Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాయిదా వేసినా.. తీర్పు తప్పలేదు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వాయిదా వేసినా.. తీర్పు తప్పలేదు!

బట్టేపాడు ఎస్‌ఎంసీ ఎన్నికలో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థుల విజయం

ఎన్నిక వాయిదాపై వైఎస్సార్సీపీ నాయకుల విమర్శలు

ఆత్మకూరు, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి):తమకు అనుకూలంగా ఫలితం రాదన్న కారణంతో ఎన్నికను వాయిదా వేయించినా.. చివరకు తల్లిదండ్రుల ఓటు ముందు ఆ ప్రయత్నం నిలవలేదని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. బట్టేపాడు ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికలో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థులు విజయం సాధించడంతో పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికల్లో తల్లిదండ్రుల తీర్పు కీలకమని మరోసారి స్పష్టమైందని తెలిపారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఆత్మకూరు స్వాతి, వైస్‌చైర్మన్‌గా ఆత్మకూరు రమ్య ఎన్నికయ్యారు.
తమకు అనుకూలమైన అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదనే కారణంతోనే ఎన్నికను గతంలో వాయిదా వేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. అయితే ఎన్నికను తిరిగి నిర్వహించడంతో తల్లిదండ్రులు తమ ఓటు ద్వారా స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించారని అన్నారు.వైఎస్సార్సీపీ నాయకుడు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి బలపర్చిన ఆత్మకూరు స్వాతి చైర్మన్‌గా ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికను వాయిదా వేయడం ద్వారా ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చనే ధోరణికి తల్లిదండ్రులు తమ ఓటుతో సమాధానం చెప్పారని నాయకులు పేర్కొన్నారు.అధికారం ఎవరి చేతిలో ఉన్నా ప్రజల తీర్పే అంతిమమని, పాఠశాల నిర్వహణ కమిటీల్లో రాజకీయ జోక్యానికి తల్లిదండ్రులు తావివ్వరని ఈ ఫలితం వెల్లడించిందన్నారు. ఎస్‌ఎంసీ కొత్త కమిటీ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *