Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

సముద్రాల గ్రామంలో కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు.. తరలివచ్చిన మహిళలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సముద్రాల గ్రామంలో కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు.. తరలివచ్చిన మహిళలు

వార్త ముఖ్యాంశాలు

  • ​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక మరియు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి.
  • ఈ వేడుకల్లో గ్రామానికి చెందిన మహిళలు, యువతులు, పెద్దలు అలాగే పిల్లలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా తరలివచ్చి పాలుపంచుకున్నారు.
  • ​గ్రామీణ సంప్రదాయాలు, మన సంస్కృతి ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ సందడి చేశారు.

​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక మరియు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామానికి చెందిన మహిళలు, యువతులు, పెద్దలు అలాగే పిల్లలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా తరలివచ్చి పాలుపంచుకున్నారు.
​గ్రామీణ సంప్రదాయాలు, మన సంస్కృతి ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ సందడి చేశారు. రాత్రి సమయాన ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ కాంతులు, హై-లైటింగ్ వెలుగుల మధ్య గ్రామంలో పండుగ శోభ మరింత అదనపు కళను సంతరించుకుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ వేడుకల్లో గ్రామస్థులందరూ ఎలాంటి భేదభాషవాలు లేకుండా ఉత్సాహంగా పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సాంస్కృతిక వేడుక గ్రామస్థుల మధ్య ఐక్యతను, అన్యోన్యతను చాటుతూ అత్యంత అట్టహాసంగా ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *