వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
వైభవంగా మరిపెడ అయ్యప్ప స్వామి ఆలయ 27వ వార్షికోత్సవం!
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన మరిపెడ.. భక్తులతో కిక్కిరిసిన ప్రధాన వీధులు
మరిపెడ బంగ్లా:
మరిపెడ మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 27వ వార్షికోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పట్టణ ప్రధాన వీధుల గుండా వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు.
ఊరేగింపు సందర్భంగా భక్తుల అయ్యప్ప నామస్మరణలు, భక్తి గీతాలు, డీజే పాటలు, నృత్యాలతో మరిపెడ మండల కేంద్రం ఆధ్యాత్మిక సందడితో మార్మోగింది. స్వాములు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, భక్తి భావంతో ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వీధులన్నీ అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోగా, స్వామివారి ఊరేగింపును వీక్షించేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 27 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తుల ఐక్యతకు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ఆకాంక్షించారు.
స్వామియే శరణం అయ్యప్ప!
పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.
Uploaded Video:



వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్