Friday, 13 March 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు కాలేదు: తెలంగాణ ప్రభుత్వం

(హైదరాబాద్ — పున్నమి ప్రతినిధి) ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరిగిన వార్తలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం చెక్ పవర్ రద్దుపై ప్రత్యేక జీవో జారీ చేశారన్న ప్రచారం, సర్క్యులర్ వైరల్ కావడంతో గందరగోళం ఏర్పడింది. అయితే అవన్నీ అవాస్తవమని అధికారులు తేల్చిచెప్పారు. ఉప సర్పంచ్ల అధికారాలు యథాతథంగానే కొనసాగుతున్నాయని తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

దిల్లీ కాలుష్యానికి 40 శాతం మా రంగానిదే బాధ్యత, నాకు ప్రతి 2 రోజులకు ఒకసారి ఇన్ఫెక్షన్: కేంద్రమంత్రి గడ్కరీ

వాయు కాలుష్య ప్రభావంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. “దిల్లీ నేడు కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది, నేను 2 రోజులు దిల్లీలో ఉంటే నాకే గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది” అని ఆయన అన్నారు. “రోడ్డు రవాణా మంత్రిగా, కాలుష్యంలో 40 శాతం మా రంగానికి ముడిపడి ఉందని నేను అంగీకరిస్తున్నాను” అని ఆయన అన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: చలి తీవ్రతకు పర్యాటకులు ఫిదా

అరకు ఏజన్సీలో మూడు వారాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైన రోజులే ఎక్కువగా ఉన్నాయి. బుధవారం ఉదయం తొమ్మిది గంటలైన మంచు తెరలు తొలగిపోలేదు. అరకులోయ లో 6°, మినుములూరులో 7° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు మొదలైన చలి నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు గజగజ వణికిస్తూ పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

వనపర్తి

పాఠశాల సమస్యలపై మాట్లాడుతున్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు

*పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24 /12/ 2025* *ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన అభ్యర్థి మరియు వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకారం ఉత్సవం కార్యక్రమంలో మామిడి మాడ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ డి చెన్నప్ప గారు వారిని అభినందిస్తూ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అభ్యర్థించారు వాటిలో ముఖ్యంగా పాఠశాల ప్రహరీ గోడ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే బాలబాలికలకు సపరేట్గా టాయిలెట్స్ మరియు త్రాగడానికి మంచినీటి సౌకర్యం అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర సమస్యలపై వారి దృష్టికి తీసుకెళ్లారు ఆరు స్పందిస్తూ త్వరలోనే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ,రవిశంకర్ మరియు ఎంఎన్ విజయకుమార్ ,విద్యా అభిమాని చాంద్ పాషా పాల్గొన్నారు సర్పంచ్ గారిని ఉపసర్పంచ్ గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది*

E-పేపర్

నంద్యాల – గుంతకల్లు మధ్య పగటి పూట రైలు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

నంద్యాల జిల్లా రైలు ప్రయాణికుల ఇబ్బందులు ఇటీవల పార్లమెంట్ వేదికగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికీ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తీసుకెళ్లారు. లోక్ సభలోనే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా మార్కాపురం రోడ్డు వరకు పగటి పూట రైలు నడుపనున్నట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం తెలిపారు. మార్కాపురం _ నంద్యాల _ గుంతకల్ రూట్ లో ప్యాసింజర్ ట్రైన్ కు రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ఈ ట్రైన్ నెంబర్(57408) మార్కాపురంలో తెల్లవారు జామున 4:30 గంటలకు ప్రారంభం అయ్యి నంద్యాలకు ఉదయం 7:20 గంటలకు చేరుకొని డోన్ మీదుగా గుంతకల్లుకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటుందనీ, ఇదే ట్రైన్ నెంబర్(57407) తిరుగు ప్రయాణంలో గుంతకల్లులో సాయంత్రం 5:30 కి ప్రారంభం అయ్యి నంద్యాల కు రాత్రి 8:30 కి చేరుకొని మార్కాపూర్ కు 10:30 గంటలకు చేరుకుంటుందనీ, త్వరలో పట్టాలు ఎక్కనున్న ఈ రైలును నంద్యాల జిల్లా ప్రజలు గుంతకల్లు వైపు పగటి పూట రైలు ప్రయాణం సద్వినియోగం చేసుకువాలని, తన విన్నపాన్ని అంగీకరించి నంద్యాల – గుంతకల్లు వైపు పగటి పూట రైలు వేసినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధన్యవాదములు తెలిపారు.

E-పేపర్

టిడిపి క్రైస్తవ నాయకులకు యేసుప్రభు వాక్యాన్ని బహుకరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఈరోజు నంద్యాలలోని వారి క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ క్రైస్తవ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ కృపాకర్, మాజీ కౌన్సిలర్ దేవరపాటి రవికుమార్ దంపతులకు మరియు 38వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గ రాముడు కు మంత్రి ఫరూక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, పవిత్ర బైబిల్ గ్రంథంలోని “ప్రభువు వాక్యాన్ని” బహుకరించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో సోదరభావాన్ని, శాంతిని పెంపొందించడంలో క్రైస్తవ పెద్దల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. తమను సాదరంగా ఆహ్వానించి, గౌరవించినందుకు క్రైస్తవ నాయకులు మంత్రి ఫరూక్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Blog

క్రిస్మస్ వేడుకలకు మంత్రి ఫరూక్ కు ఆహ్వానం

రాబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని ప్రముఖ హోలీ క్రాస్ కెథడ్రల్ (పెద్ద చర్చి) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని చర్చి ప్రతినిధులు మంగళవారం మంత్రి గారి నంద్యాల క్యాంపు కార్యాలయం నందు ఆయనను కలిసిన డియోసెస్ ప్రతినిధి బృందం, క్రిస్మస్ వేడుకలతో పాటు నంద్యాల డియోసెస్ బిషప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఐ డియోసెస్ సెక్రెటరీ ప్రభుదాస్, అసిస్టెంట్ సెక్రెటరీ స్టీఫెన్, పాస్టర్ రెవరెండ్ కొత్త మాసి జోసెఫ్, మాజీ కౌన్సిలర్ కృపాకర్ తో పాటు పలువురు పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.

E-పేపర్

మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా

నంద్యాల పట్టణ నూతన ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు చేపట్టిన చాంద్ బాషా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై చర్చించగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని మంత్రి సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.