Saturday, 7 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

వైద్యం పవిత్రమూ కాదు! వైద్యుడు దేవుడు కాదు!!

”వైద్యం చాలా పవిత్రమైనది” ”వైద్యుడు నారాయణుడితో సమానం” ఇవి వారసత్వంగా కొనసాగుతున్న భావాలు. కాలం మారుతుంది. జనం మారుతున్నారు. వారి ఆలోచనా విధానం మారుతుంది. గతంలో మాదిరి వైద్యం చెయ్యాలంటే ఏ ఆకునో, కాయనో నూరి మందుగా ఇవ్వటం కుదరదు ఇస్తే జనం ఒప్పుకోరు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంత కాలం ఉంటాయి. ఇం కొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్స రాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం. ఆపరేషను చేయాల్సిన కేసుల్లో సర్జరీ మొదలైనప్పటి నుంచి రోగి కోలుకొనే వరకూ కేవలం డాక్టరు సమర్ధతే చాలదు. సమస్య తీవ్రత, రోగి శరీరం తట్టు కొనే తీరు, మందుల ప్రభావం, వసతులు, రోగి చెల్లింపు సామర్థ్యం మొదలైనవన్నీ వాటి వాటి స్థాయిలో కలిసి రావాలి. వాస్తవ పరి స్థితి ఒక రకంగా ఉంటుంది. రోగి దాన్ని అర్థం చేసుకొనే తీరును బట్టి వారి ఆశింపు మరో రకంగా ఉంటుంది. జనానికి ఆధునిక వైద్యం కావాలి. వైద్యంలో నాణ్యత ఉండాలి. రోగి ఆసుపత్రిలో అడుగు పెట్టే సమయానికి అన్నీ అమరినట్టు ఉండాలి. బాధతో ఉన్నప్పుడు వైద్యం ఆలస్యం కాకుడదు. త్వరగా జబ్బు తగ్గిపోవాలి. ఇవి సగటు రోగి ఆశింపు. రోగి ఆశించినట్టు వైద్య సేవలు అందిం చాలంటే డాక్టరు పూర్తిగా సమర్ధుడై ఉండాలి. వైద్యాన్ని బాగా నేర్చుకోవాలి, కొత్త కొత్త పోక డల్ని నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. అందుకు వృత్తిపరమయిన ”కాన్ఫెరెన్స్‌”లకు పోతూ ఉండాలి. ఎడిషను మారినప్పుడల్లా కొత్త పుస్తకాలు మారుస్తూ ఉండాలి. జర్న ళ్ళుకు చందా కడుతూనే ఉండాలి. అన్నింటికి మించి నిరంతరం చదువుతూనే ఉండాలి. రోగం చేయటంలో ఏమయినా తేడా వచ్చి వినియోగదారుల ఫారంలో కేసు పడవచ్చు. ఇన్ని కష్టాలు పడే మాకు కష్టానికి తగ్గట్టు డబ్బులు ఫీజు రూపంలో రావొద్దూ? ఇది రోగి ఆశింపుపై సగటు డాక్టరు కామెంటు. మరో వైపు డాక్టరుకి సామాజిక బాధ్యత ఉండాలని సమాజం ఖచ్చింగా ఆశిస్తుంది. ఇంజనీర్లకు, టీచర్లకూ, లాయర్లకూ, చార్టెడు అకౌంటెట్లకూ ఇలా ఒకరనేం ఎవరికీ సామాజికి బాధ్యతని జనం గుర్తు చేయరు. ఐ.ఐ. టీ.లో, ఐ.ఐ.ఎం.లో ప్రజల డబ్బుతో చదివిన వారిని సమాజం పట్ల మీ బాధ్యత ఏమిటని ఎవరూ అడగరు. వారు సమాజం డబ్బుతో చదవరా? కేవలం డాక్టరు మాత్రమే జనం డబ్బుతో చదువుతారా? డాక్టర్లు మాత్రమే జనాల సేవలో తరించాలా? వైద్యుల మీద చర్చవచ్చిన ప్రతిసారీ డాక్టర్లు ముందుకు తెచ్చే ప్రశ్నలు ఇవి. కొన్ని వాస్తవాలు కూడా గమనించాలి. వైద్యుడిని దేవుడిగా నెత్తిన పెట్టుకొనే జనం వైద్యంలో ఎక్కడైనా తేడా వస్తే ఊరకనే వుం డరు. అదే ”దేవుడు” తిట్లు తినాలి. కొన్ని సార్లు తన్నులు తినాలి. మంచి సిటిజను అయితే ఇవేమీ చేయకుండా కోర్టుకు తిప్పుతాడు. మంచి డాక్టరుగా తయారవ్వమని ఆదేశించమని కాదు. నాకు డబ్బులు కట్టించమని. వైద్యులకూ, డాక్టర్లకూ మధ్య ఈ విధమైన వైవిధ్యాలు రావ టానికి కారణం ఏమిటంటే ”డాక్టరు-పేషంటు” మధ్య సంబం ధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోలేక పోవటమే. సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృ తిక అంశాలలో మార్పులు అని వార్యం. వాటి తో పాటే మానవ సంబంధాలు మారిపోతాయి. పూటకూళ్ళ వారి ఇళ్ళు రెస్టారెంట్లు అయినట్టు, సత్రాలు స్టారు ¬ట ళ్ళు అయి నట్టు, వైద్యాన్ని డబ్బులు తీసుకొని చేసే సేవగా గుర్తించ కుండా పవిత్రమైనదిగా, డాక్ట రును దేవు డిలా, దయామయుడిలా, శాంత మూర్తిగా, రోగ పీడత దరిద్ర నారాయణులను ఆదుకొనే అవ తార మూర్తిగా భావించి నైతిక తను ఆశిస్తే ఎలా కుదురుతుందీ? జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధ తులు మారి, వైద్యానికి సంబంధించి మగతా అన్ని మారినా వైద్యుల్ని చూడటంలో జనం ఆలోచనలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుకే జనం ఆశింపుకూ, వైద్యుల ప్రవర్తనకూ మధ్య అంత అంతరం. మారిన కాలంతోపాటు. డాక్టర్లూ మారు తారు. వారు చేసే వైద్యమూ మారుతుంది. దానికి తగ్గ ఖర్చూ పెరుగుతుంది. మార్పులన్నీ సామాజంలో వచ్చే మొత్తంలో భాగంగానే వుం టుంది. ఈ దృష్టిలో ఉంచుకొని డాక్టరు- పేషంటు సంబంధాన్ని చూస్తే వారి మధ్య సంబంధాలు సజావుగానే ఉంటాయి. లేదంటే పరస్పరం అనుమానంతోనే కలిసి నడవాలి. మిగతా వారిని వదిలేసి డాక్టర్ల నుండి మాత్రమే సామాజిక బాధ్యతను ఆశించటంలో మరో కనపడని కోణం కూడా ఉంది. అదేమి టంటే రోగం వ్యక్తిని ప్రత్యక్షంగా బాధకు గురి చేస్తుంది. దాన్నుండి విముక్తి పొందాలంటే డాక్ట రుతో ప్రత్యక్ష సంబంధం అవసరం. అలాగే ప్రత్యక్ష చెల్లిపు కూడా చెయ్యాలి. ఆ చెల్లింపు మనసులో ”ఆయిష్టమైన చెల్లింపు” ఎలానో చూద్దాం. రోగం రావటం ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా రాకుండా ఉండవు. వచ్చాక వైద్యం చేయించుకోవటమూ తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చక పోయినా డాక్టరు దగ్గరకో, ఆసుపత్రికో వెళ్ళి చూపించుకొని వైద్యం చేయించు కోవాలి. అంటే జబ్బున పడ్డప్పుడు డాక్టరు-రోగి సంబంధం అనివార్యమూ, అవసరము. మనిషి అవసరాలు మొత్తం రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం మన కు కావాల్సినవి, మనం ఇష్టపడేవి, మనకు ఆనం దాన్ని ఇచ్చేవి. వీటికోసం మనమే వెంపర్లా డుతాం. ఖరీదు అయిన టీవీని కొనటం, ఆరు రెట్లు ఎక్కువ ధర చెల్లించి మనకు నచ్చిన హీరో సినిమా టికెట్టును బ్లాకులో కొనటం, దాహం వేసినప్పుడు కోకకోలా తాగటం, మందు తాగటం. ఇవి ఇష్టమైన అవసరాలు కాబట్టి ఎంత ఖర్చు అయిందనే దానితో లెక్క లేదు. రెండో రకం అవసరాలు మనకు ఇష్టం లేనివి. ఇష్టం లేకపోయినా అవసరం కాబట్టి అవి తీరాలి. కోర్టులో కేసు, రోగం వచ్చినప్పుడు వైద్యం. ఇవి వచ్చాయి కాబట్టి అవసరాలు అవుతాయికానీ నిజానికి మనమేం కోరుకోలేదు. ఇందులో లోతుపాతులు మనకు తెలియదు కాబట్టి నిపుణుల సహాయం తప్పని సరిగా కావాలి. వారికి డబ్బు చెల్లించాలి. కాబట్టి వీటి మీద ఖర్చు పెట్టటానికి అయిష్టంగానే ఉంటుంది. నెలకు పదివేల రూపాయలు ఆలో చించకుండా ‘మందు’కు ఖర్చుపెట్టే వ్యక్తి దాన్ని మానటానికి వైద్యం చేసిన డాక్టరు బిల్లు అయిదు వేలు కట్టటానికి మనసు ఒప్పదు. దీనికి ఇంత అవుద్దా అని ధర్మ సందేహం. డాక్టరు ఎక్కువ లాగుతున్నాడని లోలోన మధనం. డాక్టర్లు ఊరికే సంపాదిస్తున్నారని నింద. డాక్టర్లకు మానవత్వం లేదని కామెంట్లు. తీవ్రంగా గాయ పడ్డప్పుడు వైద్యం చేయిం చుకోకపోతే ప్రాణం పోతుందనే భయం. తక్షణ ఆపద్బాంధవుడు డాక్టరు ఎక్కడా? త్వర గా రాడే? ఆ పరిస్థితిలో, ఆ సమయంలో రోగి ఆక్రందన అలా వుంటుంది డాక్టరు వచ్చాడు. వైద్యం జరుగుతూ వుంది. ఫరవాలేదు. ఇప్పుడు బాగుంది. ”బిల్లు ఎంత అవుతుందో?” రోగి అను మానం. రోగం తగ్గింది. బిల్లు చేతికి వచ్చింది. అది ఎంతైనా ఉండనీ! ”అమ్మ బాబోయ్‌ ఇంతా? ఈ డాక్టర్లుకు కరుణ లేదు. దారుణంగా దోచేసుకుంటు న్నారు” ఏం పెద్ద ఊడబొడిచారనీ” ఇవి జబ్బు నయం అయ్యాక, సగటు రోగి ఆలోచనలు. దీనికి కారణం ఇష్టం లేని ‘అవసరం’ కోసం చెల్లిం చాల్సి రావటమే. అందుకేే రోగికి డాక్టరు, ప్రాణం పోయేట ప్పుడు దేవుడుగానూ, రోగం తగ్గేటప్పుడు స్నేహి తుడిగా, బిల్లు కట్టించుకొనేటప్బుడు యముడిలా కనిపిస్తాడని ఒక ఆధునిక నానుడి పుట్టుకు వచ్చింది.చేయించుకున్న వైద్యానికి బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు రోగి మనసులో ”అవసరము- అయిష్టత” పునాదిగా ఆలోచిస్తారు. మారిన సామాజిక నేపథ్యంలో వైద్యం చేసే డాక్టరు ”సేవ-ప్రతిఫలం” అనే ఆలోచనల పునాదిగా ఫీజును ఆశిస్తాడు. ఈ రెండింటి మధ్య పొంతన ఎంత చెడిపోతే డాక్టరు-రోగి మధ్య సంబంధం కూడా అంతగా దెబ్బ తింటుంది. రోగి-డాక్టరు మధ్య సంబంధాలను వ్యా పార సంబంధాలుగా పరిగణించి ”వినియోగ దారుల చట్టం” పరిధిలోకి తెచ్చాక కూడా ”సేవ- దయ” అనే పాత పునాదుల పై నుండి వైద్యాన్ని చూడటం సరికాదు. ”సేవకు తగ్గ చెల్లింపు” రోగికి ఉండాలి. అలాగే ”చెల్లించిన దానికి నాణ్యమైన సేవ”ను డాక్టర్లు అలవరుచు కోవాలి. అంటే రోగి మంచి వినియోగదారుడై ఉండాలి. డాక్టరు నమ్మకమైన, నాణ్యత అందించగల ”సర్వీసు ప్రొవైడరు” అయి ఉం డాలి. సేవకు తగ్గట్టు చెల్లించని మనస్తత్వం రోగికి ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో దాన్ని రాబట్టుకొనే విధంగా వైద్యులు ఉంటారు. వైద్యం అనే రైలు నడవాలంటే దానికి రోగి- వైద్యుడు రెండు పట్టాల్లాంటి వారు. ఒక పట్టా అదుపు తప్పి, రెండో దాన్ని అదుపు తప్ప కుండా బాగుండమని ఆశించటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వినియోగదారుడు వైద్యుల పట్ల తమ దృక్పధం మార్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి., 1. వైద్య వృత్తి పవిత్రమయినది కాదు. కట్టిన డబ్బుకు అందించే వినిమయ సేవ మాత్రమే. 2. డాక్టరు గొప్పవాడేం కాదు. అన్నీ పనుల్లో నిపుణులు ఉన్నట్టే డాక్టరు కూడా కేవలం వృత్తి నిపుణుడు మాత్రమే. 3. డాక్టర్లంతా మేధావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు వుంటారు. 4. డాక్టరు చదువును దృష్టిలో ఉంచుకొని వైద్యం నాణ్యతను ఆశించాలి. ప్రతి డాక్టరుకు అన్నీ తెలిసి ఉండవు. 5. ఒకే డిగ్రీ చదివిన స్పెషలిస్టులకు మధ్య కూడా నక్కకూ, నాగలోకానికి మధ్య వున్నంత తేడా వుంటుంది. 6. సమాజంలో ఉండే అన్నీ రుగ్మతలు వైద్య వ్యవస్థలోనూ, వైద్యుల్లోనూ ఉంటాయి. 7. ప్రభుత్వ డాక్టర్లు ధర్మంగానో, దయతోనో వైద్యం చేయటం లేదు. వారికి ప్రజల తరుఫున ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. డాక్టర్‌ పి. శ్రీనివాసతేజ, నెల్లూరు

Featured

నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు ఆ పేరెలా వచ్చింది?

నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు ఆ పేరెలా వచ్చింది దాదాపు వెయ్యేళ్ల కిందటే ముత్తుకూరు ఒక ప్రసిద్ధ గ్రామం. సమీపాన వున్న కృష్ణపట్నం రేవు ద్వారా ముత్తుకూరుకు ఎంతో ప్రాధాన్యం వుండేది. ముత్యాల ఎగుమతి జరగడం వలన ఆ వూరికి ఆ పేరు వచ్చిందంటారు. 13వ శతాబ్ధంలో సింహపురిని ఏలిన మనుమసిద్ధి తండ్రికి ‘గండగోపాల’ అనే బిరుదు వుండేది. ఆయన కాలంలోనే సిద్ధేశ్వరాలయం నిర్మించబడింది. మనుమసిద్ధి కాలంలో అభివృద్ధి పరచబడి, మనుమసిద్ధేశ్వరాలయం అయ్యింది. కృష్ణపట్నాన్ని అప్పట్లో గండగోపాలపట్నం అని కూడా పిలిచేవారు. ప్రాచీన కాలంలో కృష్ణపట్నానికి  ‘కొల్లితురై’ అనే పేరుండేది. తురై అంటే రేవుపట్నం. దీన్ని బట్టి ముత్తుకూరు, దాని పరిసరాలు ప్రాచీనకాలంలోనే ఎగుమతులు, దిగుమతులకు ఆలవాలమై విదేశీ వ్యాపారానికి పేరెన్నికగన్నవని చెప్పవచ్చు. ప్రస్తుతం ముత్తుకూరుకు కూతవేటు దూరంలో ప్రపంచంలో గొప్ప రేవుపట్టణాలలో ఒకటిగాను, మన రాష్ట్రంలో ఆర్థిక వనరులను సృష్టించేందుకు నెంబర్‌ వన్‌గాను కృష్ణపట్నం ఓడ రేవు వెలుగొందుతుంది. కృష్ణపట్నం వలనే ప్రస్తుతం ముత్తుకూరుకు ప్రపంచ స్థాయి ప్రాధాన్యత సంతరించుకుంది.

Featured హెల్త్ టిప్స్

ఫోన్‌ వాడకంతో సరికొత్త జబ్బులు? నోమో ఫోబియా లక్షణాలు మీలో ఉన్నాయా? మానసిక రోగుల లిస్టులో చేర్చాలా? వద్దా?

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ల యుగం నడుస్తోంది. అదే ఇప్పుడు సరికొత్త జబ్బులకు కారణమవుతోంది. చేతిలో సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోవడాన్నే నో మొబైల్‌ ఫోన్‌ ఫోబియా అని వైద్యులు చెబుతున్నారు. యువకులు, ఉద్యోగులు, బిజినెస్‌ పర్సన్స్‌ లో ఈసమస్య అధికంగా ఉన్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. మొన్నటి వరకు విదేశాలకే పరిమితమైన ఈ సమస్య మనదేశంలోనూ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రేమ జంటలపై ప్రభావం చూపుతోంది. నో మొబైల్‌ ఫోన్‌ ఫోబియా అంశం ఐదేళ్ల క్రితమే గుర్తించారు. గతంతో పోలిస్తే.. ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో 66 శాతం మంది ఇప్పుడు నోమో ఫోబియా బారినపడుతున్నారు. నోమో ఫోబియా ఉన్నవారు ఫోన్‌ ను ఒక్కసారి కూడా స్విచ్ఛాఫ్‌ చేయరట. బాత్‌ రూమ్‌కి వెళ్లిన ఫోన్‌ను వదలరట. ఫోన్‌ రింగ్‌ కాకపోయిన అయినట్టు భ్రమపడతారట. సాధారణ వినియోగదారుల కంటే కొందరు మొబైల్‌ఫోన్‌కు దూరమై బతకలేమంటున్నారు.. కొందరు ఫోన్‌ దూరమైతే తీవ్ర డిప్రెషన్లోకి వెళతామంటున్నారు. మానసిక సమస్యల జాబితాలో ఈ సమస్యను కూడా చేర్చాలా వద్దా అన్నదానిపై చర్చ మొదలైంది. మొబైల్‌ వినియోగదారుల్లో నోమో ఫోబియా ఉందో లేదో తెలుసుకునేందుకు అమెరికాలో పూర్తిస్థాయి పరిశోధకులు కూడా మొదలయ్యాయి. ఈ సందర్భంగా కొంత మంది మేధావులు ఫోను వాడడం తప్పు అని మాత్రం అనడం లేదు. ఏ మేరకు ఉపయోగించాలో ఉపయోగించుకుంటూ కనీసం రాత్రి పడుకునేటప్పుడు ఒక మంచి పుస్తకాన్ని చదవడం, చదివిన విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి భోజన సమయంలో చర్చించుకోవడం, మిత్రులు కలిసినప్పుడు పై విషయాలను చర్చించడం, తను పాటించడం మంచిదని సలహా ఇస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.