Saturday, 14 March 2026

Blog

విశాఖపట్నం

గంటా గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే కొండ్రు మురళి* *సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి*

*గంటా గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే కొండ్రు మురళి* *సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి* _*విశాఖపట్నం డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి*:_ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం మధురవాడ జోనల్ ఆఫీస్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో తన సమస్య తెలియజేయడానికి రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. మురళీకి పీఎం పాలెంలో బాబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) కాలేజీ ఉంది. దీనికి సమీపంలోని స్మశానం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రీవెన్స్ లో గంటా దృష్టికి మురళీ తీసుకువచ్చారు. స్మశానానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి శ్మశాన వాటికను ప్రత్యామ్నాయ స్థలానికి మార్చే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు గంటా శ్రీనివాసరావు సూచించారు. ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో బడ్డీలు తొలగించడం వల్ల 20 ఏళ్ల నుంచి ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. డ్రెయిన్లు, రోడ్లు కావాలని.. స్మశానాన్ని అభివృద్ధి చేయాలని.. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కోరారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, చిక్కాల విజయ్ బాబు, కార్పొరేటర్లు లొడగల అప్పారావు, పిల్లా మంగమ్మ, మొల్లి హేమలత, పి.వి.నరసింహం, జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కేంద్రం జాతీయ ఉపాధి హామి పథకం పేరు మార్చడం పై నిరసన : కాంగ్రెస్*

*కేంద్రం జాతీయ ఉపాధి హామి పథకం పేరు మార్చడం పై నిరసన : కాంగ్రెస్* *విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి* మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యూ పి ఏ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం దేశంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని, అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ జాతి పిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయం అని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఎల్ ఎన్ హాసిని వర్మ అన్నారు. మాజీ ఇంచార్జ్ డీసీసీ వజపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మహాత్ముల పేర్లు బీజేపీ ప్రభుత్వం చూసి తట్టుకోలేకపోతోందని ఆయన అన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ మాట్లాడుతూ ఉపాధి హామి పథకం పై కుట్రలు తగవని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా గత కొంత కాలంగా నిధులు కోత విదిస్తున్నారని, ప్రస్తుతం తీసుకువచ్చిన సవరణలో దేశ వ్యాప్తంగా సుమారు 30 వేల కోట్లు పథకానికి కోత విధించునున్నారని, అందులో ఆంధ్రప్రదేశ్ కి 3 వేల నుండి 5 వేల వరకు పేరు మార్చి సవరణ చేసిన కొత్త కే వి జీ రామ్ జీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం భారం పెంచనుందని, అందరు పేరు మాత్రమే మార్చారని అనుకుంటున్నారని, పేరుతో రాజకీయం చేసి, అందరిని పేరు చుట్టూ చర్చలో తిప్పి పెద్ద ఎత్తున ఈ పథకంలో నిధుల కోత పెట్టడమే కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ప్రియాంక అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాండవ గాయత్రి,జిల్లా ఎస్ సి సెల్ చైర్మన్ పద్మిని చంద్రశేఖర్,పీసీసీ మెంబెర్ వై ఎస్ జగన్,దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ,భీమిలి ఇంచార్జ్ రామకృష్ణ, గాజువాక మాజీ కన్వీనర్ గవర వెంకటరమణ, సీనియర్ నాయకులు గుత్తుల శ్రీనివాస్, జర్రిపోతుల ముత్యాలనాయుడు, ఉమ్మిడి భాస్కర్,సేవాదళ్ జాతీయ కార్యదర్శి గంగాధర్, ఫర్వీన్ ఖాన్,అప్పారావు, మోహన్, వేమూరి సురేష్,డా.విజయ్ చంద్రా,బాషా, అక్రమాని రమణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కేజీహెచ్ లో పేద రోగులకు దుప్పట్ల పంపిణీ.

కేజీహెచ్ లో పేద రోగులకు దుప్పట్ల పంపిణీ………. *విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి* విషయంలోకి వెళ్తే కింగ్ చార్జి ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది అందరూ నర్సస్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిరుపేద రోగులకు మరియు సేవా వార్డు లో అనాధ రోగులకు చలి రగ్గులను అందించడం జరిగినది. ఈ ఒక్క కార్యక్రమం కింగ్ జార్జ్ ఆసుపత్రి గౌరవ సూపర్నెంట్ గారు శ్రీమతి డాక్టర్ ఐ వాణి ఆధ్వర్యంలో జరుపబడినది. ఈ యొక్క కార్యక్రమం లో డిప్యూటీ సూపర్నెంట్ రాధాకృష్ణ గారు, డాక్టర్ శ్రీహరి గారు సి.ఎస్.ఆర్.ఓ గారు, గ్రేడ్ వన్ నర్సింగ సూపర్డెంట్ శ్రీమతి పద్మావతి గారు, ఏపీ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీమతి భవాని శ్రీమతి వరలక్ష్మి కేజీహెచ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

అమరావతి

ముగిసిన రెండు రోజుల 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్*

*అమరావతి డిసెంబర్ 18 విశాఖ పున్నమి ప్రతినిధి* *ముగిసిన రెండు రోజుల 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్* • రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు. • స్పీడ్ ఆఫ్ డెవలిరింగ్ గవర్నెన్స్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. • నెంబర్లు నమ్మను… ఆకస్మిక తనిఖీలకు వెళ్తానని కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్పష్టం చేసిన చంద్రబాబు. • ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు కొలమానమన్న ముఖ్యమంత్రి. • ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయం. • కేంద్ర నిధులను ఖర్చు చేయడంతోపాటు… అదనంగా రూ. 5 వేల కోట్లు రాబట్టేలా ఫోకస్ చేయాలని సీఎం సూచన. • ఉత్తమ పద్దతులు అవలంభించిన ఆరు జిల్లాల కలెక్టర్లతో తొలి సారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. • ఆరు ఉత్తమ పద్దతులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశం. • 22ఏ భూముల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కలెక్టర్లకు ఆదేశం. • 22ఏ భూములను అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం స్పష్టీకరణ. • ఏపీఐఐసీకి చెందిన 82 వేల ఎకరాల భూములకు 22ఏ నుంచి విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు. • విశాఖ పరిసర ప్రాంతాల్లోని కొంత మంది రాజకీయ నేతలు భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని సీఎం దృష్టికి తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. • భూ వివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని జిలా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశం. • పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను ఇకపై కొరియర్ ద్వారానే యాజమానులకు చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశం. • ఉగాది నాటికి ఫ్యామిలీ కార్డ్ జారీ, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. • జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచన. • ఈ నెల 28వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలని సీఎం ఆదేశం. • రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేస్తూ… ఇతర రాష్ట్రాల నుంచి పెట్రోల్, డిజీల్ సహా ఇతర పరికరాలను కొనుగోలు చేయకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. • ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు అత్యవసరంగా గైడ్ లైన్స్ ఇవ్వాలని ఆదేశించిన చంద్రబాబు. • శాంతి భద్రతల సమీక్షలో సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు. • నోటోరియస్ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశం. • అసంబద్దంగా చలానాలు వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని పోలీసులకు సీఎం సూచన. • సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి. • ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘంతోపాటు… పోలీసులు, నిపుణులతో కూడిన బృందం ఏర్పాటు చేయాలని సూచన. • కన్విక్షిన్ రేటు పెరగాలి… క్రైమ్ రేటు తగ్గాలని చంద్రబాబు సూచన. • తీర భద్రతకు తక్షణం బోట్లు కొనుగోలు చేయాలని ఆదేశం. • వచ్చే సమావేశం నాటికి జిల్లాలోని టాప్-3 నేరాలను ఏ విధంగా కట్టడి చేశారనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి. • ముఖ్యమంత్రికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎకనమిక్ టైమ్స్ ప్రకటించడంపై అభినందనలు తెలిపిన కలెక్టర్లు, హెచ్‌ఓడీలు, మంత్రులు

విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు అన్ని జిల్లాల నుంచి

*విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు అన్ని జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న సంతకాల పత్రాల వాహనాలను ఈ రోజు గవర్నర్ గారికి అందజేసేందుకు గౌ” శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర పార్టీ కార్యాలయంలో రీజనల్ కో-ఆర్డినేటర్లు,జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నియోజకవర్గ సమన్వయకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొని *గౌ” శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని* మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు..*,మాజీ ఎమ్మెల్యే,దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త *వాసుపల్లి గణేష్ కుమార్ గారు* , మాజీ ఎమ్మెల్యే,పచ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త *మళ్ళ విజయప్రసాద్ గారు* ,గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త *తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారు* ,తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త *మొల్లి అప్పారావు గారు* ..

అన్నమయ్య

చిట్వేల్‌లో ఆర్థిక అక్షరాస్యతపై కళాజాత కార్యక్రమం

కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చిట్వేల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించే కళాజాత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సోదరులు, క్రాస్‌ రోడ్స్‌ పొదుపు గ్రూపులు, మహిళా సంఘాల సభ్యులకు ఎస్‌ఎస్‌జి రుణాలు, ప్రధానమంత్రి భీమా పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. ప్రధానంగా సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాల లాభాలు, సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను కళాకారులు మాటలు, పాటలు, మ్యాజిక్‌ షో ద్వారా ఆకట్టుకునేలా వివరించారు. ప్రతి ఒక్కరూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో తప్పనిసరిగా ఖాతా కలిగి ఉండాలని, అలాగే 15 సంవత్సరాల లోపు చిన్నారులకు కేవలం రూ.100తో ఖాతా ప్రారంభించే సదుపాయం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సూపర్వైజర్ విష్ణు సార్‌, కృష్ణారెడ్డి సార్‌, కళాజాత బృంద సభ్యులు విజయ్‌, చిరంజీవి, అరవిందులు పాల్గొనగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల.. విజయవంతంగా నిర్వహింపబడిన ఫిజిక్స్ ఫెస్ట్ 2025……

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ సంస్థ (APSECM) సహకారంతో Physics Fest – 2025 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా APCPDCL మేనేజింగ్ డైరెక్టర్ గారు, NTR జిల్లా IAS అధికారులు, APGENCO, APSECM, NREDCAP, APTRANSCO సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు మరియు ఇంధన సంరక్షణ రంగానికి చెందిన ప్రముఖ అధికారులు పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు, ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు. ఈ Physics Fest సందర్భంగా Energy Conservation Week ను పురస్కరించుకొని విద్యార్థులలో ఇంధన పొదుపు, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ వేడుకలో భాగంగా Essay Writing, Quiz, Dumb Charades, Poster Presentation, PowerPoint Presentation, Spot Photography వంటి పోటీలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో APSECM డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ వి. పద్మజ గారు ముఖ్య పాత్ర పోషించారు. అలాగే భౌతిక శాస్త్ర విభాగాధిపతి డా. ఎం. గీతా మాధురి గారు, బోధన సిబ్బంది శ్రీమతి ఎస్.ఎన్. సునీత గారు, శ్రీమతి డి. నీరజ గారు, బోధనేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గారు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

E-పేపర్

ఐదో రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో యూనియన్ సభ్యుల దీక్ష విరమింప చేసిన *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి

ఐదో రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో యూనియన్ సభ్యుల దీక్ష విరమింప చేసిన *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి రైల్వే కోడూరు పట్టణంలో జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఐదో రోజు రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వీరికి సంఘీభావం తెలుపుతు *ప్రభుత్వ విప్ రైల్వే కోడూర్ శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు,,రైల్వే కోడూర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఎమ్మెల్యే ఆర్య శ్రీధర్ మాట్లాడుతూ మనం రాజంపేట జిల్లా కేంద్రం సాధించేవరకు ఇలాగే ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు.

కడప

జిల్లా ప్రధాన కార్యదర్శి గా వై ఎస్ జబిఉల్లా

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులను నియమించింది ఈ ప్రక్రియలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ జబీఉల్లా గారిని కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ నియమించింది ఆయన పార్టీకి చేసిన సేవలకు గాను ఈ పదవి లభించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడినందుకు మంచి ఫలితం లభించిందని ఇకపై మరింత బాధ్యతతో తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారి కి ధన్యవాదాలు తెలిపారు

తూర్పు గోదావరి

రోడ్డు పై పేరుకున్న ఇసుకను తొలగించండి మహా ప్రభు….

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లోని ఇసుక రీచ్లలో నుండి ఇసుక తవ్వకాలను చేసుకొని అటు ప్రభుత్వ ఖజానా ఇటు రీచ్ యాజమానుల జేబులు బాగానే నింపుకుంటున్నారు, అయితే కాసులకు కక్కుర్తిపడి నిబంధనలు పాటించడం మానేసి లారీలకు ప్రమాద స్థాయిలో ఇసుకను లోడ్ చేస్తున్నారు ఆ లారీలు కనీసం పట్టా కప్పుకోకుండా రోడ్ల పైన వెళ్తూ వాహనదారుల కళ్లలో ఇసుక పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు,అదే విధంగా కొవ్వూరు గోదావరి మాత విగ్రహం దగ్గర, ఆరికిరేవుల, గామన్ బ్రిడ్జి వద్ద లారీల మీద పడ్డ ఇసుక వలన వాహనాలు జారి పడి చాలా మంది ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు,స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని సమస్య పరిష్కారం చూపిస్తున్నారని కోరుకుంటున్న ప్రజానీకం…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.