిల్లాల్లో PMAY అర్బన్‌కు తక్షణ శ్రద్ధ కావాలని ఆయన చెప్పారు. CSS నిధుల తక్కువ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు తక్షణ చర్యలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో మాట్లాడుతూ, “ఒక వైపు డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం, మరో వైపు కేంద్రం ఇస్తున్న డబ్బును సరిగ్గా ఖర్చు చేయలేకపోతున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అదనంగా ₹1,200 కోట్లు కేటాయించడానికి హామీ ఇచ్చారని, అందుబాటులో ఉన్న PMAY అర్బన్ నిధులను ఖర్చు చేయడానికి జనవరి 15 గడువు విధించారు. “రాబోయే వారాల్లో, మరో ₹1,200 కోట్లు విత్‌డ్రా చేస్తాం, ఇంకా మరిన్ని కూడా తర్వాత తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి తెలిపారు, గృహనిర్మాణ శాఖ మంత్రి మరియు కలెక్టర్లందరూ ఈ పనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. జనవరి 15 లోపు అన్ని కేంద్ర పధకాల నిధుల వినియోగం పూర్తి చేసి, తదుపరి విడత విత్‌డ్రా చేయడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి బలమైన ఆదేశం జారీ చేశారు. “కేంద్ర డబ్బు ఖర్చు చేయడంలో రాజీ లేదు. ప్రతి రూపాయి ఖర్చు చేయాలి” అని నొక్కి చెప్పారు. ₹30,000 కోట్ల ప్రతిష్టాత్మక లక్ష్యం నిర్ణయించి, వచ్చే ఏడాది బడ్జెట్‌ను ఖరారు చేయాలని అన్ని సెక్రటరీలను కోరారు. “అవకాశాన్ని అందిపుచ్చుకుని, తక్షణమే చర్యలు చేపట్టండి” అని కలెక్టర్లకు చెబుతూ, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించడంలో చురుకుగా ఉండాలని కోరారు. ప్రభుత్వ ఖాతాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల విషయాన్ని కూడా డా. రొనాల్డ్ రోజ్ దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 10,750 ప్రభుత్వ ఖాతాల్లో 26 జిల్లాల్లో దాదాపు ₹155 కోట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా ఉన్నాయని, వీటిలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ₹10.57 కోట్లు ఉన్నాయని తెలియజేశారు. మోసపూరిత చర్యలను నివారించడానికి KYC డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయాలని, పనికిరాని ఖాతాలను మూసివేయాలని, డెలివరీ కాని చెక్ బుక్‌ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను కోరారు. చాలా కాలంగా బ్యాంక్ ఖాతాల్లో పడుకున్న ఈ మొత్తాలకు వడ్డీ ఇవ్వడానికి అవకాశం ఉందేమో అని కూడా కలెక్టర్లను పరిశీలించమని ముఖ్యమంత్రి కోరారు. నిర్మాణ సంస్థలను మరియు ఏజెన్సీలను ప్రతి పది రోజులకు ఒకసారి పిలిచి సివిల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశించారు. “వారాల తరబడి స్పందించకపోతే, వాళ్లను బ్ల్యాక్‌లిస్ట్‌లో పెట్టండి” అని సూచించారు. అన్ని శాఖల అధిపతులు తమ ఆడిట్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. తక్షణ చర్య తీసుకోవడానికి జిల్లా వారీ పథక వివరాలు సమావేశం తర్వాత అన్ని కలెక్టర్లకు అందచేస్తామని సెక్రటరీ తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.