ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, ప్రజలకు కల్పిస్తున్న మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సభ విజయవంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
