Friday, 3 April 2026

Blog

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత’

‘ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని.. 99 రోజుల ప్రణాళిక మొదలుపెట్టిన రోజునే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డికి ముఖంమీదే చెప్పినట్టుగా తెలిసింది. తాము గ్రామసభలకు వెళ్లలేమని, ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించే పరిస్థితులే లేవని తేల్చిచెప్పినట్టు సమాచారం. ప్రభుత్వపరంగా మనం ఏదో చేశామని గొప్పగా చెప్తున్నప్పటికీ అవేవీ ప్రజలకు చేరడం లేదని, ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తేల్చిచెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా రైతుభరోసా పంపిణీ, యూరియా కొరత, పంటల కొనుగోలు, పింఛన్ల పెంపు వంటి అంశాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పినట్టు తెలిసింది. సీఎంకు చెప్పినట్టుగానే ఎక్కువ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామసభలకు దూరంగా ఉండటం గమనార్హం.

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

గ్రామ సభల్లో చాలా చోట్ల అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకాలు

పథకాలపై నిలదీసిన ప్రజలుప్రజాపాలన సభల సాక్షిగా కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత పెల్లుబికింది. ఎక్కడికక్కడ ప్రజలంతా కలిసి ప్రజా ప్రతినిధులను నిలదీశారు. పథకాలు ఏవి? యూరియా ఏది? రైతుభరోసా ఏది? అంటూ అన్ని సభ ల్లో ప్రశ్నల వర్షం కురిసింది. వాస్తవానికి 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్‌ 2న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమా లు, అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 2 నుంచి అమలు చేపట్టబోయే కొత్త పథకాలను సైతం ప్రజలకు వివరించాలని సూచించింది. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలంతా హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వం ఒకటి తలిస్తే ప్రజలు మరోలా అమలుచేశారు. ఈ సభలే వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, పథకాలు ఎందుకు అమలు చేయడంలేదు? అంటూ పలుచోట్ల ఘెరావ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు రూ.2,500 హామీ ఎందుకు అమలు చే యడం లేదు? పింఛన్లు రూ.4వేలకు ఎప్పుడు పెంచుతారు? అంటూ నిలదీశారు. యూరి యా దొరుకక గోస పడుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు లేని యూరియా తిప్పలు ఇప్పుడే ఎందుకు వస్తున్నదంటూ నిలదీశారు. కొత్త పథకాల అమలు ఏమోగానీ ఉన్న పథకాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

తూర్పు గోదావరి

బాధలో ఉన్నవారికి భరోసా – మానవత సేవా సంస్థ ముందుకు

తాళ్లపూడి,( తూర్పుగోదావరి,పున్నమి ప్రతినిధి) ఏప్రిల్ 2 : లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న తాళ్లపూడి వాసి ఇర్లపాటి గంగారత్నంకు మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవడమే మానవత సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య మరియు వైద్య రంగాల్లో సేవలందించేందుకు సంస్థ అధికంగా ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. గెడ్డం సాయిబాబా మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని అన్నారు. సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, దుగ్గిరాల సూర్యనారాయణ, గెడ్డం సాయిబాబా, చెరుకు ఆంజనేయులు, కొప్పాక వెంకటేశ్వరరావు, కోదాటి సత్యనారాయణ, ఇర్లపాటి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వేగేశ్వరపురం పంచాయతీ పాలకవర్గానికి ఘన వీడ్కోలు

పున్నమి ప్రతినిధి,తాళ్లపూడి,(తూర్పుగోదావరి), ఏప్రిల్ 2: వేగేశ్వరపురం గ్రామ సచివాలయం-1లో వేగేశ్వరపురం పంచాయతీ పాలకవర్గం పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పదవీ కాలం పూర్తిచేసుకున్న పంచాయతీ వార్డ్ మెంబర్స్‌ను సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు సత్కరించి, వారి సేవలను కొనియాడారు. గ్రామాభివృద్ధికి వారు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావును కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శీర్ల బ్రహ్మానందం, బత్తిని నాగు, కాళ్ల రమణ, నున్న కృష్ణ, తైలం పోసయ్య, భగవాన్ అప్పాజీ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ తైలం జైయేసు, తైలం ప్రసాద్, శీర్ల నాగు, తైలం సత్యవతి, ముమ్మిడివరపు మదన్, ఎంపిటిసి లక్ష్మణరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి, గ్రామ ప్రజల మధ్య ఐక్యతను ప్రతిబింబించింది.

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థపై గ్రామ ప్రజల ఏకగ్రీవ తీర్మానం

ముస్తాబాద్ ఏప్రిల్ 3 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు నిర్వహించిన గ్రామసభ సమావేశంలో. గ్రామ ప్రజలు సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ,(CESS Ltd) పై ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. గత అనేక సంవత్సరాలుగా మా ప్రాంతానికి నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి. మరమద్యాల పరిశ్రమలకు మరియు గృహ వినియోదారులకు విశేషమైన సేవలు అందిస్తోంది. ఈ సంస్థ సహకార విధానంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించబడుతూ. అవంతరాలు లేని నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన సేవలు అందిస్తూ గ్రామీణ మరియు పరిశ్రమకు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది . ఈ నేపథ్యంలో. ఈ సంస్థను రద్దు చేయడం వల్ల స్థానిక ప్రజలు.ముఖ్యంగా వ్యవసాయదారులు. మరమద్గాల పరిశ్రమలు (పవర్ లూమ్) తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ గ్రామసభ లో సహకార విద్యుత్ పంపిణీ సంస్థ సిరిసిల్ల (CESS Ltd) ఎట్టి పరిస్థితిలోనూ రద్దు చేయకూడదు ఈ సంస్థను కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాము. ఈ తీర్మానాన్ని సంబంధిత ఉన్న అధికారులకు తద్వారా ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీటీ సునీత వెంకట నర్సింగా రావు. పంచాయతీ సెక్రెటరీ. వార్డ్ మెంబర్లు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

అనకాపల్లి

ఆమరావతి చట్టబద్ధతకు సంబరాలు – హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 2 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఆమరావతి రాజధాని చట్టబద్ధతకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో జెండాలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ర్యాలీ కొనసాగింది. ఆమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.

Featured News Updates పశ్చిమ గోదావరి

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతి .. ఎమ్మెల్యే అంజిబాబు

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధాని అమరావతి అని, 5 కోట్ల ప్రజల ఆకాంక్ష .. అమరావతి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో గురువారం రాత్రి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు, పట్టణ ప్రజలతో సంబరాలను నిర్వహించారు. బాణా సంచా కాల్పులతో .. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో ప్రకాశం చౌక్ సెంటర్ అంతా మారుమ్రోగింది. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం రాజధాని అమరావతి అని, ఇది ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్‌ సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమన్నారు. అమరావతి ఇక అజేయం, అజరామరమని, స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి అని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, రైతుల త్యాగాలకు (33,000 ఎకరాల భూసమీకరణ) దక్కిన చారిత్రాత్మక విజయమని అన్నారు. వైసీపీ నాయకులు ఏదో చేస్తామంటే ఏమి మారాదని, శాశ్వత రాజధాని అమరావతి అని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమరావత్ రాజధానిగా ఎన్నికవడం శుభ సూచకమని, జై అమరావతి అని అన్నారు. అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్‌ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైందని, ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం జై అమరావతి జై జై అమరావతి అంటూ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా చిమ్నివరల్డ్ ఎ స్మార్ట్ కిచెన్ షోరూం ప్రారంభం

తిరుపతి, ఏప్రిల్ 2 పున్నమి ప్రతినిధి మహిళలు నచ్చేలా మెచ్చేలా.. మన్నిక.. నాణ్యత.. సౌలభ్యత చిమ్నే వరల్డ్ ఎ స్మార్ట్ కిచెన్ సొంతమని ఇటువంటి షోరూం తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని పేర్కొన్నారు. గురువారం తిరుపతి ఎంఆర్ పల్లి పోలీస్ సమీపంలో చిమ్నే వరల్డ్ ఎ స్మార్ట్ కిచెన్ షోరూం ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి షోరూమ్ అందుబాటులోకి రావడం తిరుపతి ప్రజలకు గర్వకారణం అన్నారు. ఇంటికి కావాల్సిన కిచెన్ వస్తువులన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటం మహిళలకు ఎంత సౌకర్యంగా ఉంటుందన్నారు. మంచి నాణ్యమైన కిచెన్ సామాగ్రిని సరసమైన ధరలతో ప్రజలకు అందుబాటులోకి రావడం శుభ పరిణామం అన్నారు. రామచంద్ర పురానికి చెందిన హేమంత్, వంశీ లు నూతనంగా ఈ వ్యాపారం లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వారు వ్యాపారం లో దినదినాభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా షోరూం అధినేతలు హేమంత్, వంశీ ఎమ్మెల్యేని ఇతర అతిథులను ఘనంగా సత్కరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం – గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 2 (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు డిసిసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మనుబోలు మండలం అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారిని సన్మానించారు. 12 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. వైసిపి హయాంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను హైకోర్టు స్టేతో కాపాడి పదోతరగతి వరకు విస్తరించామని పేర్కొన్నారు. గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

ఉత్సాహంగా మరిపెడ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర🚩🚩

హనుమాన్ జయంతి పురస్కరించుకొని మరిపెడ పట్టణంలో ఘనంగా శోభయాత్రను జై హనుమాన్ జైశ్రీరామ్ జైశ్రీరామ్, శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ హనుమా జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ నినాదాలతో పట్టణవాసులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు🚩🚩 🙏 యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృత మస్తకాంజలిమ్‌ |బాష్పవారి పరిపూర్ణ లోచనమ్‌మారుతిం నమత రాక్షసాంతకమ్‌ ||శ్రీ హనుమాన్ విజయోత్సవ పర్వదిన శుభాకాంక్షలు 🚩#JaiHanuman

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.