Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జయశంకర్ భూపాలపల్లి

దివ్య కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దివ్య కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్

వార్త ముఖ్యాంశాలు

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కోశాధికారి జినుకల శ్రీను భార్య జినుకల దివ్య కుటుంబాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జిల్లా…
  • దివ్య కొంతకాలంగా తలలో కణితి కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందడం పట్ల రవి పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
  • దివ్య మృతితో భర్త శ్రీను, ఇద్దరు కుమార్తెలు తీవ్ర విషాదంలో ఉన్నారని, ఈ కష్టకాలంలో పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కోశాధికారి జినుకల శ్రీను భార్య జినుకల దివ్య కుటుంబాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జిల్లా నాయకులతో కలిసి పరామర్శించారు.

దివ్య కొంతకాలంగా తలలో కణితి కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందడం పట్ల రవి పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివ్య మృతితో భర్త శ్రీను, ఇద్దరు కుమార్తెలు తీవ్ర విషాదంలో ఉన్నారని, ఈ కష్టకాలంలో పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మరియు జిల్లా నాయకులు కలిసి దివ్య కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో ఇద్దరు కుమార్తెల చదువులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జినుకల శ్రీనుతో ఫోన్‌లో మాట్లాడి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. పిల్లలను తాను తప్పకుండా కలుస్తానని, పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే స్వయంగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని తెలిపారు. దివ్య మృతికి టీఆర్పీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, పిట్టల వెంకటేష్, గండు కరుణాకర్, గంధం సతీష్, మడే సంతోష్, పింగిడి శంకరయ్య, మోటపోతుల సమ్మయ్య, శంకరయ్య, మేనం సంతోష్, పిట్టల రాంబాబు, గట్టు శ్రీకాంత్, కోయ సమ్మయ్య, కమలాపూర్ గ్రామ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *