గాజువాక, సెప్టెంబర్ 29: పాతగాజువాక కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం చుట్టూ స్టీల్ రైలింగ్, గ్రీనరీ, టైల్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని బీజేపీ యువమోర్చా గాజువాక ఇంచార్జి జాగరపు శ్రీను కోరారు. ఈ మేరకు గాజువాక జోనల్ కమిషనర్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా 88వ వార్డు సనత్‌నగర్ నుంచి వుడా కాలనీకి వెళ్లే మార్గంలో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే లైట్లను పునరుద్ధరించాలని కోరారు. గాంధీ విగ్రహం అభివృద్ధిపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించడంపై జాగరపు శ్రీను ధన్యవాదాలు తెలిపారు.




