Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట:* సూళ్లూరుపేటలో ప్రధానమైన జీఎన్టీ రోడ్డుపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు నిఘా పెట్టారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సూళ్లూరుపేట:* సూళ్లూరుపేటలో ప్రధానమైన జీఎన్టీ రోడ్డుపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు నిఘా పెట్టారు.

వార్త ముఖ్యాంశాలు

  • *Date: 23-09-2026 | Time: 12:35 PM* *ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల కఠిన చర్యలు | Sullurpeta Police Issue Notices Over Traffic, Encroachments* *సూళ్లూరుపేట:* సూళ్లూరుపేటలో ప్రధానమైన జీఎన్టీ రోడ్డుపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు నిఘా పెట్టారు.
  • రోడ్డు ఇరువైపులా ఆక్రమణలు, రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేస్తున్న ద్విచక్ర వాహనాల వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని గుర్తించిన పోలీసులు, ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
  • *ఎస్ఐ అజయ్ కుమార్* ఆధ్వర్యంలో పోలీసు బృందం జీఎన్టీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పరిశీలించి, రోడ్డును ఆక్రమించుకున్న వ్యాపారులకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.

*Date: 23-09-2026 | Time: 12:35 PM*

*ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల కఠిన చర్యలు | Sullurpeta Police Issue Notices Over Traffic, Encroachments*

*సూళ్లూరుపేట:* సూళ్లూరుపేటలో ప్రధానమైన జీఎన్టీ రోడ్డుపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు నిఘా పెట్టారు.

రోడ్డు ఇరువైపులా ఆక్రమణలు, రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేస్తున్న ద్విచక్ర వాహనాల వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని గుర్తించిన పోలీసులు, ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

*ఎస్ఐ అజయ్ కుమార్* ఆధ్వర్యంలో పోలీసు బృందం జీఎన్టీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పరిశీలించి, రోడ్డును ఆక్రమించుకున్న వ్యాపారులకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. వెంటనే ఆక్రమణలు తొలగించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే రోడ్డుపై ఇష్టానుసారంగా బైకులు నిలపడం వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు కూడా పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *