అన్నమయ్య
రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు చిట్వేల్ మండలంలో ఘన స్వాగతం లభించింది. గురువారం మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు ఆహ్వానం మేరకు ప్రసాద్ బాబు తొలిసారిగా వారి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి రాజకీయాలు, పార్టీ పటిష్టతపై కీలక భేటీ జరిగింది.భేటీలో నాగార్జున నాయుడు గారు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా విపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. మండలంలోని పలు రాజకీయ అంశాలను, పరిష్కరించాల్సిన సమస్యలను అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రసాద్ బాబు సానుకూలంగా స్పందిస్తూ.. “ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. మండలంలో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు త్వరలోనే చిట్వేల్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రసాద్ బాబు ప్రకటించారు. ఆ సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేస్తామని తెలిపారు. కొత్త పాత కలయికతో రాజంపేట పార్లమెంట్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు లారీ సుబ్బారాయుడు, బొక్కసం చలపతి, ఆకేపాటి వెంకట రెడ్డి, మద్దిన కోటయ్య నాయుడు, మాచినేని సుబ్బారామయ్య, మించల బాలకృష్ణ యాదవ్, పగడాల వెంకటేష్, బాలు రెడ్దియ్య, బండారు శివప్రసాద్, రాయిన సుబ్బారాయుడు, నంద్యాల ధనంజయ, కాకర్ల కోటేశ్వరరావు, తుంగా చంద్రశేఖర్, పగడాల శివ, కట్టా గిరి బాబు, గూడూరు నాగరాజు, మోసాటి సుబ్రహ్మణ్యం, కస్తూరి శివ, రాయపు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.