Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

శ్రావణ శుక్రవారం సందర్భంగా కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్ల పల్లకి సేవ ఘనంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రావణ శుక్రవారం సందర్భంగా కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్ల పల్లకి సేవ ఘనంగా

వార్త ముఖ్యాంశాలు

  • మహానంది : శ్రావణ శుక్రవారం సందర్భంగా మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారు, మహానందీశ్వర స్వామివార్ల పల్లకి సేవను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
  • ఆలయ అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం పల్లకి సేవ చేపట్టారు.స్వామివార్లను పల్లకిలో ఆలయ ప్రాంగణంలో ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
  • పల్లకి సేవ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి.

మహానంది : శ్రావణ శుక్రవారం సందర్భంగా మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారు, మహానందీశ్వర స్వామివార్ల పల్లకి సేవను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం పల్లకి సేవ చేపట్టారు.స్వామివార్లను పల్లకిలో ఆలయ ప్రాంగణంలో ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. పల్లకి సేవ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *