ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ 4 వేలు పెన్షన్ పంపిణీ చేస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తోంది. ప్రతీ నెలా సీఎం చంద్రబాబు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు పైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా.. ఈ నెల పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం మార్చి 1న పెన్షన్ పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1, 2026 బదులుగా ఫిబ్రవరి 28నే పింఛన్లు అందనున్నాయి. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి డిసెంబర్ 27 నాటికి నగదు అందజేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 28 నే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ, ఏవైనా మిగిలిపోతే, ఆయా పింఛన్లను మార్చి 2న పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మార్చి1న ఆదివారం కావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు.
తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కీలక తీర్పు, ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..!!
ఈ నెల 28నే పెన్షన్ల పంపిణీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు రూ.4000 అందిస్తున్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.6000, పూర్తి వికలాంగులకు రూ.10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10000 ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛన్‌దారులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ.2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటివద్దనే పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజునే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్దం అయిది. ఆ రోజున ఎవరికైనా అందక పోతే మార్చి 2న లబ్దిదారులకు అందించనున్నారు.

