గౌరవ జిల్లా ఎస్.పి. L.సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు, ఈరోజు శ్రీకాళహస్తి డి.ఎస్.పి. గారి అధ్యక్షతన, సి.ఐ. బి.ఎన్. కండ్రిగ మరియు ఎస్.ఐ. బి.ఎన్. కండ్రిగ గారి ఆధ్వర్యంలో బి.ఎన్. కండ్రిగ పోలీస్ స్టేషన్ నందు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, విద్యార్థులు మరియు ప్రజలతో విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో రాబోయే శ్రీ వినాయక చవితి పండుగను శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా మరియు చట్టబద్ధంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలు, సంబంధిత…