Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన నాయకుల ఘన సన్మానం.. మంత్రి నాదెళ్ల మనోహర్ అభినందన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జనసేన నాయకుల ఘన సన్మానం.. మంత్రి నాదెళ్ల మనోహర్ అభినందన

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి) విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో మనుబోలు మండలానికి చెందిన పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
  • 2021లో ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులను మంత్రి నాదెళ్ల మనోహర్ ఘనంగా సన్మానించి అభినందించారు.
  • ఈ సందర్భంగా పార్టీ నాయకులతో ఆత్మీయంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి)
విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో మనుబోలు మండలానికి చెందిన పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2021లో ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులను మంత్రి నాదెళ్ల మనోహర్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో ఆత్మీయంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *