Monday, 23 March 2026
  • Home  
  • జీవీఎంసీ కౌన్సిల్‌లో రచ్చ.. మేయర్–వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట
- విశాఖపట్నం

జీవీఎంసీ కౌన్సిల్‌లో రచ్చ.. మేయర్–వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్‌లో తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అది స్వల్ప తోపులాటకు దారితీసింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించిన వైసీపీ సభ్యులు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్ హాల్‌లో నేలపై పడుకుని నిరసన తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొంతసేపు కౌన్సిల్ సమావేశం గందరగోళంగా కొనసాగింది.

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి)

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్‌లో తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అది స్వల్ప తోపులాటకు దారితీసింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించిన వైసీపీ సభ్యులు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్ హాల్‌లో నేలపై పడుకుని నిరసన తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొంతసేపు కౌన్సిల్ సమావేశం గందరగోళంగా కొనసాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.