Saturday, 14 March 2026

Blog

E-పేపర్

ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి సోడిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆటోనగర్ సభ్యులు మరియు వెల్డింగ్ వర్కర్స్ మెకానిక్స్ రిలే నిరాహార దీక్షలో

రాయచోటి వద్దు రాజంపేట ముద్దు దీక్షలో పాల్గొన్న ఆటోనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు స్థానిక టోల్గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలో భాగంగా ‘రాయచోటి వద్దు రాజంపేట ముద్దు’ అనే నినాదంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు రైల్వేకోడూరు ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి సోడిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆటోనగర్ సభ్యులు మరియు వెల్డింగ్ వర్కర్స్ మెకానిక్స్ మొదలగువారు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగినదని మీడియా వారికి తెలియజేశారు. ఏది ఏమైనాపటికి రాజంపేటను జిల్లా చేసేంతవరకు ఉద్యమాలు ఆగవని సోడిశెట్టి సుబ్రహ్మణ్యం మీడియా వారికి తెలిపారు.

E-పేపర్

రైతులకు శుభవార్త *మీ ఇంటి దగ్గర నుండే యూరియాను బుకింగ్ చేసుకోవచ్చు* 22.12.2025 రైతులు

పున్నమి : రైతులకు శుభవార్త *మీ ఇంటి దగ్గర నుండే యూరియాను బుకింగ్ చేసుకోవచ్చు* 22.12.2025 రైతులు తెలంగాణ వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియాను రైతులు కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇందులో భాగంగా గూగుల్ ప్లే స్టోర్ నందు ఈ యాప్ అందుబాటులో ఉంది fertilizer booking app అని సెర్చ్ చేసినట్లయితే ఈ యాప్ కనబడుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని రైతులే స్వయంగా అతి సులువుగా తమ ఫోన్ నెంబరు , ఓటీపీని ఎంటర్ చేసి పట్టా పాస్ పుస్తక సంఖ్యను ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీ ఆధారంగా బుకింగ్ ఐడి బుక్ ద్వారా యూరియాను పొందవచ్చు ఈ విధానాన్ని ఈ వీడియోలో వివరించడం జరిగింది మీ వ్యవసాయ శాఖ యాచారం మండలం.

విశాఖపట్నం

వాకర్స్ ఉద్యమస్ఫూర్తి ప్రదాత డా. కమల్ బయిద్ కు “విశ్వ విఖ్యాత వాకర్ మిత్ర” విశిష్ట సేవాపురాస్కారం

వాకర్స్ ఇంటర్నేషనల్’ లో గత 40 సం.లుగా ఎనలేని సేవలనందిస్తూ, వాకర్స్ ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా నిలుస్తూ ‘ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక అవార్డు’ ను “విశ్వ విఖ్యాత వాకర్ మిత్ర” విశిష్ట సేవా పురస్కారాన్ని ప్రముఖ సంఘ సేవకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరన్స్ చైర్మన్ డా. కమల్ బయిద్ అందుకున్నారు. సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఎరీనా పార్కులో అంగరంగ వైభవంగా ముగిసిన ‘అంతర్జాతీయ వాకర్స్ సదస్సు’లో “వాకర్స్ ఇంటర్నేషనల్” చీఫ్ ట్రస్టీ కె. రామానందం, అధ్యక్షులు కె.పద్మావతి, పూర్వ అధ్యక్షులు డా. ఎస్ పి.రవీంద్ర, మీడియా కన్వీనర్స్ నండూరి రామకృష్ణ , సి హెచ్ శ్రీనివాసరాజు, ప్రతినిధులు డాక్టర్ డి డి నాయుడు, కె ద్వారకానాధ్, యూత్ ఛైర్ పర్సన్ వంశీ చింతలపాటి తదితరులు పాల్గొని డా.కమల్ బయిద్ సేవలను కొనియాడుతూ ఆయనని ఘనంగా సత్కరించారు . “నడవండి- నడిపించండి” నినాదంతో 1986 సం. లో స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ నేడు దేశవిదేశాలలో 1650 శాఖలుగా విస్తరించి, మూడు లక్షలకు పైగా వాకర్స్ సభ్యులతో విరాజిల్లి తున్నదనని డా. ఎస్. పి రవీంద్ర తెలిపారు.

జోగులాంబ గద్వాల

సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం.*

*సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం.* జోగులాంబ గద్వాల డిసెంబర్21 (పున్నమి ప్రతినిధి) సోమవారం నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపియడం జరిగిందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమము యధావిధిగా నిర్వహిం చడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

E-పేపర్

వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక.

రౌతులపూడి (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 21: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్వీనర్ ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. ముందుగా స్థానిక మార్క సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం, వృద్ధులకు ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి జమీల్ మాట్లాడుతూ పేదల పక్షపాతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తండ్రి ఆశయాలను పునుకు పుచ్చుకొని ఆయన ఆశయ సాధనకై నిరంతరం పనిచేస్తున్నారని జమీలు అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతకాయల వీర వెంకట సత్యనారాయణ, జడ్పిటిసి గొళ్ళు చిన్న దివానం, రౌతులపూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర బాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేదార్ శెట్టి నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

E-పేపర్

వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక.

రౌతులపూడి (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 21: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్వీనర్ ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. ముందుగా స్థానిక మార్క సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం, వృద్ధులకు ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి జమీల్ మాట్లాడుతూ పేదల పక్షపాతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తండ్రి ఆశయాలను పునుకు పుచ్చుకొని ఆయన ఆశయ సాధనకై నిరంతరం పనిచేస్తున్నారని జమీలు అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతకాయల వీర వెంకట సత్యనారాయణ, జడ్పిటిసి గొళ్ళు చిన్న దివానం, రౌతులపూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర బాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేదార్ శెట్టి నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

అనకాపల్లి

“పల్స్ పోలియో రహిత సమాజం కోసం అందరూ బాధ్యత వహించాలి – సర్పంచ్ భజంత్రీల లక్ష్మి..!

డిసెంబర్ 21 అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్ ) : ఏటికొప్పాక గ్రామంలో మూడు చోట్ల పోలియో చుక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి పాల్గొని పిల్లలకు దగ్గరుండి పల్స్ పోలియో చుక్కలు వేయించడం కాకుండా పల్స్ పోలియో కార్యక్రమం కేవలం ఒక వైద్య కార్యక్రమంలో మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు అన్నం బాబూజీ, కాండ్రకోట చిరంజీవి, ఎంపీటీసీ అచ్చం నాయుడు, అన్నం సరోజ రావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను కూటమి నాయకులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు నెంబర్ల, ప్రమాణస్వీకారము కు గ్రామ ప్రజలు అందరూ ఆహ్వానితులే… నాగులపల్లి గ్రామ సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సంకటి సాయిలీల రామకృష్ణ

పున్నమి: డిసెంబర్ 21 నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సంకటి సాయిలీల రామకృష్ణ, వార్డు సభ్యులు డిసెంబర్ 22 న ఉదయం 10 గంటలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు నాగులపల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది అని మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి తెలిపారు.గ్రామ పెద్దలు వార్డ్ మెంబర్స్ యువతి యువకులు మహిళలు స్నేహితులు అభిమానులు అందరూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె తెలిపారు.

అన్నమయ్య

ఆశ్రమంలో చిన్నారి చైరస్వి చౌదరి పుట్టినరోజు వేడుకలు: అన్నదానంతో చాటుకున్న మానవత్వం

చిట్వేల్, డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలోని రాపూర్ రోడ్డు, తిమ్మాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దత్తగిరి నారాయణ తపోవణ అభయాంజనేయ స్వామి ఆశ్రమం లో ఆదివారం ఒక విశేష సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. కందులవెంకటనారాయణ, తేజస్విత దంపతుల కుమార్తె కందుల చైరస్వి చౌదరి పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -అన్నదానం – కూరగాయల పంపిణీ: పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా దృక్పథంతో నిర్వహించాలని నిర్ణయించుకున్న కందుల కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. కేవలం అన్నదానమే కాకుండా, ఆశ్రమ అవసరాల కోసం సరిపడా తాజా కూరగాయలను కూడా పంపిణీ చేశారు. చిన్నారి చైరస్వి అక్క ఉన్సిక చౌదరి స్వయంగా ఆశ్రమంలోని పెద్దలకు భోజనం వడ్డించి తన సేవా గుణాన్ని చాటుకోవడం అందరినీ ఆకట్టుకుంది.పీఠాధిపతి నాగేశ్వరమ్మ ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ.నేటి యువత, పిల్లల తల్లిదండ్రులు పుట్టినరోజు వేడుకలను ఇలా ఆశ్రమాల్లో జరుపుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆశ్రమంలోని నిస్సహాయులకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. చైరస్వి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఆశ్రమంలోని పెద్దలందరూ చిన్నారిని దీవించారు.ఈ సేవా కార్యక్రమంలో కందుల శివకుమార్, చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు మరియు పెద్దలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ 21 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండలంలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను మరింత వైభవంగా తీర్చిదిద్దారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.