Sunday, 23 August 2026
  • Home  
  • మానవత్వానికి మారుపేరుగా నిలిచిన పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు….
- సత్యసాయి

మానవత్వానికి మారుపేరుగా నిలిచిన పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు….

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు తన మానవీయ కోణంతో మరోసారి అందరి మన్ననలు అందుకున్నారు. వివాహ కార్యక్రమాలు,గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని,తిరిగి పుట్టపర్తిలోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో, స్విమ్మింగ్ పూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని శ్రీధర్ రెడ్డి గారు గమనించారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపి,క్షతగాత్రుల వద్దకు స్వయంగా వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.ఏమాత్రం సమయం వృథా చేయకుండా,తన కాన్వాయ్‌లోని రెండు వాహనాలను ఉపయోగించి బాధితులు ఇద్దరిని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుల బంధువులు ఆసుపత్రికి చేరుకునే వరకూ అక్కడే ఉండి, వారికి అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని మరోసారి నిరూపించిన శ్రీధర్ రెడ్డి గారిని స్థానికులు, ప్రజలు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు.అధికారంలో ఉన్నా,లేకున్నా ప్రజాసేవే పరమావధిగా భావించే నాయకులు నేటికీ ఉన్నారని దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు నిరూపించారు.

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు తన మానవీయ కోణంతో మరోసారి అందరి మన్ననలు అందుకున్నారు. వివాహ కార్యక్రమాలు,గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని,తిరిగి పుట్టపర్తిలోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో, స్విమ్మింగ్ పూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని శ్రీధర్ రెడ్డి గారు గమనించారు.

ప్రమాదాన్ని గమనించిన వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపి,క్షతగాత్రుల వద్దకు స్వయంగా వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.ఏమాత్రం సమయం వృథా చేయకుండా,తన కాన్వాయ్‌లోని రెండు వాహనాలను ఉపయోగించి బాధితులు ఇద్దరిని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుల బంధువులు ఆసుపత్రికి చేరుకునే వరకూ అక్కడే ఉండి, వారికి అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని మరోసారి నిరూపించిన శ్రీధర్ రెడ్డి గారిని స్థానికులు, ప్రజలు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు.అధికారంలో ఉన్నా,లేకున్నా ప్రజాసేవే పరమావధిగా భావించే నాయకులు నేటికీ ఉన్నారని దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు నిరూపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.