డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ మండల ప్రజా పరిషత్ కార్యాలయం, మామిడికుదురు అర్జంట్ సర్కులర్
విషయం:- మండల ప్రజా పరిషత్, మామిడికుదురు వివిధ రకాల ఫ్లెక్స్లు మామిడికుదురు మండల పరిధిలో వున్న గ్రామములో అనుమతి లేని ఫ్లెక్స్ లు తక్షణమే తొలగించవలసినదిగా ఆదేశాలు జారి చేయుట – గురించి.
సూచిక:- మామిడికుదురు మండలం, నగరం సబ్ ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి లేఖ తేది.3-9-2025.
మామిడికుదురు మండల ప్రజా పరిషత్ ఆధీనములో వున్న గ్రామ పంచాయితీ లలో వివిధ రకాల ప్లెక్స్ లు ఏర్పాటు చేయుట వలన లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అనుమతి లేని ప్లెక్స్ లు తొలగించవలసినదిగా పై సూచిక లో నగరం సబ్ ఇనస్పెక్టర్ వారు తెలియజేసియున్నారు.
కావున, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా అందరు పంచాయితీ కార్యదర్శులు మీ మీ గ్రామములలో వివిధ వ్యక్తులు ఏర్పాటు చేసిన (వివిధ రకాల) ప్లెక్స్ లు పంచాయితీలో రిజిస్టర్ కాబడని ప్లెక్స్ లు వెంటనే తొలగించవలసినదిగా ఆదేశించడమైనది మరియు మీ గ్రామము లో పూర్తిగా ప్లెక్స్ లు తొలగించబడినట్లుగా ద్రువ పత్రం ఈ కార్యాలయమునకు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది. అట్లు మీ గ్రామములో ప్లెక్స్ లు తొలగించలేదని కొనుగొనబడిన యెడల మీ పై క్రమ శిక్షణ చర్య తీసికోనబడునని తెలియజేయడమైనది.
నకు : అందరు పంచాయితి కార్యదర్శులు వారికీ
నకలు: తహసిల్దార్, మామిడికుదురు వారికీ
నకలు : సబ్ ఇనస్పెక్టర్ అఫ్ పోలీస్, నగరం వారికీ


