Saturday, 14 March 2026

Blog

విశాఖపట్నం

.జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 21 వినతులు.

జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 21 వినతులు. – జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు *విశాఖపట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 21 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లో సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 21 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా మధురవాడ జోన్ కు 05, ఈస్ట్ జోన్ కు 08, సౌత్ జోన్ కు 01, నార్త్ జోన్ కు 04, గాజువాక జోన్ కు 02, పెందుర్తి జోన్ కు 01 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు. పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. *విశాఖపట్నం డిసెంబర్ 19 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 21 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లో సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 21 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా మధురవాడ జోన్ కు 05, ఈస్ట్ జోన్ కు 08, సౌత్ జోన్ కు 01, నార్త్ జోన్ కు 04, గాజువాక జోన్ కు 02, పెందుర్తి జోన్ కు 01 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు. పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

విశాఖపట్నం

ద్రోణంరాజుకి కాంగ్రెస్ శ్రేణులు నివాళి*

*ద్రోణంరాజుకి కాంగ్రెస్ శ్రేణులు నివాళి* *విశాఖపట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి* ఉత్తరాంధ్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ 93 వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో జరిగాయి. సిరిపురం జంక్షన్ లో ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి ఆమె పూల మాల వేసి, మూడు రంగుల కండువా కప్పి నివాళులు అర్పించారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాజకీయాలలో స్వర్గీయ ద్రోణంరాజు చెరగని ముద్ర వేశారని, వుడా చైర్మన్ గా, ఎంపీగా అద్భుతమైన పాలన అందించారని, ఎంవీపీ లాంటి కాలనీ ఆయన హయాంలోనే రూపొందిందని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి, కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం,మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి చాలా ఇష్టమైన నాయకుడని ప్రియాంక తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కాండవ గాయత్రి, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, డా. విజయ్ చంద్రా, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి, సీనియర్ నాయకులు కస్తూరి వెంకటరావు, సోడాదశి సుధాకర్, ముక్క రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర

అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా *విశాఖపట్నం డిసెంబర్ 19 పున్నమి ప్రతినిధి* అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పార్క్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేయనున్న భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి విగ్రహావిష్కరణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు, పార్టీ నాయకులతో చర్చించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని నాయకులు పేర్కొన్నారు.

అన్నమయ్య

చిట్వేల్‌లో నూతన కానిస్టేబుళ్లకు ఘన సన్మానం

చిట్వేల్ మండల పరిధిలో నూతనంగా ముగ్గురు కానిస్టేబుళ్లుగా ఎంపికైన యువకులను చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ ఎస్సై వినోద్ కుమార్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి తిరుపతిలోని కళ్యాణ్ డ్యాంలో పోలీస్ శిక్షణ ప్రారంభమవుతుందని ఎస్సై తెలిపారు. శిక్షణను క్రమశిక్షణతో, జాగ్రత్తగా పూర్తి చేసి ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచించారు. చట్ట పరిరక్షణలో భాగస్వాములై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని, నూతన కానిస్టేబుళ్లకు విజయవంతమైన సేవా జీవితాన్ని కోరారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ వీధి వ్యాపారులకు అండగా బీజేపీ నేతలు:

ఖమ్మం డిసెంబర్ (పున్నమి జిల్లా ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని టూ టౌన్ పరిధిలో గల పాత బస్టాండ్ ఎదురుగా, 44వ డివిజన్‌లోని వీధి వ్యాపారుల ప్రాంగణానికి సంబంధించిన కూరగాయల పర్చేస్ షాపుల కేటాయింపుల కోసం ఖమ్మం కార్పొరేషన్ అధికారులు డ్రా విధానాన్ని నిర్వహించారు. జనాభా రిజర్వేషన్ ప్రాతిపదికన, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్, మహిళలకు ప్రత్యేక కేటాయింపులతో ఈ డ్రాను భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు దాసరి మధు, టూ టౌన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ జ్యోతుల యుగంధర్ నాయుడు వీధి వ్యాపారులకు అండగా నిలిచారు. డ్రా ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి, వ్యాపారుల హక్కులు పరిరక్షించాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టూ టౌన్ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

బర్మా కాలనీలో దోమలపై యుద్ధనాదం: 49వ వార్డులో జాతీయ కీటకజనిత వ్యాధి నిరోధక కార్యక్రమం విజయవంతం

49వ వార్డు బర్మా కాలనీలో శుక్రవారం జాతీయ కీటకజనిత వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’గా పాటిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా మంచి స్పందనను రాబట్టింది. సానిటరీ ఇన్స్పెక్టర్ త్రిమూర్తులు, సానిటరీ సూపర్వైజర్ జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 49వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సంగు వాసు, బీజేపీ వార్డు అధ్యక్షుడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించి, దోమలు మరియు ఇతర కీటకాల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు, వాటి కారణాలు, నివారణ చర్యలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ—ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూడటం, నీటి ట్యాంకులు మూసివేయడం, డ్రమ్ములు–కుండీల్లో నీరు నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు కీటకజనిత వ్యాధుల నివారణకు కీలకమని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను కట్టడి చేయడం సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సెక్రటరీలు, సీఈవోలు, ఆర్పీలు తదితరులు పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణకు వార్డు స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అత్యవసర పేషెంట్‌కు SDAP ప్లేట్లెట్ల దానం

(నెల్లూరు — పున్నమి ప్రతినిధి) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, పొట్టిశ్రీరాములు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రక్త నిధి కేంద్రం కోఆర్డినేటర్ బయ్యా ప్రసాద్ నారాయణ హాస్పిటల్‌లో అత్యవసర పేషెంట్‌కు సింగిల్ డోనార్ ఆఫరెసిస్ (SDAP) ద్వారా ప్లేట్లెట్లను దానం చేశారు. ఈ కార్యక్రమం ఛైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చమర్తి జనార్ధన్ రాజు సమక్షంలో జరిగింది. ప్రతి సంవత్సరం 16 వేలకుపైగా స్వచ్ఛంద రక్తదానాలు జరుగుతున్నాయని, వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్స్ పెరిగి రక్త కొరత ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు రక్తదానంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజేంద్ర ప్రసాద్, డా. యశోవర్ధన్, మోటివేటర్లు మధుసూదనరావు, భాస్కర్ రావు, సాయిరాం పాల్గొన్నారు.

E-పేపర్

రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టాక్సీ యూనియన్

రైల్వేకోడూరు లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టాక్సీ యూనియన్ కు మద్దతు తెలిపిన గౌ” తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయల్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని తన ఆకాంక్షను తెలియజేశారు.

E-పేపర్

గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ – 2026 విడుదల

పున్నమి ప్రతినిధి: గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ – 2026 విడుదల 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ *దరఖాస్తుకు కావలసినవి:* ఆధార్ కార్డు (aadhar card) సంతకంతో కూడిన పాస్ ఫోటో(pass photo with signature) స్టడీ సర్టిఫికెట్( 5వ తరగతి కోసం అయితే 4వ తరగతి స్టడీ సర్టిఫికెట్/ present study certificate) కుల ధృవీకరణ పత్రం(caste certificate) ఆన్లైన్లో 100 రూపాయలు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చును ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ 11-12-2025 నుండి 21- 01-2026 వరకు* పరీక్ష తేదీ 22-02-2026 రోజున ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

తెలంగాణ

రేషన్ కట్.. అనేది ఉండదు..* *ఆందోళన చెందాల్సిన అవసరం లేదు*

తెలంగాణా డిసెంబర్ 19 (పున్నమి ప్రతినిధి) *రేషన్ కట్.. అనేది ఉండదు..* *ఆందోళన చెందాల్సిన అవసరం లేదు* *బియ్యం పంపిణీని నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు* *సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు* *ఈ కేవైసీ కి ఏలాంటి తుది గడువు లేదు..* *స్పష్టం చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర* తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి పౌరసరఫరాల శాఖ తెరదించింది. ఈ నెల 31లోగా e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పూర్తి చేయకపోతే ప్రభుత్వం పంపిణీ చేయనున్న ‘సన్నబియ్యం’ నిలిపివేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించాయి. నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర స్పందిస్తూ.. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బియ్యం పంపిణీని నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమైన వివరణ ఇచ్చారు. *EKYC ప్రక్రియ అనేది..* e-KYC ప్రక్రియ అనేది రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారుల వివరాలను ధృవీకరించుకోవడానికి చేసే ఒక ప్రామాణిక చర్య అని అధికారులు తెలిపారు. కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా రేషన్ దుకాణానికి వెళ్లి తమ వేలిముద్రలు (Biometric) లేదా కనుపాప గుర్తులను (Iris) నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తుది గడువు విధించలేదని కమిషనర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరినీ రేషన్ కు దూరం చేసే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. *ఇబ్బందులు తలెత్తకుండా..* భవిష్యత్తులో రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ e-KYC ప్రక్రియ పూర్తి చేయడం మేలని ప్రభుత్వం సూచిస్తోంది. ముఖ్యంగా అనర్హుల పేర్లను తొలగించడానికి, అలాగే కార్డులో ఉండి చనిపోయిన వారి పేర్లను గుర్తించడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. లబ్ధిదారులు ఆందోళనతో రేషన్ షాపుల వద్ద గుమికూడకుండా, తమకు వీలైన సమయంలో వెళ్లి ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రభుత్వ అధికారిక ప్రకటనలతో క్షేత్రస్థాయిలో ఉన్న అయోమయం తొలగిపోయినట్లయింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.