Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

40 ఏళ్లుగా ఒకే గణపతి.. ఐక్యతే గ్రామ సంప్రదాయం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
40 ఏళ్లుగా ఒకే గణపతి.. ఐక్యతే గ్రామ సంప్రదాయం!
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • భజనలు, కీర్తనలు, అన్నదానంతో మత సామరస్యాన్ని చాటుతున్న అబ్దుల్లాపూర్ అబ్దుల్లాపూర్: వినాయక చవితి ఉత్సవాల్లో అబ్దుల్లాపూర్ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
  • మండలంలోని ఈ గ్రామంలో గత 40 ఏళ్లుగా గ్రామస్తులంతా కలిసి ఒకే గణపతిని ప్రతిష్ఠించి, ఐక్యతతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
  • శనివారం మోక్ష (కర్ర) గణపతి వద్ద నిర్వహించిన భజనలు, కీర్తనల్లో చాక్పెల్లికి చెందిన షేక్ హైమద్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.

భజనలు, కీర్తనలు, అన్నదానంతో మత సామరస్యాన్ని చాటుతున్న అబ్దుల్లాపూర్

అబ్దుల్లాపూర్: వినాయక చవితి ఉత్సవాల్లో అబ్దుల్లాపూర్ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మండలంలోని ఈ గ్రామంలో గత 40 ఏళ్లుగా గ్రామస్తులంతా కలిసి ఒకే గణపతిని ప్రతిష్ఠించి, ఐక్యతతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

శనివారం మోక్ష (కర్ర) గణపతి వద్ద నిర్వహించిన భజనలు, కీర్తనల్లో చాక్పెల్లికి చెందిన షేక్ హైమద్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. గ్రామంలో 11 రోజులపాటు జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో హిందువులతో పాటు ముస్లిం కుటుంబాలు కూడా పాల్గొంటున్నాయి. గణపతి ప్రసాదాన్ని స్వీకరించడంతో పాటు ఉత్సవాల నిర్వహణకు తమవంతు సహకారం అందిస్తున్నారు.

11 రోజులూ మహాప్రసాదమే

వినాయక నవరాత్రుల 11 రోజులపాటు గ్రామస్తులంతా ఇళ్లలో వంట చేసుకోకుండా గణపతి మండపంలో తయారు చేసే మహాప్రసాదాన్ని ఉదయం, సాయంత్రం కలిసి స్వీకరిస్తున్నారు. భక్తులు, గ్రామస్తులు కలిసి మహాప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మూడేళ్ల ముందుగానే అన్నదానం బుకింగ్లు
గణపతి మండపం వద్ద నిర్వహించే అన్నదానానికి భక్తుల నుంచి మంచి స్పందన ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. అన్నదానం నిర్వహించే అవకాశం కోసం మూడేళ్ల ముందుగానే బుకింగ్లు పూర్తవుతున్నాయని చెప్పారు.

మద్యం, మాంసాహారానికి దూరంగా..

వినాయక నవరాత్రుల 11 రోజులపాటు గ్రామస్తులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. పూజలు, భజనలు, కీర్తనలు, అన్నదాన కార్యక్రమాలను అందరూ కలిసి నిర్వహిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *