Saturday, 14 March 2026

Blog

అన్నమయ్య

ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలి: మల్లెం హేమంత్ కుమార్

చిట్వేల్, డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షుడు మల్లెం హేమంత్ కుమార్ పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి బిడ్డకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని నిర్ణయించారు.పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే పోలియో రహిత సమాజం అవసరమని, ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ చుక్కల మందు వేయించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనలు కావాలని. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు శ్రావణి, రమాదేవి, గడిచినపాటి ప్రకాష్ మరియు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్21 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. గ్రామంలోని 40 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి గ్రామస్తులు మంచి సహకారం అందించడంతో లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించారు.

ఖమ్మం

తమ పై వచ్చిన ఆరోపణలు ఖందించిన నెల్లూరు కోటేశ్వరరావు, కుసంపూడి రవీందర్

ఖమ్మం జిల్లా (పున్నమి ప్రతి నిధి) సిరి గోల్డ్ ఫైనాన్స్ మీద బాధితుడు యాస నాగేశ్వరావ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ సి సి యస్ పోలీసు లు ఏ. 1. గా కుసంపూడి రవీందర్ ఏ. 2 గా నెల్లూరు కోటేశ్వరరావు పేర్లు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కోటేశ్వరరావు, కుసంపూడి రవీందర్ లు వేరు వేరు గా ఖండిస్తు ప్రకటన లు విడుదల చేసారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ప్రచారం కొనసాగితే పరువు నష్టం దావా వేస్తామని నెల్లూరు కోటేశ్వరరావు హెచ్చరించారు. సిరి గోల్డ్ కి తనకు గాని తన పెట్టుబడులు కి గాని ఎటువంటి సంబంధం లేదని కోటేశ్వరరావు తెలియజేసారు. సీనియర్ నాయకులు కుసంపూడి రవీందర్ మాట్లాడు తు సిరి గోల్డ్ సంస్థ ఎవరిని మోసం చేయలేదని స్పష్టం చేశారు. తమపై ఫిర్యాదు చేసిన యాసా నాగేశ్వరరావు తమ వద్ద రూ.15,000 విలుచేసే బంగారం కొనుగోలు చేశారని తెలిపారు. అయితే ఆ కొనుగోలుకు సంబంధించి నగదు చెల్లించారాని డిపాజిట్ చేయలేదని, బంగారం కొనుగోలు చేసిన సమయంలో 15000 కి రసీదు కూడా అందజేశామని పేర్కొన్నారు. తాను ఎక్కడికీ పరారై పోలేదని, తన సెల్ ఫోన్ ఎప్పుడూ అందుబాటులోనే ఉందని అన్నారు2026. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎల్‌బీ నగర్‌లో సిరి గోల్డ్ & డైమండ్ షోరూమ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ వ్యవహారానికి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే తప్పకుండా పరువు నష్టం దావా వేస్తామని కుసంపూడి రవీంద్ర హెచ్చరించారు.

అన్నమయ్య

నందలూరులో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం: చిన్నారులకు చుక్కలు వేసిన ఎద్దుల విజయ సాగర్

నందలూరు: మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా మండలంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ​ముఖ్య అతిథిగా విజయ సాగర్ ​ఈ కార్యక్రమానికి రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ​విజయ సాగర్ ప్రసంగం ​ఈ సందర్భంగా విజయ సాగర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ​”చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో తల్లిదండ్రులు బాధ్యతగా పాలుపంచుకోవాలి.” అని ఆయన కోరారు. ​పాల్గొన్న అధికారులు మరియు నాయకులు ​ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా: ​రాము: నందలూరు సర్పంచ్. ​గంగాధర్: నాగిరెడ్డిపల్లి టీడీపీ అధ్యక్షులు. ​బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ప్రయాణికుల పిల్లలకు, స్థానిక చిన్నారులకు వైద్య సిబ్బంది ఎంతో శ్రద్ధతో చుక్కల మందు వేశారు. ప్రభుత్వ డాక్టర్లు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిండు జీవితానికి – రెండు చుక్కలు

*జాతీయ పోలియో దినోత్సవం* అయిన ఈరోజు *21.12.2025* అనగా *ఆదివారం ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు వింజమూరు మండల కేంద్రంలో పోలియో దినోత్సవ సందర్భంగా పాల్గొన్న వింజమూరు మండల కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గని శ్రీనివాసులు నాయుడు ప్రతి *0..నుంచి5సంవత్సరాలలోపు* ఉన్న ప్రతిచిన్నారికి పోలియో చుక్కలను వేయించాలని పోలియోవ్యాధి నుంచి శాశ్వత రక్షణ భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన జీవితం ఉంటుందన్నారు. ఒక చుక్క – జీవితాంతం భద్రత పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన సమాజం మన లక్ష్యం అని పేర్కొన్నారు. మీ సమీపంలోని పోలియో కేంద్రంలో చుక్కలను వేయించాలని చెప్పారు. పోలియో మహమ్మారిని తరిమికొడదాం చిన్నారుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అంగన్ వాడీ సిబ్బంది మానస .జయలక్ష్మీ. వసుందర తదితరులు పాల్గొన్నారు మీ గని శ్రీనివాసులు నాయుడు వింజమూరు మండల కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్

విశాఖపట్నం

అంతర్జాతీయ వాకర్స్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం! నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంక భ్రత బాగ్చి

అంతర్జాతీయ వాకర్స్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంక భ్రత బాగ్చి ఘనంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సదస్సులో … దేశ విదేశాల నుండీ పాల్గొన్న 1650 వాకర్స్ క్లబ్స్ అధినేతలు, ప్రతినిధులు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సామాజిక సేవాచైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాకర్స్ ప్రపంచానికే ఆదర్శనీయమని నగర పోలీస్ కమీషనర్ డాక్టర్. శంక భ్రత బాగ్చి కొనియాడారు. సిరిపురంలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనా పార్క్ లో శనివారం నాడు ’34వ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ దైనందిన జీవనంలో నడకను వ్యాయామంగా మార్చుకోవడం ద్వారా రక్త ప్రశరణలో వేగం పెరిగి గుండెకు సంబంధిత ప్రాణాంతక వ్యాధుల నుండీ ఉపశమనం లభిస్తుందన్నారు. సైబర్ క్రైమ్ పై అవగాహన ఈ సదస్సులో డా. బాగ్చి “సైబర్ క్రైమ్” పై అవగాహన కల్పిస్తూ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ సైబర్ క్రైం బాదితులే నని, విదేశాలలో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి, మన యువతకు డబ్బు ఆశచూపి వారిని ఈ బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపు మూడు వందల కోట్లు దోచేశారన్నారు.సైబర్ నేరగాళ్ల నుండీ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే భయపడకుండా నేరుగా తననే సంప్రదించవవచ్చునన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ డా. కమల్ బయిద్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కె. ప్రభావతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పూర్వ అధ్యక్షులు ఎస్. పి. రవీంద్ర మాట్లాడుతూ ప్రతీ వాకర్ ఓ సైనికుడే నన్నారు. *”నడవండి – నడిపించండి”* నినాదంతో తన తండ్రి స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ 1986 సం.లో విశాఖపట్నంలో స్థాపించిన ‘వాకర్స్ ఇంటర్నేషనల్’ నేడు దేశ, విదేశాలలో మూడు లక్షలకు పైగా సభ్యులతో, 1650 శాఖలుగా విస్తరించిడం ఆనందనీయమన్నారు. ఈ సదస్సులో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె. ద్వారాకానాధ్, వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మీడియా కన్వీనర్స్ నండూరి రామకృష్ణ, సి హెచ్. శ్రీనివాసరాజు, డాక్టర్ డి డి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

భక్తి

ర్యాలి గ్రామంలో ధనుర్మాస ఉత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వెలిసిన జగన్మోహిని కేశవ స్వామి దేవస్థానం లో ధనుర్మాస ఉత్సవాలు సందర్భంగా స్వామి వారు విశేషాలు అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు ఉదయం నుంచే ఆలయ ప్రయాణం భక్తులతో కళకళలాడుతోంది ఈ ఉత్సవాలు విష్ణు భక్తికి అత్యంత ప్రాధాన్యం కలిగిన కాలంగా భావిస్తారు ఈ మాసంలో నిత్య పూజలు, ప్రత్యేక అలంకరణలో ధార్మిక కార్యక్రమాలు భక్తుల భవాలని మరింత బలపరుస్తాయి స్వామివారిని రకరకాల పద్ధతిలో అలంకరిస్తూ ఉంటారు ఈ మాసాన్ని వైష్ణవులకు ముఖ్యమైన మాసంగా పరిగణిస్తారు. END

ఆంధ్రప్రదేశ్

ప్రతి బిడ్డ ఆరోగ్యం గా ఎదగడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం :పెడన MLA కాగితకృష్ణప్రసాద్

బంటుమిల్లి మండలం బంటుమిల్లి బస్టాండ్ వద్ద, మరియు కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రాక ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రభుత్వం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని స్వయం గా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్. ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో శిబిరాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వైద్యసిబ్బంది గ్రామాలలో ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలియో చుక్కలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలిపారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే సంకల్పంతో, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాం అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

పోలియో డే……….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 21న రాష్ట్రంలో ఐదేళ్లలోపు 54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టనుంది. శనివారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమిషనర్ జి. వీరపాండియన్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కాకినాడలోని ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య అధికారులు ఐదేళ్లలోపు 54.07 లక్షల మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని, 98.99 లక్షల డోసులను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించడానికి జిల్లాల్లో నోడల్ అధికారులను కూడా నియమించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో టీకా వేయించుకునేలా చూడాలని పిలుపునిచ్చారు. టీకా వేయడంలో ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని వారికి సూచించారు. అధికారులు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బందిని భాగస్వామ్యం చేస్తూ, పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి రాష్ట్రవ్యాప్తంగా బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం వివిధ కారణాల వల్ల అర్హులైన పిల్లలు టీకా వేయించుకోలేకపోతే, ఆరోగ్య సిబ్బంది డిసెంబర్ 22 మరియు 23 తేదీలలో వారి ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే పోలియో చుక్కలు వేస్తారు. పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయడానికి ట్రాన్సిట్ బృందాలు తిరుగుతాయి. అలాగే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు మరియు ఇతర ప్రదేశాలలో కూడా పోలియో టీకా ఇవ్వడానికి ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

E-పేపర్

జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన రౌతులపూడి హై స్కూల్ విద్యార్థులు.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 21: జిల్లా స్థాయిలో జరుగుతున్న సైన్స్ ఫేర్ కార్యక్రమంలో రౌతులపూడి విద్యార్థునీ సత్తా సాటి ద్వితీయ స్థానంలో నిలిచిందని ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబు తెలిపారు. తను చేసిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు గాను జిల్లాలో ద్వితీయ స్థానానికి ఎంపికైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రౌతులపూడి జిల్లా పరిషత్ స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఆ విద్యార్థిని అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.