ఘనంగా అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలు
పలమనేరు, అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి ) : భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్ నందు మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా మైనారిటీ మోర్చా చిత్తూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముబారక్ మాట్లాడుతూ…
“భారతదేశ మిస్సైల్ మ్యాన్ అయిన అబ్దుల్ కలాం ఆశయాలను సాధించడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు. కలాం గారిని దేశ రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు.. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శరవణ మాట్లాడుతూ…”ప్రతి ఒక్క విద్యార్థి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుని, తమ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడాలన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా నాయకులు ముస్తక్ అహ్మద్, అస్లాం భాష, తబ్బుసుం, మహబూబ్ బాషా, ముఖ్తియార్ హుస్సేన్, ఇమ్రాన్, సంగటి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


