Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

తేలికపాటి వర్షానికే జలమయమైన బురుజుపల్లి రోడ్డు (సోమల – కందూరు మార్గంలో నిలిచిన వర్షపు నీరు: తీవ్ర ఇబ్బందుల్లో రాకపోకలు)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తేలికపాటి వర్షానికే జలమయమైన బురుజుపల్లి రోడ్డు (సోమల – కందూరు మార్గంలో నిలిచిన వర్షపు నీరు: తీవ్ర ఇబ్బందుల్లో రాకపోకలు)

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లిమంద (సోమల), అక్టోబర్ 01 (పున్నమి న్యూస్ ప్రతినిధి): సోమల మండలంలోని నెల్లిమంద పంచాయతీ పరిధిలో గల బురుజుపల్లి వద్ద సోమల – కందూరు ప్రధాన రహదారిపై తేలికపాటి వర్షానికే భారీగా నీరు నిలిచిపోయింది.
  • గురువారం కురిసిన చిరుజల్లులకే రోడ్డు చెరువును తలపిస్తూ మురుగునీటితో జలమయమైంది.
  • సరైన డ్రైనేజీ వ్యవస్థ, కాలువల ద్వారా నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో వర్షపు నీరంతా ప్రధాన రహదారిపైనే నిలిచిపోతోంది.

నెల్లిమంద (సోమల), అక్టోబర్ 01 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
సోమల మండలంలోని నెల్లిమంద పంచాయతీ పరిధిలో గల బురుజుపల్లి వద్ద సోమల – కందూరు ప్రధాన రహదారిపై తేలికపాటి వర్షానికే భారీగా నీరు నిలిచిపోయింది. గురువారం కురిసిన చిరుజల్లులకే రోడ్డు చెరువును తలపిస్తూ మురుగునీటితో జలమయమైంది.
సరైన డ్రైనేజీ వ్యవస్థ, కాలువల ద్వారా నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో వర్షపు నీరంతా ప్రధాన రహదారిపైనే నిలిచిపోతోంది. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా మురుగునీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో దోమలు వ్యాపించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత కాలువ నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *