Friday, 6 March 2026

Blog

ఖమ్మం

వెలుగుమట్ల నిర్వాసితులకు బీజేపీ నేత దేవకీ వాసు దేవా రావు ఆధ్వర్యంలో ఆహార పంపిణి

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ ప్రాంతంలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం అంబేద్కర్ సెంటర్ వద్ద తలదాచుకుంటున్నారు. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలుస్తూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోశాధికారి దేవకీ వాసుదేవరావు గత రెండు రోజులుగా నిర్వాసితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. శుక్రవారం కూడా అయన ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం అందజేసి వారి ఆకలి తీర్చే కార్యక్రమం నిర్వహించబడింది. ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సహాయం వారికి తాత్కాలిక ఊరటనిస్తోంది. ఈ సేవా కార్యక్రమంలో బీజేపీ మరియు జనసేన నాయకులు వల్లల రమేష్, రుద్రగాని మాధవ, మిర్యాల రామకృష్ణ తదితరులు పాల్గొని బాధితులకు మద్దతు తెలిపారు. నిర్వాసితుల పట్ల మానవత్వంతో ముందుకు వచ్చిన నేతలను బాధితులు కృతజ్ఞతలతో అభినందించారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. వెలుగుమట్ల ఘటనతో నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ సహాయం అవసరమని నేతలు పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల

తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి డిపాజిట్ పథకం.

సిరిసిల్ల ఫిబ్రవరి 27 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న ఏకైక బ్యాంకు ప్రభుత్వ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో కాకుండా మన గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసుకుని అధిక వడ్డీ పొందగలరని వృత్తి వివరాలకు నీ దగ్గరలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకును సంప్రదించగలరు.

ఖమ్మం

అటల్ జీ శతజయంతి ఉత్సవాలు మార్చి 1 న జరిగే సభ ని జయప్రదం చెయ్యండి:

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన స్మృతికి నివాళి అర్పిస్తూ అటల్ బిహారీ వాజ్‌పేయి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుద్దుకూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దుకూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అటల్ జీ మహోన్నత వ్యక్తిత్వం, సిద్ధాంతాలు, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తినివ్వాలని, సమాజంలో విలువలతో కూడిన రాజకీయ అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ ఉత్సవాల లక్ష్యమన్నారు. మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎస్.ఆర్. గార్డెన్స్‌లో “అటల్ జీ కి అక్షర నిరాజనం” పేరుతో కవితా సంకలనాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. అలాగే ఈ సభకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వాగత కమిటీ అధ్యక్షుడిగా కాటమనేని రమేష్ వ్యవహరించనున్నారు. ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మందడపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అజాతశత్రువుగా పేరుగాంచిన అటల్ జీకి నివాళి అర్పించేందుకు జాతీయవాదులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సభలో కవి పండితులకు సన్మానం, “ఘనమైన మన ఖమ్మం” నృత్యరూపకం, అటల్ జీకి నివాళి గేయం ఆవిష్కరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, వడ్లమూడి సురేష్, కోశాధికారి మల్లెంపాటి రమేష్, కార్యదర్శులు యాలగందుల మధు, పోతుల చంద్రశేఖర్, తవిడబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Featured

పెళ్లి అనంతరం తొలిసారి బయటకు వచ్చిన విజయ్–రష్మిక

ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తొలిసారి కొత్తజంట ఉదయపూర్ విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ‘వీరోష్’ జంటను చూసిన అభిమానులు శుభాకాంక్షలు తెలపగా, వారు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉత్సాహపరిచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వేల్పులగుంటలో ….మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన

వేల్పులగుంటలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన తేదీ 28 ఫిబ్రవరి 2026 శని వారం ఉదయం 10.00 గంటలకు ఎస్ పేట మండలం వేల్పులగుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొంటారు ఈ సందర్భంగా గ్రామంలో 11 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం మరో 2 లక్షలతో మంజూరు చేసిన నూతన సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన 31 లక్షల 60 వేల జేజేమ్ నిధులతో నిర్మించనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన అనంతరం స్థానిక ఎస్సీ కాలనీలో శ్రీవాణి నిధులతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వినాయకస్వామి వారి దేవస్థానము కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని ఆనం రామనారాయణ రెడ్డి క్యాoప్ కార్యాలయం తెలిపారు

కడప

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నిధి సహాయ చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరా రెడ్డి గారు పంపిణీ చేశారు

*పేదల ఆరోగ్యానికి భరోసా – మన ఎన్డీయే ప్రభుత్వ నిబద్ధత!* *ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గానికి సంబంధించిన 53 మంది లబ్ధిదారులకు 54.81 లక్షల రూపాయల 24 వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *అర్హతేప్రామాణికంగా,కులమతాలకు,రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడిని ఆదుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం.ఆపదలో ఉన్న వారికి అండగా మన ప్రభుత్వం.కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి అండగా ఉంటూ,వారికి భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం.* *ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,TNTUC జిల్లా అధ్యక్షులు చింతకుంట కుటుబుద్దీన్ గారు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మారుతి ప్రసాద్ రెడ్డి గారు,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున గారు,మాజీ కౌన్సిలర్లు సూర్యనారాయణ రెడ్డి గారు,తలారి పుల్లయ్య గారు,సోమా బాలయ్య గారు,గంజికుంట ఆంజనేయులు గారు,TDP పట్టణ కార్యదర్శి రాజా,సాన శివనాగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అసెoబ్లీలో ఉదయగిరి సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులకు వైసీపీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఉదయగిరి ఎమ్మెల్యే కాక్లర సురేష్ అన్నారు సోమశిల నుంచి ఉదయగిరి మీదుగా కందుకూరు వరకు జీ కె న్ కాలువ ఉంది ఏడు వందల క్యూసెక్కుల 1400 క్యూసెక్కుల నీరు ప్రవహించెలా పనులు చేశాము క్రాకూటూరు రెగ్యులటర్ వద్ద డిస్ట్రి బ్యూటరి ఛానల్ నిర్మాణనికి రూ. 8.50కోట్లు బడ్జెట్ ఇవ్వండి ఇది పూర్తియితే 16 వేల ఎకరాలకు నీరు అందుతుందని ఉదయగిరి ఎ మ్మెల్యే కాకర్ల సురేష్ అసెoబ్లీ అన్నారు

ఖమ్మం

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి – కేకేసి డిమాండ్

ఖమ్మం ఫిబ్రవరి ( పున్నమి జిల్లా ఇంచార్జి ) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసి) ఖమ్మం జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించి “వీబీజీ–రామ్ జీ”గా మారుస్తూ మార్పులు చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ, కేకేసి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ పిలుపు మేరకు “యంజిఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామం” కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామపంచాయతీలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కేకేసి మండల అధ్యక్షులు కొండ మధు గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల మధ్య జరిగింది. ఈ సందర్భంగా విప్లవ కుమార్ పటేల్ మాట్లాడుతూ — దేశ గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల వలసలను నివారించేందుకు, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సారథ్యంలో కేంద్ర నిధులతో గ్రామీణ ప్రజలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధి కల్పించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పథకంపై ఆంక్షలు విధిస్తూ పేరు మార్పు సహా పలు సవరణలు తీసుకువస్తున్నదని, ఈ చర్యలను అఖిల భారత అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, మార్పులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేకేసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, పోలేపల్లి గ్రామ సర్పంచ్ బత్తిని మహేష్, జిల్లా నాయకులు ఎండీ గయాజ్ పాషా, బి సతీష్, మెరుగు వెంకట్ నాయుడు, సిహెచ్ రాజు, బత్తిని వేలాద్రి, కొండం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

గుండ్రుబిల్లీలో అభివృద్ధి శంఖారావం – ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా సీసీ రోడ్ల శంకుస్థాపన..!

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 25 (పున్నమి న్యూస్ ప్రతినిధి – ఆనంద్): ఎలమంచిలి మండలం పరిధిలోని రూరల్ గ్రామమైన గుండ్రుబిల్లిలో అభివృద్ధికి నాంది పలుకుతూ స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి చొరవతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రెండు రోజుల్లో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు వేయించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడం ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎపీపీ రాజన్న శేషు గారు, వైస్ ఎంఎపీపీ నాగిరెడ్డి అచ్చినాయుడు గారు, గుండ్రుబిల్లి గ్రామ అధ్యక్షుడు వై. మాణిక్యం గారు, జనసేన పార్టీ నాయకులు సర్వసూది హరికృష్ణ గారు, కురందాసు శ్రీనివాసు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి రూరల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అన్నం బాబ్జీ గారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే చూపుతున్న కట్టుబాటు అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామ స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి పనులతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.

Updates

డీఎంకే పార్టీలో చేరిన తమిళనాడు మాజీ సీఎం

Date27-2-2026 *తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం..!* *డీఎంకే పార్టీలో చేరిన తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం.* *పన్నీర్ సెల్వంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం స్టాలిన్.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.