అనంతసాగరం అక్టోబర్ 07,పున్నమి ప్రతినిధి :
అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లి పంచాయతీ పరిధిలో పారిశుధ్యం అధ్వానంగా తయారయింది. డ్రైనేజీలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో మురుగు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతొంది.దీనిపై సెప్టెంబర్ 22,25 తేది పున్నమి పత్రికలో”పాతదేవరాయపల్లిలో పడకేసిన పారిశుధ్యం… పట్టించుకోని అధికారులు”అనే కథనం ప్రచురణ చేసింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు ఎట్టకేలకు గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని డ్రైనేజీలలో పూడికతీత పనులు చేపట్టారు.దింతో గ్రామ ప్రజలు అధికారులకు, పున్నమి పత్రికకు ధన్యవాదములు తెలిపారు.
