వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
విశాఖపట్నం, అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఉంటుందని సౌత్ సబ్‌జోన్ ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ గణేష్, వాసు నాయుడు తెలిపారు.
ర్యాలీలు, సభలు, మైక్‌లు, ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని, ఇందుకోసం గాజువాక, అగనంపూడి జోన్లలో సింగిల్ విండో కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచడంతో పాటు గాజువాక వై-జంక్షన్ వద్ద ఎస్‌ఎస్‌టీ, ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల స్వాధీనం, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Uploaded Video:

