బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం మధ్యాహ్నం సర్వోన్నత న్యాయస్థానంలో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ఢిల్లీలోని సీనియర్ న్యాయ నిపుణులు, అడ్వకేట్లతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. బీసీల హక్కుల పరిరక్షణకు, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని రకాల న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. బీసీల ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం ఈ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో తన వాదనలను బలంగా వినిపించనుంది.
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కూటమి ప్రభుత్వం